Meena: ‘నీకు మేమున్నాం మిత్రమా’ - మీనాను కలిసిన అలనాటి తారలు
మీనా ఇంట అలనాటి తారలు రంభ, సంగీత, సంఘవి సందడి చేశారు.
ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ ఇటీవలే కన్ను మూసిన సంగతి తెలిసిందే. దీంతో మీనా ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మీనా కూడా కొద్ది రోజులు షూటింగ్స్, సోషల్ మీడియా యాక్టివిటీలకు దూరంగా ఉంది. అయితే, ఎప్పుడూ సరదాగా ఉండే మీనా.. అలా ఒంటరిగా కుమిలిపోవడాన్ని చూసి ఆమె స్నేహితులు చలించిపోయారు. దీంతో అంతా కలిసి మీనా ఇంటికి వెళ్లారు. దీంతో చాలా రోజుల తర్వాత మళ్లీ మీనా ముఖంలో చిరునవ్వు కనిపించింది.
ఇంతకీ ఆ స్నేహితులు ఎవరూ అనుకుంటున్నారా? ఇంకెవ్వరు అలనాటి తారలు రంభ, సంఘవి, సంగీత. వీరంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి మీనా ఇంటికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను మీనా తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, సూపర్ ఫోటోస్ అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ మీనా భర్త విద్యాసాగర్ జూన్ 29న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే. భర్త మరణాన్ని జీర్ణించుకుని ఇప్పుడిప్పుడే బయటకి వచ్చి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుంది. ఇటీవల రాజేంద్రప్రసాద్ తో కలిసి ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేస్తూ దాదాపు 32 సంవత్సరాల తర్వాత తన మొదటి హీరోతో కలిసి మళ్ళీ నటిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ కథానాయకుడిగా నటించిన సినిమా ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, మీనా కీలక పాత్రలు పోషించారు. దీని కోసమే వీరిద్దరూ కలిసి షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ సినిమా సెట్స్ లో జరిగిన రాజేంద్రప్రసాద్ బర్త్ డే వేడుకల్లోనూ ఆమె మెరిశారు. మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాలో ఆమె నటించారు.
View this post on Instagram
View this post on Instagram