Butta Bomma Movie : 'బుట్ట బొమ్మ'గా అనిక - రిపబ్లిక్ డే కానుకగా
Butta Bomma Movie Release Date : 'ది ఘోస్ట్'లో నాగార్జున మేనకోడలుగా నటించిన అనికా సురేంద్రన్ గుర్తున్నారా? తెలుగు తెరకు ఆమె నాయికగా పరిచయమవుతున్న సినిమా విడుదలకు సిద్ధమైంది.
'ది ఘోస్ట్' సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున మేనకోడలుగా నటించిన అనికా సురేంద్రన్ (Anikha Surendran) గుర్తు ఉన్నారా? అంతకు ముందు తెలుగులో అనువాదమైన తమిళ సినిమాలు 'ఎంతవాడు గాని', 'విశ్వాసం' సినిమాల్లో కూడా బాల నటిగా చేశారు. త్వరలో ఆమె తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అవుతున్నారు.
'బుట్ట బొమ్మ'గా అనిక
అనికా సురేంద్రన్ కథానాయికగా పరిచయం అవుతున్న సినిమా 'బుట్ట బొమ్మ' (Butta Bomma Movie). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సూర్యదేవర నాగవంశీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలు. ఇందులో అర్జున్ దాస్ (Arjun Das), సూర్య వశిష్ట కథానాయకులు. ఈ చిత్రానికి శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు. ఆయనకూ ఇదే తొలి సినిమా.
రిపబ్లిక్ డే కానుకగా...
Butta Bomma Movie Release Date : 'బుట్ట బొమ్మ' సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు ఈ రోజు నిర్మాతలు వెల్లడించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ... ''గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ప్రేమ కథా చిత్రమిది. ఇందులో హీరో హీరోయిన్ల పాత్రలు అన్నీ సహజంగా సాగుతాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తుండి పోతాయి. ప్రేమలోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ కథ, కథనాలు ఉంటాయి'' అని చెప్పారు.
సినిమాలో సంభాషణలు పాత్రోచితంగా సాగుతూ ఆసక్తి కలిగిస్తాయని చిత్ర బృందం తెలిపింది. వంశీ పచ్చి పులుసు ఛాయాగ్రహణం, గోపీ సుందర్ సంగీతం చిత్రాన్ని మరో మెట్టెక్కిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రేమకథా చిత్రం కావడంతో దీనికి మంచి ప్రేక్షక ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ భారీ సినిమాలు నిర్మిస్తున్నారు. చిన్న సినిమాలు నిర్మించడం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ స్థాపించారు. ఇప్పుడు త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా స్థాపించిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. సంక్రాంతి తర్వాత వస్తుండటం కలిసి వచ్చే అంశం.
Also Read : 'అవతార్ 2'కు మిక్స్డ్ టాక్ రావడానికి ఐదు ముఖ్యమైన కారణాలు
అనిఖా సురేంద్రన్ కథానాయికగా, అర్జున్ దాస్, సూర్య వశిష్ట కథానాయకులుగా నటించిన ఈ సినిమాలో నవ్య స్వామి (Navya Swamy), నర్రా శ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి, ప్రేమ్ సాగర్, మిర్చి కిరణ్, కంచెర్ల పాలెం కిషోర్, మధుమణి తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : నవీన్ నూలి, పోరాటాలు : 'డ్రాగన్' ప్రకాష్, మాటలు : గణేష్ కుమార్ రావూరి, పాటలు: శ్రీమణి, ఎస్. భరద్వాజ్ పాత్రుడు, ఛాయాగ్రహణం : వంశీ పచ్చి పులుసు, సంగీతం : గోపీ సుందర్, నిర్మాతలు : నాగవంశీ సూర్యదేవర, సాయి సౌజన్య, దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్.
Also Read : ఏందిది నారప్ప... 'అవతార్ 2' కథ వెంకటేష్ 'నారప్ప'లా ఉందని చెబుతున్నారేంటి?
View this post on Instagram