Berlin: డిసెంబర్‌లో మళ్లీ పలకరించనున్న బెర్లిన్ - ఈసారి హీరో కూడా!
బెర్లిన్ మనీ హెయిస్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది.
Berlin Web Series On Netflix: నెట్‌ఫ్లిక్స్ ప్రసిద్ధ వెబ్ సిరీస్ మనీ హెయిస్ట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐదో సీజన్‌తో మనీ హెయిస్ట్ సిరీస్ ముగిసిపోయినా ఇంకేంటి గుడ్ న్యూస్ అనుకుంటున్నారా? మొదటి సీజన్ ద్వారా ఎంతో పేరు పొందిన బెర్లిన్ పాత్రకు స్పిన్ ఆఫ్ సిరీస్ సిద్ధం అయింది. 2023 డిసెంబర్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనుంది. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను ప్రకటించారు. ఈ వీడియోలో విడుదలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు.
మనీ హెయిస్ట్ సీజన్ 5లో ఫ్లాష్‌బ్యాక్‌లో బెర్లిన్, తన కొడుకుల ట్రాక్ అసలు కథకు సమాంతరంగా నడుస్తుంది. అయితే ఈ ట్రాక్‌ను ప్రస్తుత కథకు ఎలా లింక్ చేశాడనే విషయం కూడా మైండ్ బ్లోయింగ్‌గా రివీల్ చేశారు. అసలు బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ దొంగతనం చేయాలనే ఆలోచన ఎవరిది అని రివీల్ చేసే ఎపిసోడ్ కూడా మనీ హెయిస్ట్ సీజన్ 5లో బాగా పండింది.
పాస్‌వర్డ్ షేరింగ్‌ను త్వరలో ముగించనున్నట్లు కూడా నెట్‌ఫ్లిక్స్ ఇటీవల ప్రకటించింది. తన సబ్‌స్క్రిప్షన్ల సంఖ్యను పెంచుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నందున సబ్‌స్క్రైబర్లకు ఈ విషయం తెలిపింది. ఇప్పుడు, కంపెనీ తన FAQ (తరచుగా అడిగే ప్రశ్నలు) పేజీని మరిన్ని వివరాలతో అప్‌డేట్ చేసింది. ఇద్దరు వేర్వేరు వినియోగదారులు ఒకే ఖాతాను ఉపయోగించకుండా ఎలా ఆపివేస్తుంది? మీ ఇంట్లో నివసించని వ్యక్తులు సిరీస్‌లు, సినిమాలు చూడటానికి వారి సొంత ఖాతాలను ఉపయోగించాల్సి ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ స్పష్టంగా పేర్కొంది.
FAQ సెక్షన్‌లో మీ నెట్‌ఫ్లిక్స్ ఇంట్లో లేని డివైస్ నుంచి ఎవరైనా మీ ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు లేదా మీ బయట నుంచి మీ ఖాతాను నిరంతరం యాక్సెస్ చేసినట్లయితే, కంపెనీ ఆ డివైస్‌ను వెరిఫై చేయాలని కోరనుంది.
"మీ ఇంటి వెలుపల ఉన్న డివైస్ నుంచి మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్లో సైన్ ఇన్ చేసినప్పుడు లేదా నిరంతరం ఉపయోగించినప్పుడు, ఆ డివైస్‌ను వెరిఫై చేయాల్సిందిగా నెట్‌ఫ్లిక్స్ కోరే అవకాశం ఉంది. డివైస్ ఉపయోగిస్తున్నట్లు నిర్ధారించడానికి మేం దీన్ని చేస్తాము. డిటైల్స్ కోసం దిగువన ఉన్న 'Verifying a device' చూడండి. మీరు మీతో నివసించని వారితో మీ ఖాతాను షేర్ చేస్తే Netflix ఖాతా రెన్యువల్ అవ్వదు."
డివైస్‌ను వెరిఫై చేయడగానికి Netflix OTP (వన్-టైమ్ పాస్‌వర్డ్) కోసం ప్రాథమిక ఖాతా యజమాని అందించిన ఈ-మెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబర్‌కు లింక్‌ను పంపుతుంది. వినియోగదారులు 15 నిమిషాల లోపు ఆ కోడ్‌ను నమోదు చేయాలి.
అంటే దీని అర్థం వినియోగదారులు ఇప్పటికీ ఖాతాలను షేర్ చేసుకోవచ్చు. వీరు పాస్‌వర్డ్‌లను కూడా షేర్ చేసుకోవచ్చు. అయితే నెట్‌ఫ్లిక్స్‌కు ఏదైనా అనుమానం వస్తే సెకండరీ ఖాతాదారుని బ్లాక్ చేయవచ్చు లేదా ఫైన్ విధించవచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఖాతాను షేర్ చేసే వినియోగదారులను తనిఖీ చేయడానికి అదే పద్ధతిని ఉపయోగించడం ప్రారంభించినప్పటికీ, ఇది సెక్యూరిటీ చెక్ అని అర్థం చేసుకోవచ్చు.