Salman Khan: బిగ్ బాస్ స్టేజ్ పై సల్మాన్ కన్నీళ్లు.. సిద్ధార్థ్ ను గుర్తుచేసుకుంటూ..
బిగ్ బాస్ ఫేమ్ షెహనాజ్.. సల్మాన్ ను చూసి ఎమోషనల్ అయింది. వెంటనే అతడు హగ్ చేసుకొని ఆమెని ఓదార్చే ప్రయత్నం చేశారు.
బాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 15 ఫైనల్ దశకు చేరుకుంది. రేపటి ఎపిసోడ్ తో ఈ సీజన్ పూర్తి కానుంది. ఫినాలే ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సెలబ్రిటీలు డాన్స్ పెర్ఫార్మన్స్ చేయనున్నారు. సీజన్ 13 కంటెస్టెంట్ షెహనాజ్ గిల్ కూడా ఈ ఈవెంట్ లో భాగం కానుంది. దివంగత నటుడు, షెహనాజ్.. బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ శుక్లాను గుర్తు చేసుకుంటూ.. తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో అతడికి ట్రిబ్యూట్ ఇవ్వబోతుంది.
దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. డాన్స్ పెర్ఫార్మన్స్ అనంతరం షెహనాజ్ ను స్టేజ్ పైకి పిలిచారు సల్మాన్ ఖాన్. అప్పటివరకు స్ట్రాంగ్ గా ఉన్న షెహనాజ్.. సల్మాన్ ను చూసి ఎమోషనల్ అయింది. వెంటనే అతడు హగ్ చేసుకొని ఆమెని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత సిద్ధార్థ్ ను గుర్తుచేసుకుంటూ సల్మాన్ కూడా స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్నారు.
వీరిద్దరూ అలా ఏడవడం చూసి అభిమానులు తట్టుకోలేపోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. షెహనాజ్ ను ధైర్యంగా ఉండమంటూ సలహాలు ఇస్తున్నారు.
ఇక బిగ్ బాస్ షో విషయానికొస్తే.. ట్రోఫీ కోసం పోటీ పడుతున్న కంటెస్టెంట్స్ ఎవరంటే.. ప్రతీక్, నిశాంత్, షమితా, తేజస్వి, కరణ్, రాఖీ, రష్మి. వీరిలో ట్రోఫీ ఎవరికి దక్కుతుందో రేపటి ఎపిసోడ్ లో తేలనుంది.
View this post on Instagram
View this post on Instagram