By: ABP Desam | Updated at : 28 Mar 2023 07:27 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Chef Surender Mohan/Instagram
టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య మాజీ మిస్ ఇండియా శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉంటున్నారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే మొన్నామధ్య నాగ చైతన్య, శోభిత కలసి విదేశాల్లో షాపింగ్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తర్వాత ఆ ఫోటో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని తేలింది. దీనిపై నాగ చైతన్య గానీ, శోభిత గానీ స్పందించలేదు. కానీ వీరి ప్రేమ వ్యవహారంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాగచైతన్య, శోభిత కలసి లండన్ లో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో వీరి డేటింగ్ మేటర్ మళ్లీ తెరపైకి వచ్చింది.
వీరిద్దరూ కలసి లండన్ లో జమావర్ లో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటో అది. అక్కడ చెఫ్ సురేందర్ మోహన్ నాగ చైతన్యతో ఫోటో దిగారు. సురేందర్ ఆ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటో బ్యాగ్రౌండ్ లో టేబుల్ వద్ద శోభిత కూర్చున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటో కాస్తా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఆమె శోభితానే అని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరి డేటింగ్ మేటర్ ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిందేమీ కాదు. దీనిపై గతంలోనూ పలు వార్తలు వచ్చాయి. గతంలో నాగ చైతన్య, శోభిత లండన్ వెకేషన్ లో ఉన్న సమయంలో ఇద్దరూ కలసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అప్పటి నుంచే వీరి డేటింగ్ మేటర్ బయటకొచ్చింది. అయితే తర్వాత ఆ ఫోటో ఒరిజినల్ కాదని, మార్ఫింగ్ చేసి పక్కపక్కన పెట్టారని అన్నారు.
తర్వాత నాగ చైతన్య కొత్త ఇంట్లో శోభిత కనిపించింది. దీంతో వీరి డేటింగ్ వార్తలకు బలం చేకూరింది. అయితే ఇదే విషయంపై ఓ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో నాగ చైతన్యను ప్రశ్నిస్తే ఒక నవ్వు నవ్వి దాటవేశారు. ఈ డేటింగ్ వ్యవహారంపై ఇప్పటివరకూ ఈ ఇద్దరూ ఎక్కడా స్పందించలేదు. తాజాగా ఈ ఫోటో బయటపడటంతో అందులో ఉన్నది శోభితానే అని, వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని నెట్టింట వరుసగా కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి చెఫ్ మోహన్ తీసుకున్న సెల్ఫీ వీరి డేటింగ్ మేటర్ ను మరోసారి రుజువు చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇక నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’ సినిమాలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు వెంకట ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బైలింగువల్ చిత్రంతో నాగ చైతన్య తమిళ్ లో కూడా అడుగుపెట్టబోతున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పోలీస్ అధికారి పాత్రలో నాగచైతన్య కనిపించనున్నారు. మే 12న ఈ సినిమా విడుదల కానుంది. అటు శోభిత కూడా ప్రస్తుతం వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. ఓ వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతోంది.
Read Also: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?
Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
Guppedanta Manasu Rishi Re-Entry: జైల్లోంచి విడుదలైన రిషి - మూడేళ్లలో ఏం జరిగింది - మరింత ఇంట్రెస్టింగ్ గా 'గుప్పెడంతమనసు'
ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?
Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?