Tegimpu Movie OTT: ఓటీటీలోకి అజీత్ ‘తెగింపు‘ - స్ట్రీమింగ్ మొదలైంది, ఎక్కడో తెలుసా?
తమిళ స్టార్ అజీత్ కుమార్ నటించిన ‘తునివు’ సినిమా ఇవాళ్టి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ , హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన తాజా సినిమా ‘తునివు‘. తెలుగులో ఈ సినిమా ‘తెగింపు’గా విడుదలైంది. బ్యాంక్ రాబరీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో మంజు వారియర్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా విడుదల అయ్యింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లోకి రాబోతుంది. ఇవాళ్టి(ఫిబ్రవరి 8) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా ప్రకటించింది. థియేటర్లలో విడుదలై నెల రోజులు కాకముందే ‘తునివు’ ఓటీటీలోకి రావడం విశేషం. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కానుంది.
View this post on Instagram
అజిత్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం
‘తునివు’ సినిమా రూ.250 కోట్ల కలెక్షన్‌లు సాధించి అజిత్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సాధించింది. డివైడ్ టాక్‌తో ఈ రేంజ్‌లో కలెక్షన్‌లు వచ్చాయంటే అజిత్ కు తమిళ నాట ఏరేంజిలో అభిమానులున్నారో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోకుండానే వెళ్లి పోయింది. అయితే, అజిత్ గత సినిమాలతో పోల్చితే ఈ సినిమా బాగానే వసూళ్లు సాధించింది. సుమారు రూ.3 కోట్ల మేర బిజినెస్ అందుకుంది.
‘తెగింపు’ కథేంటీ?
యువర్ బ్యాంక్ ను దోచుకోవడంతో పాటు దోచుకున్న డబ్బును పంచుకునేందుకు ఓ దుండగుల టీమ్ ప్రయత్నిస్తోంది. ఆ టీమ్ తో పోలీసులు ఒప్పందం కుదుర్చుకోవడంతో ‘తెగింపు’ సినిమా మొదలవుతుంది. ఈ ముఠా ముందుగా అనుకున్నట్లుగానే బ్యాంకులోకి వెళ్తుంది. అప్పటికే, డార్క్ డెవిల్ (అజిత్ కుమార్) అనే మరో వ్యక్తి కూడా బ్యాంక్ ను దోచుకోవడానికి లోపలికి వచ్చారని తెలుసుకుంటుంది. ఆ డార్క్ డెవిల్ కొంతమంది దుండగులను హతమార్చి కస్టమర్లు, ఉద్యోగులు, ఇతర దుండగులను కూడా బందీలుగా చేసుకుంటాడు. అతడు ఎవరు? బ్యాంకులో దోపిడీకి ఎందుకు ప్లాన్ చేశాడు? అతడికి ఎవరు సహాయం చేస్తున్నారు? అనేదే ఈ సినిమా కథ.
అంచనాలను మించి వసూళ్లు సాధించిన ‘తునివు’
‘తునివు’ సినిమా తొలి షో నుంచే మిశ్రమ స్పందన అందుకుంది. రెగ్యులర్ కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకపోవడంతో ఈ సినిమా సక్సెస్ కావడం కష్టమని చాలా మంది సినీ పండితులు భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా భారీగా కలెక్షన్లు సాధించింది. ‘తునివు’ చిత్రంలో అజిత్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే, దర్శకుడు వినోద్ అజిత్ ను హ్యాండిల్ చేయడంలో ఇంకా తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటేదని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మంజు వారియర్, మోహన సుందరం, సముద్రఖని, జాన్ కొక్కెన్, వీర మంచి నటన కనబరిచారు. జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Also: అది నాకు కలిసి రాలేదు, ఇప్పటికే నాలుగుసార్లు పెళ్లయ్యింది - సాయి ధరమ్ తేజ్ కామెంట్స్