Avatar Na'vi language : 'అవతార్'లో ఈ పదాలకు మీకు అర్థం తెలుసా? తెలిస్తే సినిమా సూపర్
Top Ten Words In Avatar 2 and Meaning : 'అవతార్ 2' థియేటర్లలో విడుదలైంది. సినిమాలో పేర్లు అర్థం కాలేదని కొందరు చెబుతున్నారు. 'అవతార్ 2'లో అసలు ఏం పేర్లు ఉన్నాయి? అర్థం ఏమిటి?
జేమ్స్ కామెరూన్ అద్భుత దృశ్య కావ్యం 'అవతార్ 2' (Avatar 2) థియేటర్లలో విడుదలైంది. పండోరా గ్రహాన్ని ఆయన చూపించిన తీరు, ఈ సారి అండర్ వాటర్ సీన్స్, సముద్రం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు... ప్రేక్షకుల కళ్ళను కట్టి పడేస్తోంది. అద్భుతమైన దృశ్యాలు చూపు తిప్పుకోనివ్వడం లేదని ప్రేక్షకులలో కొందరు చెబుతున్నారు. పండోరా గ్రహంలోని నావి జాతికి ఓ ప్రత్యేకమైన భాష ఉంటుంది. అందులో కొన్ని పదాలు 'అవతార్' సినిమాలో తరచూ వినిపిస్తూ ఉంటాయి. అలా బాగా వినిపించే టాప్ టెన్ వర్డ్స్ ఏంటో చూద్దాం!
Naavi : 'నావి' అనేది పండోరా గ్రహంపై బతుకుతున్న ఓ జాతి. చూడటానికి అచ్చం మనుషుల్లానే కనిపించే ఈ పొడుగాటి జాతిలో అనేక ఉప జాతులు కూడా ఉంటాయి. పండోరా గ్రహం మీద అనేక ప్రాంతాల్లో నావి జాతి ప్రజలు వేర్వేరు ఉప జాతులుగా విడిపోయి జీవిస్తున్నారు. వీళ్లలో ఒక్కొకరికి ఒక్కో ప్రత్యేకత కూడా ఉంటుంది.
Omaticaya Clan : నావి జాతిలో 'ఒమటికాయ' ఓ ప్రజాతి. అవతార్ సినిమాల కథానాయకుడు జేక్ సల్లీ ఒమటికాయ ప్రజాతికి నాయకుడు. ఈ పదవిని చేపట్టేందుకు పార్ట్ 1లో జేక్ సల్లీ చేసిన ప్రయాణాన్ని చూపించారు. ఒమటికాయ ప్రజలు నీలం రంగులో మెరిసిపోతూ ఉంటారు. చెట్లపైన జీవిస్తూ... బాణాలు, ఇక్రాన్ అని పిలిచే డ్రాగన్ లాంటి జీవులపైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు.
Metkayina : నావి జాతిలో 'మెట్ కాయినా' కూడా ఓ ప్రజాతి. ఒమటికాయలు అడవుల్లో జీవిస్తే... మెట్ కాయినా జాతి సముద్ర తీరాల్లో జీవిస్తూ ఉంటుంది. అవతార్ పార్ట్ 2 అంతా మెట్ కాయినా ప్రజాతి చుట్టూనే సాగుతుంది. కొంచెం లేత నీలం రంగు, ఆకుపచ్చ పోలిన రంగుల్లో ఉంటారు వీళ్లు. సముద్రం లోతుల్లో ప్రయాణాలు చేయటం, చేపల్లా ఈదటం, తిమింగలాలతో సాన్నిహిత్యం ఇలా వీళ్లకుంటూ చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఒమటికాయ ప్రజలకు ఇక్రాన్ లు ఉన్నట్లే... 'మెట్ కాయినా' ప్రజలకు ఈలు అని పిలుచుకునే నీటి గుర్రాలు ఉంటాయి.
Toruk Makto : 'తురుక్' అంటే అర్థం లాస్ట్ షాడో అని. తురుక్ అనేది ఓ భారీ ఫ్లైయింగ్ క్యాట్. దాన్ని లొంగదీసుకుని రైడ్ చేసిన వాడిని 'తురుక్ మక్తో' అంటారు. అంటే నాయకుడు అని అర్థం. 'అవతార్' ఫస్ట్ పార్ట్ లో తురుక్ ను లొంగదీసుకున్న తర్వాతనే జేక్ సల్లీని ఒమటికాయ పీపుల్ నాయకుడిగా అంగీకరిస్తారు.
