అన్వేషించండి

Animal Trailer: ‘యానిమల్’ ట్రైలర్ : వెయ్యి తప్పులు చేస్తా, ఢిల్లీని తగలెట్టేస్తా - తండ్రిపై అంత ప్రేమా?

Animal Trailer: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ వంగా కాంబోలో వస్తున్న చిత్రం ‘యానిమల్’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది.

Animal Movie Trailer: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ తో తెరకెక్కిన తాజా చిత్రం ‘యానిమల్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజ‌ర్‌, మ్యూజికల్ అప్ డేట్స్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

రక్తంతో నిండిపోయిన ‘యానిమల్’ ట్రైలర్

‘యానిమల్‘ ట్రైలర్ 3 నిమిషాల నిడివితో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ట్రైలర్ అంతా తండ్రి, కొడుకుల మధ్య అనుబంధం చుట్టే తిరుగుతుంది. ఎమోషన్, యాక్షన్‌తో రక్తసిక్తం అయ్యింది. కత్తిపోట్లు, తుపాకీ తూటాల శబ్దంతో భయంకరంగా ఉంది. సినిమాలో పూర్తిగా బాలీవుడ్ నటులే ఉన్నా, సౌత్‌కు దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది. రణ్‌బీర్‌ కపూర్‌పై యాక్షన్‌ సన్నివేశాలు, ఎమోషనల్‌ సీన్స్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతున్నాయి. సినీ అభిమానులు ట్రైలర్ తోనే సినిమా హిట్ అయ్యిందంటున్నారు. సందీప్‌రెడ్డి వంగా మేకింగ్‌ స్టైల్‌ అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో అస‌లైన వైలెన్స్ ఎలా ఉంటుందో ‘యానిమాల్‌’లో చూపిస్తానని సందీప్ కామెంట్ చేశారు. దానికి తగినట్లుగానే ట్రైల‌ర్‌ బ్ల‌డ్ లోమునిగిపోయింది. ట్రైలర్ కొన్ని సీన్లు కట్టిపడేస్తాయి. తండ్రిపై కొడుక్కు ఉండే భయానక ప్రేమ ఆకట్టుకుంటోంది.

అంచనాలకు మించి అలరిస్తున్న ట్రైలర్  

‘అర్జున్ రెడ్డి’ త‌ర్వాత సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీపై అంచ‌నాలు విప‌రీతంగా ఉన్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి ర‌ణబీర్‌ను ఎలా చూపిస్తారు? సందీప్ డైరెక్ష‌న్ ఎలా ఉంటుంది? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ట్రైలర్‌తో బొమ్మ అదుర్స్ అనిపించేలా చేశారు సందీప్. అండర్ వరల్డ్ క్రైమ్ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. తండ్రి, కొడుకుల మధ్య సెంటిమెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ క్లియరెన్స్ తీసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా రన్ టైమ్ 3 గంట‌ల 21 నిమిషాల 23 సెక‌న్లుగా ఫిక్స్ అయ్యింది. సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో తెలుగులో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

 

డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ‘యానిమల్’ విడుదల

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్, బబ్లూ పృథ్వీరాజ్, బాబీ డియోల్ సహా పలువు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో రణబీర్, సందీప్ కలిసి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

Read Also : ‘కంగువ‘ షూటింగ్ లో ప్రమాదం, హీరో సూర్యకు గాయాలు, డాక్టర్లు ఏమన్నారంటే?

Read Also : అనసూయ షాకింగ్ డెసిషన్ - ఎడబాటే అగౌరవానికి సమాధానమంటూ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Embed widget