Game of Thrones : గేమ్ ఆఫ్ థ్రోన్స్.. అమేజింగ్ ఫాక్ట్స్ ఇవే!
'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్ కి సంబంధించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం!
టీవీ షోలలో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఒక సంచలనం. మొత్తం ఎనిమిది సీజన్లుగా విడుదలైన ఈ సిరీస్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. కొన్ని వివాదాలకు కూడా తెరలేపింది. మొత్తం 73 ఎపిసోడ్లతో కూడిన ఈ సిరీస్ చూసిన తరువాత మనకి కూడా ఒక డ్రాగన్ ఉంటే బావుండేదే అని అనిపించకమానదు. మరి గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనగానే మనకి గుర్తొచ్చేవే డ్రాగన్స్ కదా...!
2019లో ఈ సిరీస్ కి సంబంధించిన ఫైనల్ సీజన్ విడుదలైంది. ఇప్పుడు ఈ సిరీస్ కి ప్రీక్వెల్ 'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' ను సిద్ధం చేస్తున్నారు. జార్జ్ ఆర్.ఆర్.మార్టిన్ తెరకెక్కిస్తోన్న ఈ ప్రీక్వెల్ కి సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో మూడేళ్ల తరువాత ఈ ప్రీక్వెల్ వస్తుందేమో!
ఇదిలా ఉండగా.. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్ కి సంబంధించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం!
ఈ సిరీస్ లో ఆడవాళ్లను చూపించినంత స్ట్రాంగ్ గా మరెక్కడా చూపించలేదేమో అనిపిస్తుంది. సిరీస్ లో ప్రతీ లేడీ క్యారెక్టర్ ను ఎంతో పవర్ ఫుల్ గా ప్రెజంట్ చేశారు. ఒక ఆర్య స్టార్క్, మదర్ ఆఫ్ డ్రాగన్స్, సర్సీ లానిస్టర్, క్యాటలిన్ స్టార్క్ ఇలా ఒక్కొక్కరినీ తెరపై ఆవిష్కరించిన తీరుని మర్చిపోలేం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. క్యాటలిన్ స్టార్క్, డనెరీస్ టార్గేరియన్ పాత్రల కోసం ముందుగా జెన్నిఫర్ ఎహ్ల్, టాంజిన్ మర్చంట్ లను తీసుకున్నారు. కానీ ఫైనల్ గా వారి స్థానాల్లో మిషెల్ ఫెయిర్లీ, ఎమిలియా క్లార్క్ లను తీసుకున్నారు. ఈ సిరీస్ తో ఎమిలియా క్లార్క్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది.
ఈ సిరీస్ ను గేమ్ ఆఫ్ థ్రోన్స్ పుస్తకం ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే బుక్ లో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా స్క్రీన్ మీద కొన్ని మార్పులు చేసి చూపించారు. నిజానికి స్టార్క్ ఫ్యామిలీలో ఉన్న పిల్లలందరి వయసు చాలా తక్కువ. నిజానికి బ్రాన్ (Isaac Hempstead Wright) వయసు బుక్ ప్రకారం ఏడేళ్లే. కానీ సిరీస్ లో 12 ఏళ్లుగా చూపించారు. తొమ్మిదేళ్ల వయసు గల ఆర్య (Maisie Williams) క్యారెక్టర్ ను 13 కి పెంచారు. సాన్సా (Sophie Turner) రోల్ ని టీనేజర్ గా చూపించారు.
ఈ సిరీస్ లో మేజర్ హైలైట్స్ లో డనెరీస్ టార్గేరియన్, ఖాల్ డ్రాగోల పెళ్లి ఎపిసోడ్ ఒకటని చెప్పాలి. ఈ వేడుకలోనే డనెరీస్ కి డ్రాగన్ ఎగ్స్ ను బహుమతిగా ఇస్తారు. అయితే ఈ ఎపిసోడ్ లో జార్జ్ ఆర్.ఆర్.మార్టిన్ తో క్యామియో రోల్ చేయించాలనుకున్నారు. ఈ మేరకు షూటింగ్ కూడా జరిగింది. కానీ డనెరీస్ రోల్ ను రీక్యాస్ట్ చేసినప్పుడు క్యామియో రోల్ ని తీసేయాల్సి వచ్చింది.
మనందరం ఎంతగానో ప్రేమించే జాన్ స్నో క్యారెక్టర్ లో కిట్ హ్యరింగ్టన్ ఒదిగిపోయి నటించారు. ఈ సిరీస్ లో హీరో ఎవరంటే జాన్ స్నో అనే చెబుతాం. అయితే ఈ పాత్రకు ముందుగా సామ్ క్లాఫిన్ ను తీసుకోవాలనుకున్నారు. ఆడిషన్స్ కూడా జరిగాయి. కానీ ఫైనల్ గా కిట్ హ్యరింగ్టన్ ను ఎంపిక చేసుకున్నారు.
ఈ సిరీస్ లో యూత్ కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ లో ఆర్య స్టార్క్ ఒకటి. ఈ రోల్ లో మైసీ విలియమ్స్ పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. యోధురాలిగా మారడం కోసం ఆమె పడే కష్టాన్ని మాటల్లో చెప్పలేం. తండ్రి చావుని కళ్లారా చూసినా.. కూలబడిపోకుండా పగ సాధించడం కోసం బయలుదేరే ఈ పాత్రను తెరపై ఎంతో పవర్ ఫుల్ గా చూపించారు. నిజానికి ఈ పాత్ర కోసం 300 మంది ఆడిషన్స్ చేశారట. కానీ ఎవరూ సెట్ కాలేదట. ఫైనల్ గా ఓ వీడియోలో మైసీ విలియమ్స్ ను చూసి ఆమెని ఫైనల్ చేశారట.
ఈ సిరీస్ లో చూపించిన డ్రాగన్స్ సైజులో చాలా పెద్దవి. సైంటిస్ట్ ల ప్రకారం.. ఇంత భారీ డ్రాగన్స్ రియల్ లైఫ్ లో ఎగరలేవట. 150 నుండి 550 పౌండ్స్ ఉన్న రెప్టైల్స్ మాత్రమే వాటి రెక్కల సాయంతో ఎగరగలవు. వాటితో పోలిస్తే.. డానీ డ్రాగన్స్ చాలా పెద్దవి.