By: ABP Desam | Updated at : 29 May 2023 07:02 PM (IST)
కొత్త సినిమా పోస్టర్‌లో అల్లు శిరీష్ ( Image Source : Allu Sirish Instagram )
Allu Sirish New Movie: మెగా హీరో అల్లు శిరీష్ ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో వచ్చిన ‘ఊర్వశివో రాక్షసివో’ తర్వాత ఇంత వరకు మరో సినిమా ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. మంగళవారం (మే 30వ తేదీ) దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలిపారు.
కానీ పోస్టర్‌ను బట్టి చూస్తే సందీప్ కిషన్‌తో అనౌన్స్ అయి ఆగిపోయిన ‘బడ్డీ’ సినిమా అని తెలుస్తోంది. 2023 సంక్రాంతి సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ తమ కంటెంట్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. అందులో సందీప్ కిషన్ హీరోగా ‘బడ్డీ’ సినిమాను కూడా ప్రకటించారు.‘మైఖేల్’ విడుదల అయ్యాక దీని టీజర్ కూడా వస్తుందని తెలిపారు. కానీ ఏమైందో తెలీదు కానీ ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని తిరిగి అల్లు శిరీష్‌తో అనౌన్స్ చేస్తున్నట్లు ఉన్నారు.
సందీప్ కిషన్ కమిట్ అయినప్పుడు తమిళ దర్శకుడు శామ్ ఆంటోన్ దీనికి దర్శకుడిగా ఉన్నారు. మరి దర్శకుడిగా ఆయనే ఉంటారా? వేరే వారు కమిటయ్యారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమా పోస్టర్ ఆర్య గతంలో నటించిన ‘టెడ్డీ’ తరహాలో ఉంది. పక్కనే టెడ్డీ బేర్‌తో వెనక్కి తిరిగి నిలబడి ఉన్న అల్లు శిరీష్‌ను ఈ పోస్టర్‌లో చూడవచ్చు.
ఈ సినిమా రీమేక్ కాదని అల్లు శిరీష్ తెలిపారు. అప్పట్లో ‘టెడ్డీవర్స్’లో ఈ సినిమా జరుగుతుందని ప్రకటించారు. మరి కథలో ఏమైనా మార్పులు చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ టెడ్డీవర్స్‌లో జరిగితే మాత్రం సౌత్ ఇండియాలో ఇది కొత్త సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పవచ్చు.
ఇక ‘టెడ్డీ’ సినిమా విషయానికి వస్తే... ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. కోమాలో ఉన్న అమ్మాయి ఆత్మ తాను బతికుండగానే టెడ్డీ బేర్‌లో ప్రవేశించి హీరో ద్వారా తన ప్రాణాలు కాపాడుకుంటుంది. హీరో పాత్రలో ఆర్య, కోమాలో ఉన్న అమ్మాయి పాత్రలో సాయేషా సైగల్ నటించారు.
సందీప్ కిషన్‌తో బడ్డీ అనౌన్స్‌మెంట్ ట్వీట్లు
Now that the Cats out of the Bag..
— Sundeep Kishan (@sundeepkishan) January 14, 2023
My Next Post #Michael & #OPBhairavaKona,
Entering the #TeddyWorld with a completely different story & Premise..@kegvraja Proudly Presents#Buddy
A @ANTONfilmmaker 🧸
A @StudioGreen2 📽
A @hiphoptamizha 🎧#NotARemake https://t.co/FuueysigWI
My next With my brother @sundeepkishan 😊😊🤗🤗
— sam anton (@ANTONfilmmaker) January 14, 2023
Thanks to my producer @kegvraja sir for introducing me in Tamil 8 years ago on the same day with #darling.. now again he is introducing me in telugu with #BUDDY @StudioGreen2 ..
With all your love and support here we go 😎 https://t.co/cFsPZlAL6v
Manifesting for us to find a buddy like Buddy this year! 🧸
— Netflix India South (@Netflix_INSouth) January 14, 2023
Buddy is coming to Netflix in Telugu, Tamil, Malayalam and Kannada as a post theatrical release! 🤩#NetflixPandaga #Buddy #NetflixLoEmSpecial pic.twitter.com/ZKU1PcxW1S
Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం
Bigg Boss Season 7 Day 23 Updates: శుభశ్రీ మీద మీదకు వచ్చిన శివాజీ - టచ్ చేయొద్దంటూ వార్నింగ్
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!
Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్‌కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
TS TET: తెలంగాణ 'టెట్' పేపర్-1లో 36.89 శాతం, పేపర్-2లో 15.30 శాతం ఉత్తీర్ణత
/body>