Rashi Khanna Crush : రాశీ ఖన్నా క్రష్ ఎవరో తెలుసా? బాలకృష్ణ అడిగితే చెప్పాల్సిందే మరి
జయప్రద, జయసుధ, రాశీ ఖన్నా... ముగ్గురు హీరోయిన్లు ఈ వారం 'అన్‌స్టాపబుల్ 2'లో సందడి చేయనున్నారు. వాళ్ళతో బాలకృష్ణ స్టెప్పులు వేశారు.
![Rashi Khanna Crush : రాశీ ఖన్నా క్రష్ ఎవరో తెలుసా? బాలకృష్ణ అడిగితే చెప్పాల్సిందే మరి Actress Rashi Khanna Reveals Her Crush On Vijay Deverakonda In NBK's Unstoppable Show Rashi Khanna Crush : రాశీ ఖన్నా క్రష్ ఎవరో తెలుసా? బాలకృష్ణ అడిగితే చెప్పాల్సిందే మరి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/20/e9a407825f7d95ec0b220cb7b011d23f1671521122003313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇంటర్వ్యూ చేస్తే? మామూలుగా ఉండదు. అలవోకగా, చాలా సింపుల్‌గా క్లిష్టమైన ప్రశ్నలను ఆయన అడుగుతున్నారు. సెలబ్రిటీలూ అంతే సరదాగా మనసులో మాట చెబుతున్నారు. ఇప్పుడు రాశీ ఖన్నా చేత ఆమె క్రష్ గురించి చెప్పారు.
విజయ్ దేవరకొండ అంటే...
ఈ తరం కథానాయికల్లో రాశీ ఖన్నా (Raashi Khanna) ఒకరు. ఆమె అంటే పడిచచ్చే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఆమె తమ క్రష్ అని చెప్పుకొంటారు. మరి, రాశీ ఖన్నా క్రష్ ఎవరు? 'నువ్వు యాక్ట్ చేసిన హీరోల్లో ఎవరి మీద నీకు క్రష్ ఉంది?' అని ఆమెను బాలకృష్ణ అడిగారు. అప్పుడు ''విజయ్ దేవరకొండ అనుకుంటున్నాను'' అని ఆమె సమాధానం ఇచ్చారు. సీనియర్ హీరోయిన్లు జయప్రద, జయసుధలతో పాటు రాశీ ఖన్నా కూడా ఈ వారం 'అన్‌స్టాపబుల్ 2' ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు.
View this post on Instagram
జయసుధను పెళ్లి కూతురు చేయడం కోసం...
జయసుధతో తన స్నేహం గురించి జయప్రద చెబుతూ ''తనను పెళ్లి కూతురు చేయడం కోసం నా షూటింగ్ ఆపేసి వెళ్లాను'' అన్నారు. వెంటనే బాలకృష్ణ ''కాంపిటీషన్ కట్ చేద్దామని కదా'' అని చమత్కరించారు. నారి నారి నడుమ మురారి తరహాలో ముగ్గురు భామలతో కలిసి బాలకృష్ణ వేసిన స్టెప్పులు ప్రోమోలో హైలైట్ అయ్యాయి. ఈ ఎపిసోడ్ శుక్రవారం స్ట్రీమింగ్ కానుంది.
రికార్డులు క్రియేట్ చేస్తున్న ప్రభాస్ ప్రోమో!
ఇప్పటి వరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క... ఇప్పుడు వచ్చే గెస్టులు ఓ లెక్క... అనే విధంగా 'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపీచంద్ వచ్చారు. వాళ్ళిద్దరితో బాలకృష్ణ చేసిన సందడి ప్రోమోలో ఆడియన్స్ చూశారు. ఇప్పుడు ఆ ప్రోమో రికార్డులు క్రియేట్ చేస్తోంది.
Also Read : నయనతార 'కనెక్ట్' భయపెట్టిందట, 3 ప్లస్ రేటింగులే - ఆడియన్స్ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే?
View this post on Instagram
ప్రభాస్, గోపీచంద్ వచ్చిన 'అన్‌స్టాపబుల్ 2' ఎపిసోడ్‌లో రామ్ చరణ్ కూడా సందడి చేయనున్నారు. ఆయనతో ఫోన్ మాట్లాడారు. అప్పుడు ప్రభాస్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. గోపీచంద్ కూడా రామ్ చరణ్ రాణి గురించి హింట్ ఇచ్చారా? అన్నట్లు చెప్పారు. దాంతో వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసుకోవాలని ఆడియన్స్ ఆతృతగా ఉన్నారు. ఇయర్ ఎండ్ ధమాకాగా ఆ ఎపిసోడ్ రిలీజ్ కానుంది.
డబుల్ ధమాకా... డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్... డబుల్ గెస్టులు... డబుల్ సందడి... ఎక్కడ కూడా 'తగ్గేదే లే' అంటూ నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ముందుకు వెళుతున్నారు. 'ఆహా' ఓటీటీ (Aha OTT Telugu) కోసం ఆయన హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్' (Unstoppable). ఫస్ట్ సీజన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అయ్యింది. ఇప్పుడు సెకండ్ సీజన్‌లో డబుల్ గెస్టులతో సందడి చేస్తున్నారు.
ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే 'అన్‌స్టాపబుల్' ఎపిసోడ్స్, యూట్యూబ్‌లో ప్రోమోస్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. రాజకీయ నాయకులు, సీనియర్లు వచ్చినప్పుడు షోను ఓ విధంగా నడుపుతున్న బాలకృష్ణ... యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, శర్వానంద్, అడివి శేష్ వంటి వారు వచ్చినప్పుడు పూర్తిగా బాలుడు అయిపోతున్నారు. యువ హీరోలతో కలిసి విపరీతంగా సందడి చేస్తున్నారు. బాలకృష్ణకు 'అన్‌స్టాపబుల్' కొత్త ఇమేజ్ తీసుకు వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. షో చూసి కొందరు ఆయనకు ఫ్యాన్స్ అవుతున్నారు.
Also Read : హీరోపై చెప్పుతో దాడి - పునీత్ రాజ్‌కుమార్ బతికుంటే సపోర్ట్ చేసేవాడా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)