వీడియో: బైకుపై రష్మిక వెంటపడ్డ అభిమానులు - హెల్మెట్ పెట్టుకోమంటూ స్వీట్ వార్నింగ్!
ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కు చెన్నైలో వింత ఘటన ఎదురైంది. ఆమె వెళ్తున్న కారును కొంత మంది ఆకతాయిలు ఫాలో అయ్యారు. దీంతో ఆమె కారు ఆపి వారికి వార్నింగ్ ఇచ్చింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
నటి రష్మిక మందాన్న కారును కొంతమంది ఆకతాయిలు వెంబడించారు. దీంతో రష్మిక తన కారును స్లో చేసి.. వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. బైకు మీద ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండని సలహా ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.
రష్మిక.. తమిళ నటుడు విజయ్‌లో కలిసి ‘వారిసు’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ మూవీని ‘వారసుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇటీవలే మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. అయితే ప్రీ రిలీజ్ ప్రోగ్రాం తర్వాత హోటల్ కు బయలుదేరిన రష్మికాకు ఈ వింత ఘటన ఎదురైంది.
కొంత మంది అభిమానులు ఆమె వెళ్తున్న కారు వెంటపడ్డారు. కొంత దూరం ఫాలో అయ్యారు. అది గమనించిన రష్మిక కారు సిగ్నల్ దగ్గర ఆగినపుడు వారితో మాట్లాడింది. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అంటూ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ యువకులు పెట్టుకుంటాం అనగానే.. ఇప్పుడే పెట్టుకోండి. బైక్ పై జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోయింది. ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Full video ..
— Rashmika Sri Lankan FC 🇱🇰❤️ (@lanka_rashmika) December 27, 2022
Put on the helmet ..
how caring she is..
❤️❤️❤️ @iamRashmika#RashmikaMandanna#RashmikaMandana #Rashmika pic.twitter.com/Br1NEQPhwt
ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా రష్మిక సూపర్ అంటూ కొంత మంది, మా మనసులు గెలుచుకున్నావ్ అని ఇంకొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక తమిళంలో హీరో కార్తి నటించిన ‘సుల్తాన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ‘వారిసు’ చిత్రంతో మరోసారి తమిళ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. విజయ్-రష్మిక జంటను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
View this post on Instagram
రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది మెత్తం రష్మికదే అని చెప్పాలి. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియా ఎక్కడ చూసినా రష్మిక గురించే వార్తలు. మొన్నామధ్య ‘కాంతార’ సినిమా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలతో కొన్ని వారాల పాటు ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు నడిచాయి. ఆమెను కన్నడ సినిమా పరిశ్రమ నుంచి బ్యాన్ చేశారని వార్తలు కూడా వచ్చాయి. అయితే దానిపై తర్వాత రష్మిక స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు ఫులిస్టాప్ పడింది. ఇక ‘పుష్ప’ లాంటి సినిమాలతో రష్మిక క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘సీతారామం’ లాంటి క్లీన్ లవ్ స్టోరీ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. బాలీవుడ్ లోనూ తనదైన స్టైల్ తో దూసుకెళ్తోంది రష్మిక. ఇటీవల అమితాబ్ బచ్చన్ తో ‘గుడ్ బై’ సినిమాలో నటించింది. కానీ, ఆ మూవీ ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. తర్వాత బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా కాంబినేషన్ లో ‘మిషన్ మజ్ను’ సినిమాలో నటించింది. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా 2023 జనవరిలో రానుంది. త్వరలో ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ లో పాల్గొనుంది ఈ బ్యూటీ.