(Source: ECI/ABP News/ABP Majha)
Aditi Rao Hydari Siddharth : పుట్టినరోజున సిద్దార్థ్‌తో అదితి? - లవ్ మేటర్ కన్ఫర్మ్ చేశారా?
హీరోయిన్ అదితి రావు హైదరి పుట్టినరోజు నేడు. చాలా మంది విషెస్ చెప్పారు. హీరో సిద్ధార్థ్ చేసిన విష్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతుండటమే అందుకు కారణం.
హీరోయిన్ అదితి రావు హైదరి (Aditi Rao Hydari) తో సిద్ధార్థ్ (Siddharth) ప్రేమలో ఉన్నారా? అంటే... 'అవును' అని తమిళ చిత్ర పరిశ్రమలో కొందరు అంటున్నారు. అయితే... ఆయన గానీ, ఆమె గానీ ఎప్పుడూ తాము ప్రేమలో ఉన్నామని చెప్పలేదు. కట్ చేస్తే... అదితి రావు హైదరి పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ చేసిన పోస్ట్ నెటిజనుల దృష్టిని ఆకర్షించింది.
అదితి... ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్!
''హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్'' అని అదితి రావు హైదరిని ట్యాగ్ చేస్తూ ఆమెతో దిగిన ఫోటోను సిద్ధార్థ్ పోస్ట్ చేశారు. 'ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్' అంటే? అనేది నెటిజన్స్ డౌట్. తన హృదయంలో రాణి స్థానం అదితిదే అని సిద్ధార్థ్ కన్ఫర్మ్ చేశారా? ఈ పోస్ట్ వెనుక మీనింగ్ ఏంటి? అనేది డిస్కషన్ పాయింట్ అవుతోంది.
View this post on Instagram
సిద్ధార్థ్ పోస్ట్ కింద కొన్ని కామెంట్స్ చూస్తే... వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సినీ ప్రముఖులు స్పష్టం చేస్తున్నట్లు ఉంది. అదితి రావు హైదరికి కొన్ని సినిమాల్లో ఏకా లఖాని కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. మణిరత్నం తాజా సినిమా 'పొన్నియిన్ సెల్వన్'కు కూడా ఆమె పని చేశారు. ఈ ఫోటో కింద ఆవిడ హగ్గులు ఇస్తున్న ఎమోజీ పోస్ట్ చేశారు. 'మేజర్' నిర్మాతలలో ఒకరైన శరత్ 'లవ్ యు గైస్' అని పేర్కొన్నారు. చాలా మంది అదితికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు సిద్ధార్థ్ మళ్ళీ ప్రేమలో పడ్డారని కామెంట్ చేయడం గమనార్హం.
'ఆర్ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మహా సముద్రం'లో సిద్ధార్థ్, అదితి రావు హైదరి జంటగా నటించారు. అందులో శర్వానంద్ హీరో అయినప్పటికీ... సిద్ధార్థ్‌తో అదితి ప్రేమలో పడినట్టు చూపించారు. ఆ సినిమా చేసే సమయంలో నిజ జీవితంలోనూ ఇద్దరు ప్రేమలో పడినట్టు గుసగుస. ఇప్పుడు సిద్ధార్థ్ చేసిన పోస్టుతో అది నిజమని తేలిందని నెటిజనులు భావిస్తున్నారు.
అదితి రావు హైదరి కలలు అన్నీ నిజం కావాలని కోరుకుంటున్నట్టు సిద్ధార్థ్ పేర్కొన్నారు. ఇంకో విషయం ఏంటంటే... 'మహా సముద్రం' చిత్రీకరణలో దిగిన ఫోటోలు కాకుండా అదితి రావు హైదరితో ఉన్న ఫోటోను సిద్దార్థ్ పోస్ట్ చేయడం కూడా ఇదే తొలిసారి.
Also Read : సారీ పూరి - ఆయనకు సినిమాకు డబ్బుల్లేవ్!
View this post on Instagram
హ్యాపీ బర్త్ డే అదితి రావు హైదరి!
ఈ రోజు అదితి రావు హైదరి పుట్టినరోజు (Aditi Rao Hydari Movie). ఆమె పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు నాని 'వి', కార్తీ 'చెలియా'... శర్వానంద్, సిద్దార్థ్ కథానాయకులుగా నటించిన 'మహా సముద్రం' చిత్రాలు గుర్తుకు వస్తాయి. స్క్రీన్ మీద ఆమె క్యారెక్టర్ ఎలా ఉన్నప్పటికీ... ప్రేక్షకులు మాత్రం యువరాణిలా చూస్తున్నారు. అదితి నటనకు, అందానికి చాలా మంది ఫిదా అయ్యారు. తెలుగులో ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే. మలయాళ సినిమా 'సూఫీయం సుజాతయుం' కూడా ఆమెకు ఎక్కువ మంది అభిమానులను సంపాదించి పెట్టింది.