Allu Arjun Zomato: ఫుడ్ విషయంలో 'తగ్గేదే లే' అంటున్న అల్లు అర్జున్, యాడ్ చూశారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో యాడ్ చేరింది. అదే 'జొమోటో'. లేటెస్టుగా యాడ్ కూడా విడుదల చేశారు. మీరు దాన్ని చూశారా?
'పుష్ప: ద రైజ్' సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది. నేషనల్ లెవల్‌లో ఆయన రేంజ్ పెరిగింది. దాంతో ఆయనతో యాడ్స్ చేయడానికి కార్పొరేట్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. రీసెంట్‌గా అల్లు అర్జున్ రెండు యాడ్స్ చేశారు. ఒకటి... 'ఆహా' ఓటీటీ కోసం! 100 పర్సెంట్ తెలుగు ఓటీటీ అయిన 'ఆహా'లో అల్లు ఫ్యామిలీకి షేర్ ఉన్న సంగతి తెలిసిందే. షేరు షేరే... ప్రకటన ప్రకటనే అని టాక్. ఇంకొకటి... ర్యాపిడో బైక్ కోసం అల్లు అర్జున్ యాడ్ చేశారు. ఇప్పుడు లేటెస్టుగా ఫుడ్ డెలివరీ యాప్ జొమోటో కోసం ఆయన మరో యాడ్ చేశారు. ఈ రోజు దాన్ని విడుదల చేశారు.
బన్నీతో పాటు జొమోటో యాడ్‌లో నటుడు సుబ్బరాజ్ కూడా ఉన్నారు. ఆయన పలు సినిమాల్లో విలన్ రోల్స్ చేశారు. హీరోతో తన్నులు తిన్నారు. ఈ యాడ్‌లో బన్నీ ఆయన్ను కొడితే... 'బన్నీ! నన్ను కొంచెం తొందరగా కింద పడేయావా?' అని అడుగుతారు. 'సౌత్ సినిమా కదా! ఎక్కువ సేపు ఎగరాలి' అని అల్లు అర్జున్ అంటారు. 'గోంగూర మటన్ తినాలని ఉంది. కొండకు వచ్చేలోపు రెస్టారెంట్ మూసేస్తారు' అని సుబ్బరాజ్ అంటే... 'గోంగూర మటన్ ఏంటి? ఎప్పుడు ఏం కావాలన్నా జొమోటో ఉందిగా' అని అల్లు అర్జున్ చెబుతారు. ఇదీ యాడ్. దీన్ని క్రిష్ డైరెక్ట్ చేశారు. చివర్లో 'మనసు కోరితే... తగ్గేదే లే' అని బన్నీ అన్నారు. అదన్నమాట సంగతి!
సినిమాలకు వస్తే... త్వరలో 'పుష్ప' సీక్వెల్ చేయడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ ఆయన్ను కలిశారు. అప్పుడు ఇద్దరి మధ్య ఓ సినిమా గురించి డిస్కషన్స్ జరిగినట్టు టాక్.
View this post on Instagram