అనుపమ కొత్త సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో - రిలీజ్ ఎప్పుడంటే?
అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా ‘బటర్ ఫ్లై’ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది.

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ నెలలో రెండు సార్లు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నెల 23వ తేదీన ‘18 పేజెస్’ థియేటర్లలో విడుదల కానుంది. అయితే డిసెంబర్ 29వ తేదీన తన ‘బటర్ ఫ్లై’ సినిమా నేరుగా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ భూమిక కూడా కీలక పాత్రలో కనిపించనుంది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను గంటా సతీష్ బాబు తీసుకున్నారు. జెన్ నెక్స్ట్ సినిమా బ్యానర్‌పై రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్వీజ్, గిడియోన్ కట్టా సంగీతం అందిస్తున్నారు.
ఇక అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న మరో సినిమా 18 పేజెస్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. ఈ సినిమాలో తమిళ హీరో శింబు పాడిన 'టైమ్ ఇవ్వు పిల్లా...' అనే పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటను శింబు ఆలపించిన సంగతి తెలిసింది. లేటెస్టుగా విడుదల అయిన ఈ సాంగ్ లిరికల్ వీడియో వింటే... బ్రేకప్ సాంగ్ అని ఈజీగా అర్థం అవుతోంది. అబ్బాయికి అమ్మాయి హ్యాండ్ ఇస్తే? కాన్సెప్ట్ బేస్ చేసుకుని రాసినట్టు ఉన్నారు. '18 పేజెస్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై 'బన్నీ' వాసు నిర్మించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న సినిమా రిలీజ్ అవుతోంది.
బ్రేకప్ బాధలో ఉన్న అబ్బాయి... తన ప్రేయసి మరొకరితో ఇన్‌స్టాగ్రామ్ రీల్ పోస్ట్ చేస్తే? అమ్మాయి గూగుల్ కొటేషన్స్ పోస్ట్ చేస్తే? ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతున్న యువకుడి మనసును శ్రీమణి పాటలో రాశారు. ఫుల్ బాటిల్ కొట్టినా ఎక్కలేదు, రోస్టింగ్ చేసినావు వంటి యూత్ పదాలు పాటలో ఎక్కువ వినిపించాయి. శింబు వాయిస్ ఈ పాటను ట్రెండీగా మార్చింది. నిఖిల్ డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ బావున్నాయి.
'టైమ్ ఇవ్వు పిల్లా' పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మాదాపూర్ ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఈ పాట కంటే ముందు '18 పేజెస్' నుంచి 'నన్నయ్య రాసిన...' పాటను విడుదల అయ్యింది. దానికి శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. టీజర్ కూడా ట్రెండ్ అయ్యింది. నిఖిల్, ఆమె నటించిన రెండో చిత్రమిది. తెలుగులో మాత్రమే కాదు... హిందీలో కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన 'కార్తికేయ 2' సినిమాలో నటించిన నిఖిల్, అనుపమ జంటగా నటించిన సంగతి తెలిసిందే.
Butterflies were flying all over social media to announce something exciting🦋 #ButterflyOnHotstar from Dec 29, only on @DisneyPlusHSTel.@anupamahere #GennexTMovies @NihalKodhaty1 @bhumikachawlat @gsatishbabu8676 @raviprakashbod1 @PrasadTKSVV @PradeepNallime1 pic.twitter.com/3Kdok9BcFm
— Anupama Parameswaran (@anupamahere) December 11, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

