అన్వేషించండి

Yami Gautam: ప్రధాని నోట ‘ఆర్టికల్ 370’ మూవీ ప్రస్తావన, థ్యాంక్స్ చెప్పిన యామీ గౌతమ్‌

జమ్మూకాశ్మీర్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆర్టికల్ 370’ సినిమా గురించి ప్రస్తావించారు. వారసత్వ రాజకీయాలపై విమర్శలు గుప్పించారు.

PM Narendra Modi About 'Article 370' Movie: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం( ఫిబ్రవరి 20) నాడు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అటు  మౌలానా ఆజాద్‌ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా యామి గౌతమ్ తాజా మూవీ ‘ఆర్టికల్ 370’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

‘ఆర్టికల్ 370’పై ప్రధాని మోడీ ప్రశంసలు

జమ్మూ కాశ్మీర్ ప్రజలు అసలు వాస్తవాలను తెలుసుకునేందుకు ‘ఆర్టికల్ 370’  సినిమా బాగా ఉపయోగడుతుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. “ నాకు సినిమాల గురించి పెద్దగా తెలియదు. కానీ ‘ఆర్టికల్ 370’కి సంబంధించిన ఓ సినిమా ఈ వారంలో విడుదల అవుతుందని తెలిసింది. ప్రజలు జమ్ము కాశ్మీర్ లోని వాస్తవాలను తెలుసుకునేందుకు ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకాలం ఆర్టికల్ 370 జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి ఎంతో ఇబ్బందిగా ఉండేది. బీజేపీ అధికారంలోకి వచ్చాక, దాన్ని తొలగించడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడి ప్రజలు సామాజిక న్యాయాన్ని పొందుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు దశాబ్దాల తరబడి వారసత్వ రాజకీయాలను భరించాల్సి వచ్చింది. సదరు రాజకీయ నాయకులు వారి కుటుంబాల గురించి మాత్రమే ఆలోచించారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. గత 10 ఏళ్లలో ఈ ప్రాంతంలో 50 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశాం. అప్పట్లో ఇక్కడ స్కూళ్లు తగలబెట్టేవాళ్లు. ఇప్పుడు అలంకరిస్తున్నారు” అని చెప్పారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yami Gautam Dhar (@yamigautam)

ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పిన యామీ గౌతమ్

ఇక తన సినిమాపై ఏకంగా ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించడంపై యామీ గౌతమ్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రధాని మోడీకి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు చెప్పింది. ప్రధాని మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. “చక్కటి కథతో ‘ఆర్టికల్ 370’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమాఅంచనాలను మించి ఉంటుందని నేను, నా టీమ్ భావిస్తున్నాం. మా సినిమా గురించి ప్రధాని మోడీ ప్రస్తావించడం నిజంగా సంతోషంగా ఉంది. ఆయనకు మా కృతజ్ఞతలు” అని యామీ వెల్లడించింది.

ఈ నెల 23న ‘ఆర్టికల్ 370’ మూవీ విడుదల

‘ఆర్టికల్‌ 370’ సినిమా ఆదిత్య సుహాస్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. ‘ఆర్టికల్‌ 370’ ఎత్తివేతకు కారణాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారు. ‘ఆర్టికల్‌ 370’ రద్దుకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలను ఇందులో ప్రస్తావించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఇందులో యామీ గౌతమ్ పవర్‌ ఫుల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్‌గా కనిపించబోతోంది. పూర్తి స్థాయి యాక్షన్‌ అవతారంలో అలరించబోతోంది. జియో స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈనెల 23న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.   

Read Also:  విలాసవంతమైన బంగళాలు, లగ్జరీ కార్లు - రకుల్, జాకీ ఆస్తుల విలువెంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Embed widget