Samantha: సమంతకు బాలీవుడ్ స్టార్ హీరో సినిమా ఆఫర్?
సమంతకు బాలీవుడ్ స్టార్ హీరో సినిమా ఆఫర్ ఇచ్చారని టాక్.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత(Samantha). వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'యశోద', 'ఖుషి' అనే సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో దర్శకుడు రాజ్ అండ్ డీకే రూపొందిస్తోన్న సినిమాలో సమంతను హీరోయిన్ గా అనుకుంటున్నారట.
అలానే తాప్సీ బ్యానర్ లో కూడా సమంత ఓ సినిమా చేయబోతుందని సమాచారం. వీటితో పాటు కొందరు ఫిల్మ్ మేకర్స్ లో సమంత టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ బ్యూటీకి బాలీవుడ్ స్టార్ హీరో సినిమా ఆఫర్ ఇచ్చారని టాక్. ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్(Karan Johar) హోస్ట్ చేస్తోన్న 'కాఫీ విత్ కరణ్'(Koffee with Karan) సీజన్ 7కి గెస్ట్ గా వెళ్లింది సమంత. ఆమెతో పాటు హీరో అక్షయ్ కుమార్(Akashay Kumar) కూడా హాజరయ్యారు.
ఈ షోలో సమంత, అక్షయ్ ఎన్నో విషయాలను పంచుకున్నారు. సామ్.. డివోర్స్ తరువాత తన లైఫ్ గురించి, ప్రెజంట్ తన కెరీర్ గురించి ఇలా చాలా విషయాల గురించి మాట్లాడింది. అలానే అక్షయ్ తో చాలా బాగా ఇంటరాక్ట్ అయింది సమంత. ఈ క్రమంలో తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో నటించమని సమంతను అడిగారట అక్షయ్ కుమార్. ఇదివరకు ఆయన సౌత్ కి చెందిన చాలా మంది హీరోయిన్లను ఎంకరేజ్ చేశారు.
త్రిష, కాజల్ అగర్వాల్, అసిన్ ఇలా కొందరు హీరోయిన్లకు తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు అక్షయ్ కుమార్. చాలా కాలం గ్యాప్ తరువాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి నటించాలనుకుంటున్నారు. మరి ఈ విషయంలో సమంత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!
View this post on Instagram
Before You Go
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















