News
News
X

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

సమంత ముంబైలో ఫ్లాట్ కొన్నారట. ఇప్పుడు ఆ ఫ్లాట్ రేట్ డిస్కషన్ టాపిక్ అయ్యింది.

FOLLOW US: 
Share:

తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) స్టార్  హీరోయిన్. సౌత్ ఇండియాలో ఆమె క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సమంత బాలీవుడ్ మీద కాన్సంట్రేషన్ చేశారు. ఆల్రెడీ ఆవిడ నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ నార్త్ ఇండియన్ ఆడియన్స్ ను సైతం ఆకట్టుకుంది. ఇప్పుడు మరో సిరీస్ చేస్తున్నారు. హిందీలో వరుస అవకాశాలు వస్తుండటంతో ముంబైలో సమంత ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారని తెలిసింది.

సమంత ఫ్లాట్ రేటు అంతా?
ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నారని టాక్. అందులో నుంచి చూస్తే సముద్రం ఎదురుగా కనిపిస్తుందట. సమంత సీ ఫేసింగ్ ఫ్లాట్ ఖరీదు రూ. 15 కోట్లు అంటున్నారు బాలీవుడ్ జనాలు. హిందీ వెబ్ సిరీస్, యాడ్ షూట్స్ అంటూ ఈ మధ్య ముంబైలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు సమంత. ఇప్పుడు ఆవిడ చేస్తున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే. వాటి ప్రచార కార్యక్రమాల నిమిత్తం అప్పుడప్పుడూ ముంబై వెళ్లాల్సి ఉంటుంది. అందుకని, ఫ్లాట్ కొనేశారట. ఆల్రెడీ సమంతకు హైదరాబాదులో ఒక ఫ్లాట్ ఉంది. సొంత సిటీ చెన్నైలో ఒక ఇల్లు ఉంది. హిందీలో సినిమాలు చేస్తున్న రష్మిక కూడా ఆ మధ్య ముంబైలో ఓ ఫ్లాట్ కొన్నారు. 

Also Read : కృతితో ప్రభాస్ ఎంగేజ్‌మెంట్ - రెబల్ స్టార్ టీమ్ క్లారిటీ

ప్రస్తుతం సమంత నటిస్తున్న ప్రాజెక్టుల విషయానికి వస్తే... హిందీ హీరో వరుణ్ ధావన్ సరసన 'సిటాడెల్' (Citadel Web Series) వెబ్ సిరీస్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం రూపొందుతోన్న ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్ సిరీస్ ఇది. దీనికి రాజ్ అండ్ డీకే షో రన్నర్స్ & డైరెక్టర్స్. ఈ మధ్య సమంత ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. 

Also Read : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్

రాజ్ అండ్ డీకే తీసిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో సమంత నటించారు. ఆమెకు ఆ సిరీస్ దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చింది. ఆ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ విజయం తర్వాత 'సిటాడెల్'తో వాళ్ళ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ప్రొడ్యూసర్ చేసిన 'సిటాడెల్'కు ఇది ఇండియన్ వెర్షన్. అమెరికన్ వెర్షన్ ప్రియాంకా చోప్రా చేయగా... ఇండియాలో సామ్ చేస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్ గూఢచారిగా కనిపించనున్నారు. ప్రాజెక్ట్ ఆఫర్ రాగానే ఓకే చేశానని సమంత తెలిపారు. 

త్వరలో 'ఖుషి' షురూ!
సమంత (Samantha) ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎప్పటి నుంచి మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ చేస్తారు? తెలుసుకోవాలని కొన్ని రోజుల క్రితం వరకు ఆమె అభిమానులతో పాటు పరిశ్రమ ప్రముఖులు కూడా చూశారు. ఆ అవసరం ఇప్పుడు లేదు! ఎందుకు అంటే... సమంత సెట్స్‌కు వెళ్ళారు. 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్ కొన్ని రోజులు చేసిన తర్వాత 'ఖుషి' సినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

'శాకుంతలం' వాయిదా!?
'ఖుషి' కంటే ముందు పాన్ ఇండియా సినిమా 'శాకుంతలం' చిత్రీకరణను సమంత పూర్తి చేశారు. దానిని ఫిబ్రవరి 17న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఆ తేదీకి సినిమా రావడం లేదని ఇటీవల చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో సమంత జోడీగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే రోజు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Published at : 08 Feb 2023 04:29 PM (IST) Tags: Shakuntalam Movie Samantha Citadel Web Series Samantha Mumbai Flat Samantha Hindi Projects

సంబంధిత కథనాలు

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

NTR30 Shooting : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?

NTR30 Shooting : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

టాప్ స్టోరీస్

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్

Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్