Nithya Menen: ఆరేళ్లపాటు వేధించాడు, 30 నెంబర్లు బ్లాక్ చేశా - నిత్యామీనన్ కామెంట్స్!
నిత్యామీనన్ నటించిన మలయాళ సినిమా '19 (1) A' ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంది.
అప్పటివరకు మలయాళ చిత్రాల్లో నటించిన నిత్యామీనన్(Nithya Menen) 'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' ఇలా ఎన్నో హిట్టు సినిమాల్లో నటించింది. మెయిన్ లీడ్ కాకుండా సెకండ్ హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్ 'భీమ్లానాయక్'(BheemlaNayak) సినిమాలో కనిపించింది.
రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన మలయాళ సినిమా '19 (1) A' ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంది నిత్యామీనన్. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. నిత్యా గురించి తెలిసినవారంతా.. ఆమె చాలా సరదాగా ఉంటుందని, చాలా సింపుల్ నేచర్ అని చెబుతుంటారు. అందరితో కలివిడిగా ఉంటే ఈ బ్యూటీ వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చింది.
Nithya Menen’s allegations of mental harassment: సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి తనను వేధించినట్లు తెలిపింది నిత్యా. సంతోష్ వర్గీ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేశాడని.. ఆరేళ్లపాటు తనను అన్‌పాపులర్ చేయడానికి ప్రయత్నించాడని నిత్యామీనన్ తెలిపింది. దాదాపు 30 వేర్వేరు నెంబర్స్ నుంచి ఫోన్లు చేస్తూ వేధించేవాడని.. అన్ని నెంబర్స్ ను బ్లాక్ చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తన పేరెంట్స్ అండగా నిలబడ్డారని.. అతడిని గట్టిగా హెచ్చరించామని తెలిపింది. చాలా మంది అతడిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పినట్లు.. కానీ క్షమించి వదిలేశానని చెప్పుకొచ్చింది.
ఈ మధ్యకాలంలో నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఓ మలయాళ హీరోతో ఆమె పెళ్లి జరగనుందని వార్తలొచ్చాయి. వీటిపై నిత్యామీనన్ క్లారిటీ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. ఇప్పట్లో తనకు పెళ్లి ఆలోచన లేదని వెల్లడించింది. ఎవరో ఒకరు ఇలాంటి పుకారు సృష్టిస్తే.. మీడియా నిజం తెలుసుకోకుండా వార్తలు ప్రచురించిందంటూ చెప్పుకొచ్చింది నిత్యా. తన కెరీర్ లో గ్యాప్స్ తీసుకుంటూ ఉంటానని.. నటులకు ఇలాంటి బ్రేక్స్ అవసరమని.. అంతేకానీ పెళ్లి కోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదని తెలిపింది. ఇప్పటికే ఐదు ప్రాజెక్ట్స్ పూర్తి చేశానని.. త్వరలోనే అవి రిలీజ్ కాబోతున్నాయని చెప్పింది.
ఇటీవల 'మోడర్న్ లవ్ హైదరాబాద్' అనే అంథాలజీ ఫిల్మ్ తో అలరించిన నిత్యామీనన్.. ప్రస్తుతం ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న 'తిరుచిత్రాంబలం' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 18న విడుదల కానుంది. ఇప్పుడు హీరోయిన్ గానే కాకుండా.. నిర్మాతగా మారి సినిమాలు చేస్తోంది నిత్యామీనన్.
Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం - రెండో పెళ్లి చేసుకోబోతున్న హృతిక్ మాజీ భార్య!
Also Read: పండుగాడి యూఫోరియా - 'పోకిరి' స్పెషల్ షోలకి షాకింగ్ బుకింగ్స్!