Balakrishna New Movie : బాలకృష్ణతో యువ దర్శకుడి సైకలాజికల్ డ్రామా
కథ నచ్చితే కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడానికి నట సింహం నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ రెడీ! ఆయనతో సినిమా చేయడానికి ఓ యువ దర్శకుడు రెడీగా ఉన్నారు. కథ కూడా రెడీ! కానీ, ట్విస్ట్ ఏంటంటే...
![Balakrishna New Movie : బాలకృష్ణతో యువ దర్శకుడి సైకలాజికల్ డ్రామా Balakrishna New Movie Venkatesh Maha Didn't pitched any story to Balakrishna But He has psychological drama with dark comedy story Balakrishna New Movie : బాలకృష్ణతో యువ దర్శకుడి సైకలాజికల్ డ్రామా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/09/ee6becfdec418ee5bd334588aab0df511667962874373313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) దర్శకుల హీరో. కథ నచ్చితే ఆయన కొత్త దర్శకులతో చేయడానికి ఎప్పుడూ రెడీయే. ఒక్కసారి కథ ఓకే చేసిన తర్వాత మళ్ళీ అందులో జోక్యం చేసుకోవడం వంటివి ఉండవు. అందుకే, ఆయనతో సినిమా చేయడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు 'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకటేష్ మహా (Venkatesh Maha) కూడా ఆయనతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే... ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది! అది ఏంటంటే...
బాలకృష్ణకు కథ చెప్పలేదు!
అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన 'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ కార్యక్రమంలో వెంకటేష్ మహా కూడా పాల్గొన్నారు. వేదికపై మాట్లాడే సమయంలో బాలకృష్ణ గారితో తనకు సినిమా చేయాలని ఉందని మనసులో మాట చెప్పారు. దాంతో బాలయ్యకు కథ చెప్పారని, త్వరలో సినిమాలు పట్టాలు ఎక్కుతుందని వార్తలు వచ్చాయి. వాటిలో ఎంత మాత్రం నిజం లేదని వెంకటేష్ మహా పేర్కొన్నారు.
బాలకృష్ణకు సరిపోయే కథ...
సైకలాజికల్ డ్రామా... డార్క్ కామెడీ!
బాలకృష్ణకు తాను ఇంకా కథ చెప్పలేదని, ఒకవేళ ఆయన నుంచి ఫోన్ వస్తే కథ చెప్పడానికి రెడీగా ఉన్నానని వెంకటేష్ మహా తెలిపారు. ఆయన దగ్గర ఐడియాస్ ఉన్నాయని చెప్పారు. ''స్క్రీన్ ప్లేతో సహా నా దగ్గర ఒక కథ ఉంది. బాలకృష్ణ గారికి అయితే ఆ కథ అద్భుతంగా ఉంటుంది. అదొక సైకలాజికల్ డ్రామా. అందులో డార్క్ కామెడీ కూడా ఉంటుంది. క్యారెక్టర్ కోసం బాలకృష్ణ గారు బాడీ పరంగా కొంచెం ట్రాన్స్‌ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న ఓ అంశాన్ని అందరికీ అర్ధమయ్యే రీతిలో రాసుకున్నాను. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది'' అని ఓ మీడియా సంస్థతో వెంకటేష్ మహా చెప్పారు.
Also Read : నేను ఒక్కరోజు టైమ్ తీసుకుంటా! కానీ, 'యశోద'కు... : సమంత ఇంటర్వ్యూ
చిన్నతనంలో తాను 'బంగారు బుల్లోడు' పాటలకు డ్యాన్స్ చేసేవాడినని వెంకటేష్ మహా చెప్పారు. ఎవరూ చేయని సినిమాలు బాలకృష్ణ చేశారని... 'భైరవ ద్వీపం', 'ఆదిత్య 369' వంటి సినిమాలు ధైర్యంగా చేశారని యువ దర్శకుడు చెబుతున్నారు.
అనిల్ రావిపూడి తర్వాత ఏంటి?
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీర సింహా రెడ్డి' చేస్తున్నారు బాలకృష్ణ. ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. దీని కోసం ఐదు రోజులు అనంతపురంలో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆల్రెడీ స్టోరీ ఫిక్స్ చేశారు. బాలకృష్ణ డేట్స్ ఇస్తే చకచకా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఏంటి? అనేది ఇంకా డిసైడ్ కాలేదు.
బాలకృష్ణతో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు రెడీగా ఉన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. 'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ వేడుకలో 'గీత గోవిందం', 'సర్కారు వారి పాట' చిత్రాల దర్శకుడు పరశురామ్ కూడా బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. మరి, ఏ సినిమా ఓకే అవుతుందో చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)