అన్వేషించండి

Viral Video: ఐఫా ఉత్సవంలో మణిరత్నం కాళ్లు మొక్కిన ఐశ్వర్య... నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Aishwarya Rai: నటి ఐశ్వర్య రాయ్ దర్శకుడు మణిరత్నం కాళ్లకు నమస్కారం చేసింది. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా IIFA అవార్డును అందుకున్న ఆమె గురువు కాళ్లు మొక్కింది.

Aishwarya Rai Touched Mani Ratnam's Feet: దర్శకుడు మణిరత్నంను గురువుగా భావిస్తుంది బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్. తనను సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన ఆయనను ఎంతో గౌరవిస్తుంది. ఎక్కడ కనిపించినా ఆయన కాళ్లకు నమస్కరించి గురు భక్తిని చాటుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మక ఐఫా అవార్డుల వేడుకలోనూ మణిరత్నం కాళ్లు మొక్కింది. ఆమె సంస్కారానికి వేడుకలో పాల్గొన్న వాళ్లు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒదిగి ఉండటంతో పాటు తన ఎదుగుదలకు కారణమైన వాళ్లను మర్చిపోకూడదనడానికి ఐశ్వర్య నిలువెత్తు నిదర్శనం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.    

ఉత్తమ నటిగా IIFA అవార్డును అందుకున్న ఐశ్వర్య

ప్రతిష్టాత్మక IIFA ఉత్సవంలో ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ పలు అవార్డులను దక్కించుకుంది. ‘పొన్నియన్ సెల్వన్ II’ చిత్రానికి గాను, మణిరత్నం బెస్ట్ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన విక్రమ్ ఉత్తమ నటుడు (తమిళం) అవార్డును అందుకున్నారు. ఈ మూవీలో నందిని పాత్రలో కనిపించిన ఐశ్వర్య ఉత్తమ నటి (తమిళం) అవార్డును అందుకుంది. అనంతరం దర్శకుడు మణిరత్నం దగ్గరికి వెళ్లి ఆయనకు కాళ్లకు నమస్కరించింది. మణిరత్నం ఆమెను భుజం తట్టి అభినందనలు చెప్పారు. ఈ వీడియో చూసి ఐశ్వర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.    

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IIFA Utsavam (@iifautsavam)

మణిరత్నం నా గురువు- ఐశ్వర్య

ఉత్తమ నటిగా IIFA అవార్డును అందుకున్న ఐశ్వర్య మణిరత్నంను తాను గురువుగా భావిస్తానని చెప్పింది. ఆయన పట్ల తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని వెల్లడించింది. “మణిరత్నం నా గురువు. తొలి సినిమా నుంచే ఆయనతో కలిసి పని చేశాను. లెజెండరీ దర్శకుడితో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ‘పొన్నియిన్ సెల్వన్‌’ సినిమాకు పలు అవార్డులు లభించడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నందిని పాత్ర పోషించడం గౌరవంగా భావిస్తున్నాను. అవార్డులు అందుకున్న వారందరికీ అభినందనలు” అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. 

ఐశ్వర్యను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మణిరత్నం

నటి ఐశ్వర్యరాయ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిందే లెజెండరీ దర్శకుడు మణిరత్నం. 1997లో ఆమె ‘ఇరువన్’ అనే తమిళ సినిమాలో వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా తెలుగులో ‘ఇద్దరు’ పేరుతో విడుదల అయ్యింది. ఆ తర్వాత మణిరత్నంతో కలిసి ఐశ్వర్యరాయ్ ‘గురు’, ‘రావణ్’, ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలు చేసింది. అందుకే ఐశ్వర్యకు మణిరత్నం అంటే ప్రత్యేక గౌరవం. ఆయన కారణంగానే ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి చేరినట్లు ఐశ్వర్య భావిస్తుంది. అందుకే, ఆయన ఎక్కడ కనిపించినా ఎనలేని గౌరవాన్ని చూపిస్తుంది. కాళ్లకు నమస్కరించిన తన అభిమానాన్ని చాటుకుంటుంది.

Read Also: మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు... IIFA వేడులో అందజేసిన బాలీవుడ్ ప్రముఖులు

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget