News
News
X

Allu Arha: పవర్ స్టార్ సినిమాలో అల్లు అర్జున్ కూతురు - తాతకు కూతురిగా మనువరాలు?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అర్హ ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యింది. వాస్తవానికి ఈ సినిమా తమిళ హిట్ మూవీ ‘తెరి’కి రీమేక్ గా తెరకెక్కుతోందట. పేరుకు రీమేక్ అయినా, పూర్తి స్థాయిలో ఇక్కడి నేటి విటీకి అనుకూలంగా కీలక మార్పులు చేస్తున్నాడట దర్శకుడు. ఈ సినిమాలోని మూల కథకు ఇబ్బంది కలగకుండా రూపొందిస్తున్నాడట. తమిళ సినిమాలో హీరో బేకరి నడుపుతుండగా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాత్రం లెక్చరర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. 

పవన్ కూతురుగా అల్లు అర్హ

ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్ కు చిన్న పాప ఉంటుందట. ఈ పాప క్యారెక్టర్ కోసం ఎవరిని తీసుకోవాలా? అని దర్శకుడు చాలా ఆలోచించి ఫైనల్ గా  ఓ నిర్ణయానికి వచ్చాడట. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కూతురుగా అర్హ కనిపించనున్నట్లు సమాచారం. అయితే, అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన  రాలేదు. ఒక వేళ నిజంగానే తాత పవన్ కళ్యాణ్ సినిమాలో మనువరాలు అర్హ నటిస్తే మాత్రం ఫ్యాన్స్ కు పండగే అని చెప్పుకోవచ్చు. సినిమాపైనా మరింత భారీగా అంచనాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అర్హ ‘శాకుంతలం’ సినిమాలో నటించింది. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్హ చిన్ననాటి భరతుడి క్యారెక్టర్ చేసింది. ‘సమంత’ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఇక అర్హ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తండ్రితో కలిసి ఆమె చేసే అల్లరి సోషల్ మీడియాలో నెటిజన్లు బాగా అలరిస్తుంటుంది.

View this post on Instagram
 
A post shared by Allu Arjun (@alluarjunonline)

వరుస సినిమాలు చేస్తున్న పవర్ స్టార్

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. క్రిష్ తో కలిసి ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో పవన్ కల్యాణ్ వారియర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా  సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అటు సుజీత్ తో కలిసి ‘ఓజీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో పాటలు, ఫైట్స్ ఉండవని తెలుస్తోంది. ఓ ప్రయోగాత్మక చిత్రంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనే విషయం  త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.  

Read Also: అనుష్కను వేధిస్తున్న అరుదైన వ్యాధి - ఆమె నవ్వితే షూటింగ్ ఆపేస్తారట!

Published at : 15 Feb 2023 01:25 PM (IST) Tags: Pawan Kalyan Allu Arha Ustaad Bhagat Singh movie

సంబంధిత కథనాలు

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

NTR 30 Muhurtam : రాజమౌళి క్లాప్‌తో మొదలైన ఎన్టీఆర్ 30 - అతిరథ మహారథుల సమక్షంలో...

NTR 30 Muhurtam : రాజమౌళి క్లాప్‌తో మొదలైన ఎన్టీఆర్ 30 - అతిరథ మహారథుల సమక్షంలో...

Brahmamudi March 23rd: చెల్లి అదృష్టాన్ని చూసి అసూయ పడిన స్వప్న- కావ్య తొందరపాటుతో దొరికిపోయిన కనకం

Brahmamudi March 23rd: చెల్లి అదృష్టాన్ని చూసి అసూయ పడిన స్వప్న- కావ్య తొందరపాటుతో దొరికిపోయిన కనకం

Guppedanta Manasu March 23rd: అర్థరాత్రి వసు సేవలో రిషి - దేవయానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగతి

Guppedanta Manasu March 23rd: అర్థరాత్రి వసు సేవలో రిషి - దేవయానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగతి

Ennenno Janmalabandham March 23rd: గెలిచిన భార్యాభర్తల బంధం, విన్నీ షాక్- వేదకి ఇక సీతమ్మ కష్టాలే

Ennenno Janmalabandham March 23rd: గెలిచిన భార్యాభర్తల బంధం, విన్నీ షాక్- వేదకి ఇక సీతమ్మ కష్టాలే

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? రాజీనామాను ఆమోదించేశారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? రాజీనామాను ఆమోదించేశారా?

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

Fed Rate Hike: వడ్డీ రేట్లను 25 bps పెంచిన ఫెడ్‌ - ప్రపంచం ఏమైనా పర్లేదు, తన దారి తనదే!

Fed Rate Hike: వడ్డీ రేట్లను 25 bps పెంచిన ఫెడ్‌ - ప్రపంచం ఏమైనా పర్లేదు, తన దారి తనదే!