By: ABP Desam | Updated at : 06 Jun 2022 06:53 PM (IST)
'అంటే సుందరానికి' ప్రీరిలీజ్ ఈవెంట్
'శ్యామ్ సింగరాయ్' సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు 'అంటే సుందరానికి' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మొదటినుంచి 'ఆవకాయ్ సీజన్'లో తమ సినిమాను విడుదల చేస్తామని యూనిట్ చెబుతూ వస్తోంది. ఒకేసారి ఏడు విడుదల తేదీలు ప్రకటించి అందరినీ సర్‌ప్రైజ్ చేసిన ఈ టీమ్ ఫైనల్ గా జూన్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
'బ్రోచేవారేవరురా', 'మెంటల్ మదిలో' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ ను విడుదల చేశారు. ఇవన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. జూన్ 8న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో ఈ ఈవెంట్ జరగబోతుంది. మరి దీనికి గెస్ట్ లుగా ఎవరిని పిలుస్తారో చూడాలి!
ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో నాని 'K.P.V.S.S.P.R సుందర ప్రసాద్' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళంలో 'ఆదదే సుందర', మలయాళంలో 'ఆహా సుందర' టైటిల్స్‌తో విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్
Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?
Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ
Hi Nanna: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
/body>