అన్వేషించండి

Priyamani: నేను ముద్దు సీన్లలో ఎందుకు నటించడం లేదంటే? అసలు విషయం చెప్పిన ప్రియమణి!

ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన ప్రియమణి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. తాజాగా ‘నో కిస్సింగ్ పాలసీ’ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముద్దు సీన్లలో నటించకపోవడానికి కారణం చెప్పింది.

తెలుగుతో పాటు తమిళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణి ప్రియమణి. ఒకప్పుడు పలువురు అగ్ర హీరోలతో కలిసి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత యుంగ్ హీరోయిన్లతో పోటీ పడలేక కాస్త సైడ్ అయ్యింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. తాజాగా నాగ చైతన్య హీరోగా నటించిన ‘కస్టడీ’లో కీలక పాత్ర పోషించింది. రాజకీయ నాయకురాలిగా అద్భుత నటన కనబర్చింది. బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘జవాన్’ మూవీలోనూ కనిపించబోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కలిసి నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఓ చానెల్ తో మాట్లాడిన ఆమె ‘నో కిస్సింగ్ పాలసీ’పైన స్పందించింది. గత కొంత కాలంగా ముద్దు సీన్లలో నటించకపోవడానికి గల కారణాలను వివరించింది.  

ముద్దు సీన్లలో ఎందుకు నటించడం లేదంటే?

వాస్తవానికి తాను సినిమా పరిశ్రమలోకి వచ్చిన నాటి నుంచే నో కిస్సింగ్ పాలసీపై కీలక నిర్ణయం తీసుకున్నానని ప్రియమణి తెలిపింది. తాను చేసే సినిమాలను చూసి భవిష్యత్ లో ఇబ్బంది పడకూడదనే ముద్దు సీన్లకు దూరంగా ఉంటున్నట్లు చెప్పింది. పెళ్లయ్యాక ఈ నిర్ణయాన్ని మరింత పకడ్బందీగా ఫాలో అవుతున్నట్లు వివరించింది. “పెళ్లి అయిన తర్వాత ముద్దు సీన్లలో అస్సలు నటించకూడదు అనుకున్నాను. సినిమాలో కేవలం ఓ క్యారెక్టర్ కోసం చేసినా, దాని వల్ల వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. నేను ఏ సినిమా చేసినా, నా తల్లితండ్రులలో పాటు అత్తమామలు చూస్తారు. అలాంటి సన్నివేశాలు చేస్తే ఇంట్లో వాళ్లు కూడా ఇబ్బంది పడతారు. అలా వారు ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ముద్దు సీన్ల వల్ల ముఖ్యంగా నా భర్తకు ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటి అవకాశం ఇవ్వకూడదు అనుకున్నాను.  అందుకే నా పెళ్లి తర్వాత ఎలాంటి ముద్దు సీన్లలో నటించలేదు. సినిమాకు సైన్ చేసే ముందు ఈ విషయాన్ని మేకర్స్ కు చెప్తాను. ఈ కండీషన్ కు ఓకే అయితేనే సినిమా చేస్తానని చెప్పేస్తాను” అని వివరించింది.   

2017లో ప్రేమ వివాహం చేసుకున్న ప్రియమణి

2017లో ప్రియమణి ప్రేమ వివాహం చేసుకుంది. వ్యాపారవేత్త ముస్తఫా రాజాతో కొంత కాలం ప్రేమాయణం కొనసాగించిన ఆమె, ఆ తర్వాత బెంగళూరులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఆమె పెళ్లైన కొత్తలో నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ట్రోలింగ్ నడిపించారు. ముస్లీంను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అంటూ ప్రశ్నించారు. లవ్ జీహాద్ బారిన పడిందని కామెంట్స్ పెట్టారు. ఆమె పిల్లలు కూడా లవ్ జీహాదీలుగానే మారుతారంటూ దారుణంగా విమర్శించారు. అలాంటి ట్రోలింగ్స్ పై స్పందించిన ప్రియమణి, తన మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నానని చెప్పారు. తనతో సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎవరు ఏం మాట్లాడుకున్నా, తాను పట్టించుకోనని తేల్చి చెప్పారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priya Mani Raj (@pillumani)

Read Also: ‘జవాన్’ మ్యూజిక్ రైట్స్ - ఓ మై గాడ్, ఆడియో రైట్సే అంత ఉంటే, మూవీకి ఎంత డిమాండ్ ఉంటుందో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Volunteer System: వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
Warangal BRS leaders: వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
Drone Pilot Training: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
Shoaib Akhtar Comments: పాకిస్థాన్‌లో ఆడాలా వద్దా అనే నిర్ణయం బీసీసీఐది కాదు బీజేపీ గవర్నమెంట్‌ది- అక్తర్ హాట్‌ కామెంట్స్ 
పాకిస్థాన్‌లో ఆడాలా వద్దా అనే నిర్ణయం బీసీసీఐది కాదు బీజేపీ గవర్నమెంట్‌ది- అక్తర్ హాట్‌ కామెంట్స్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మెగాస్టార్ కోసం..  కలిసిన మమ్ముట్టి-మోహన్ లాల్ టీమ్స్ఏఆర్ రెహమాన్ విడాకులు, 29 ఏళ్ల బంధానికి ముగింపుMarquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Volunteer System: వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
Warangal BRS leaders: వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
Drone Pilot Training: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
Shoaib Akhtar Comments: పాకిస్థాన్‌లో ఆడాలా వద్దా అనే నిర్ణయం బీసీసీఐది కాదు బీజేపీ గవర్నమెంట్‌ది- అక్తర్ హాట్‌ కామెంట్స్ 
పాకిస్థాన్‌లో ఆడాలా వద్దా అనే నిర్ణయం బీసీసీఐది కాదు బీజేపీ గవర్నమెంట్‌ది- అక్తర్ హాట్‌ కామెంట్స్ 
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Gold Rate: బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్‌ కంపెనీ జోస్యం!
బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్‌ కంపెనీ జోస్యం!
Maharashtra Assembly Election 2024: మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Embed widget