Also Read : 'అవతార్ 2' రివ్యూ : జేమ్స్ కామెరూన్ డిజప్పాయింట్ చేశాడా? వావ్ అనిపించాడా?
Tulkun : భూమిపైన తురుక్ ఎలా శక్తివంతమైనదో? అలానే నీటిలో శక్తివంతమైంది 'టుల్‌కున్'. అంటే ఓ భారీ తిమింగిలం లాంటి ప్రాణి. రెండు కళ్లతో కనిపించే ఈ టుల్‌కున్స్ సముద్ర తీర ప్రాంతాల్లో జీవించే మెట్ కాయినా ప్రజలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటాయి. వాళ్లతో కమ్యూనికేట్ అవుతుంటాయి కూడా.
Eywa : ఈవా అంటే గాడ్. పండోరాలో ఉన్న అన్నింటినీ అనుసంధానించే ఓ శక్తి. 'గ్రేట్ గ్రాండ్ మదర్'గా పిలుచుకునే ఈవా... ట్రీస్ ఆఫ్ స్పిరిట్ ద్వారా తన ఆలోచనలను, అనుభవాలను నావి జాతి ప్రజలకు అందిస్తూ ఉంటుంది. అందుకే సినిమాలో చాలా సార్లు ఈవా ప్రస్తావన వస్తుంది.
Amrita : టుల్‌కున్ తిమింగలాల మెదడులో ఉండే ఓ పదార్థమే 'అమృత'. తిమింగలాల తెలివికి, మనుషులతో కమ్యూనికేట్ కావటానికి ఈ అమృతమే కారణమని పండోరా గ్రహానికి వెళ్లిన మనుషులు భావిస్తుంటారు. వయస్సును ఆపేసి యవ్వనంలో ఉండగలిగే శక్తి అమృతకి ఉందని భావించి నావి జాతి ప్రజలపై దాడికి దిగుతారు.
Also Read : 'అవతార్ 2'లో కేట్ విన్స్‌లెట్ ఎక్కడ? ఆమెను ఎంత మంది గుర్తు పట్టారు?
Oel Ngati Kameie : 'వెల్ నాటీ కామేయ్' అంటే 'I See You' అని అర్థం. నావి జాతి ప్రజలు ఇచ్చిపుచ్చుకునే హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఇది. 'నేను నిన్ను చూశాను' అనే చిన్న మీనింగ్ కాదు. ఈవా పవర్ నీతో ఉందని... నువ్వు సాధించగలవనే నమ్మకం నాకు అర్థమవుతోందని, నిన్ను నమ్ముతున్నాను, నీ వెనకే ఉంటాను అని ధైర్యం ఇవ్వటం సాటి మనిషికి తోడు నిలబడటం లాంటి సందర్భాల్లోనే నావి జాతి I See You అని అంటుంది. అందుకే అవతార్ చాలా ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రమే I See You అని మనం వింటాం.
Tsaheylu : సహేలు అంటే బాండ్ అని అర్థం. నావి జాతి ప్రజలు పండోరా గ్రహంపై ఉన్న జంతువులతో, మొక్కలతో, ఆఖరకు వాళ్ల దైవం ఈవాతో కనెక్ట్ అవ్వాలన్నా... ఈ సహేలు అనే బంధాన్ని వాడుతారు. చూడటానికి వెంట్రుకలు ముడి వేసుకుంటున్నట్లు ఉండే ఈ బాండ్ నావి జాతికి చాలా ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి
Sky People : 'అవతార్'లో స్కై పీపుల్ అంటే మనుషులు అనే అర్థం. భూమిపై నుంచి పండోరాపైకి వెళ్ళిన మనుషులను వాళ్ళు ఏలియన్స్ గా భావిస్తారు. మోరాన్స్, డీమోన్స్, స్కై పీపుల్ ఇలా రకరకాల పేర్లతో నావి జాతి ప్రజలు మనుషులను పిలుస్తుంటారు.
Also Read : దేవతలు అసురుల కథనే జేమ్స్ కామెరూన్ తీసుకున్నారా?
ఇవి టాప్ 10 టెర్నినాలజీ ఇన్ అవతార్. మీకు తెలిసినవి ఇంకా ఉంటే మాతో షేర్ చేసుకోండి.