అన్వేషించండి

Comedian Ali: ‘డబుల్ ఇస్మార్ట్’లో అలీ కామెడీపై నెటిజన్ల ట్రోలింగ్, బెడిసికొట్టిన పూరీ ఐడియా

‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో అలీ కామెడీ ట్రాక్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వెంటనే మూవీ నుంచి ఆయన క్యారెక్టర్ ను ఎత్తేయకపోతే సినిమాకు మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Ali Comedy In Double Ismart Movie:  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన తాజా  చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోతోంది. భారీ అంచనాల నడుమ ఆగష్టు 15న విడుదలైన ఈ మూవీ.. తొలి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ‘లైగర్’ డిజాస్టర్ నుంచి ఈ మూవీ పూరిని బయట పడేస్తుందని అందరూ భావించినా, సాధ్యం కాలేకపోయింది. ఈ సినిమాను చూసి పూరి దర్శకత్వంలో వచ్చిన మూవీయేనా ఇది? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

పూరి సినిమాల్లో అలీ కామెడీ

దర్శకుడు పూరి జగన్నాథ్ చిత్రాల్లో కమెడియన్ అలీ కామెడీ ట్రాక్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఆయన కామెడీకి ప్రేక్షకులు పడీపడీ నవ్వుతారు. ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’, ‘పోకిరి’ ‘దేశముదురు’తో పాటు పలు సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు అలీ. తాజాగా విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’లోనూ ఆయనకు స్పెషల్ కామెడీ ట్రాక్ డిజైన్ చేశారు పూరి. బొకా అనే క్యారెక్టర్ లో కనిపించారు. అయితే, ఈ సినిమాకు ఆయన కామెడీ ట్రాక్ కు అస్సలు సింక్ కాలేదనే విమర్శలు వస్తున్నాయి.

చిరాకు పుట్టించిన అలీ కామెడీ

‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో అలీ కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు నవ్వు తెప్పించకపోగా, మరింత చిరాకు కలిగించిందనే కామెంట్స్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా వస్తున్న సినిమాల్లో ఇంత చెత్త కామెడీ ఎందులోనూ లేదంటున్నారు. అలీ వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు అసహనానికి గురైనట్లు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సినిమా కాస్త బాగుంది అనే లోగా అలీ వచ్చి చెడగొడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలీ ట్రాక్ లేకపోతే సినిమా కాస్త బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

‘బొకా’ క్యారెక్టర్ లేపేయకుంటే సినిమాకు బొక్కే!

ఈ సినిమా చూసిన ప్రేక్షకులలో చాలా మంది అలీ కామెడీ ట్రాక్ మినహా మిగతా సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ను మ్యాచ్ చేసేలా ఉందంటున్నారు. వీలైనంత త్వరగా అలీ కామెడీ ట్రాక్ ను తొలగించడం మంచిదంటున్నారు. అప్పుడే ఈ సినిమాకు కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఈ విషయం మేకర్స్ దృష్టికి వెళ్లిన నేపథ్యంలో ఆయన ట్రాక్ తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పూరి జగన్నాథ్ ఖాతాలో మరో ఫ్లాప్

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రామ్ పోతినేనికి జోడీగా కావ్యా థాపర్ నటించింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించారు. మణిశర్మ సంగీతం అందించారు. మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నా.. ఈ సినిమా చివరకు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. పూరి ఖాతాలో మరో ఫ్లాప్ పడింది.

Read Also: మూవీ రివ్యూ నేను రాస్తానంటున్న దిల్‌ రాజు - 'రేవు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాత ఒపెన్ స్టేట్‌మెంట్!

Also Read: 'తంగలాన్‌'కు పార్ట్‌ 2 కూడా ఉంది - కన్‌ఫాం చేసిన హీరో విక్రమ్‌

టాప్ హెడ్ లైన్స్

Lenin Live Updates: లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 14 సినిమాలు... ఇవి అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 14 సినిమాలు... ఇవి అస్సలు మిస్ కావొద్దు
Illu Illalu Pillalu Serial Today July 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్‌కి 7 ఏళ్ల జైలు శిక్ష..! కానీ.. అమూల్య అలా చెప్పిందేంటి? పగ పట్టేసిన వల్లీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్‌కి 7 ఏళ్ల జైలు శిక్ష..! కానీ.. అమూల్య అలా చెప్పిందేంటి? పగ పట్టేసిన వల్లీ!
Gundeninda Gudigantalu July10th Episode:మనోజ్ తిక్క కుదిర్చేందుకు బాలు చేసిన పనేంటి...? గుడ్డివాడిగా ఇంట్లో తిప్పలు పడుతున్న మనోజ్‌
గుండెనిండా గుడిగంటలు: మనోజ్ తిక్క కుదిర్చేందుకు బాలు చేసిన పనేంటి...? గుడ్డివాడిగా ఇంట్లో తిప్పలు పడుతున్న మనోజ్‌

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్‌
కేవలం రూ.10.49 లక్షలకే కొత్త నిస్సాన్ టెక్టాన్ - క్రెటా, సెల్టోస్‌కు కొత్త సవాల్
Breaking News:నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
Lenin Live Updates: లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Benefits Of Matcha Tea: గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
Prashna Ravan: రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
Embed widget