Siddharth-Aditi Rao: శర్వానంద్ పెళ్లిలో అదితిరావు, సిద్ధార్థ్ సందడి, మళ్లీ ఊపందుకున్న డేటింగ్ రూమర్స్
అదితిరావు, సిద్ధార్థ్ డేటింగ్ రూమర్స్ మరోసారి ఊపందుకున్నాయి. తాజాగా ఈ జంట శర్వానంద్ పెళ్లిలో సందడి చేసింది. నటి బినా కాక్ ఇంటికి కూడా వెళ్లింది. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కామన్. చాలా మంది హీరోయిన్స్ పై కొత్త కొత్తగా గాసిప్స్ వస్తూనే ఉంటాయి. ఆ హీరోయిన్ ప్రేమలో పడింది. ఆ హీరోతో రిలేషన్ లో ఉంది. ఇద్దరి మధ్య చెడింది. ఇలాంటి వార్తలు చాలా వినిపిస్తుంటాయి. వాటిని చాలా మంది నటీనటులు పట్టించుకోరు. మరికొంత మంది ఎప్పటికప్పుడు సదరు వార్తలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ సైతం తన రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె మరెవరో కాదు అదితి రావు హైదరి. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమల్లోనూ రాణిస్తోంది. ఈమె కొంత కాలంగా హీరో సిద్దార్థ్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ స్టార్స్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా గుసగుసలు వినిపించాయి.
శర్వానంద్ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్
గతంలో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితి జంటగా కనిపించారు. వీరు రిలేషన్‌లో ఉన్నారని అంతా ఫిక్స్ అయ్యారు. తాజాగా ఈ జంట జైపూర్‌లో జరిగిన శర్వానంద్ పెళ్లికి కూడా హాజరయ్యారు. శర్వానంద్ పెళ్లికి జైపూర్ వెళ్తూ వీరిద్దరు ముంబై విమానాశ్రయంలో కనిపించారు. అంతేకాదు, జైపూర్‌లో రాజస్థాన్ నటి, రాజకీయవేత్త బినా కాక్ ఇంటికి కూడా వెళ్లారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
‘మహాసముద్రం’ సినిమా నుంచి ప్రేమాయణం
నిజానికి వీళ్లిద్దరు ‘మహాసముద్రం’ అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ ఏర్పడిందట. ఆ తర్వాత వీరి గురించి రకరకాల వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే వార్తలు వినిపించాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లు పలుమార్లు మీడియాకు కనిపించారు. పార్టీ, పబ్బులో కలిసి తిరిగారు. పలు ఈవెంట్స్, ఫంక్షన్స్ లోనూ కలసి కనిపించారు. వీరిని చూసి త్వరతో పెళ్లి చేసుకోబోతున్నారనే కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ జంట సోషల్ మీడియాలోనూ సందడి చేస్తున్నారు. రీల్స్ చేస్తూ అలరిస్తున్నారు. శర్వానంద్ పెళ్లికి జంటగా వెళ్లడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి.
డేటింగ్ రూమార్స్ పై అదితి అసహనం
ఇప్పటి వరకు వీరి రిలేషన్ షిప్ గురించి ఇటు అదితి రావు గానీ, అటు సిద్దార్థ్ గానూ ఓపెన్ గా చెప్పలేదు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడొద్దని చెప్పింది. వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుందని వెల్లడించింది. నేను ఎవరితో రిలేషన్ పిప్ లో ఉన్నానో అవసరం లేదని చెప్పింది. ప్రస్తుతం తాను, సినిమాల మీదే ఫోకస్ పెట్టినట్లు వెల్లడించింది. మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందే వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. దయచేసి తన పర్సనల్ విషయాలను పట్టించుకోకపోవడం మంచిదన్నది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సంజయ్ లీలా భన్సాలీ తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి’లో నటిస్తోంది. సిద్దార్థ్ ‘టక్కర్‘ సినిమాతో జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Read Also: శకుని మామా ఇకలేరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అస్తమించిన గుఫీ పెయింటల్!