Abu Dhabi Grand Prix: అబుదాబిలో రణ్ వీర్ సింగ్ సందడే సందడి! ఉసేన్ బోల్ట్, బెన్ స్టోక్స్, క్రిస్ గేల్‌తో ఫోటోలకు ఫోజులు!
ఎడారి దేశంలో రణ్ వీర్ సింగ్ మస్త్ ఎంజాయ్ చేస్తున్నాడు. అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ కు హాజరైన ఈ స్టైలిష్ యాక్టర్, పలువురు క్రీడా, సినీ దిగ్గజాలను కలిశాడు. ఈ సందర్భంగా ఫోటోలకు ఫోజులిచ్చాడు.
అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ లో రణ్ వీర్ సందడి!
ఎడాది దేశం అబు దాబిలో బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ హ్యాపీగా జాలీగా గడుపుతున్నాడు. తాజాగా దుబాయ్ లో జరిగిన ఫిల్మ్ ఫేర్ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశాడు. ఆటా, పాటలతో ఈవేడుకకు ఉరిమే ఉత్సాహాన్ని అందించాడు. అటు నుంచి అబుదాబిలో జరుగుతున్న ‘అబుదాబి గ్రాండ్ ప్రిక్స్’ ఈవెంట్ కు హాజరయ్యాడు. అక్కడ రణ్ వీర్ చేసిన అల్లరి మామూలుగా లేదు. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడా దిగ్గజాలతో కలిసి ఎంజాయ్ చేశాడు. సరదా సరదా కబుర్లు చెప్పుకోవడంతో పాటు ఫోటోలు దిగి సందడి చేశాడు.
ఇక అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ లో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడా, సినీ ప్రముఖులు తరలి వచ్చారు. జమైకన్ రన్నర్ ఉసేన్ బోల్ట్, మాంచెస్టర్ సిటీ ఫుట్ బాల్ మేనేజర్ పెప్ గార్డియోలా, ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్‌తో సహా పలువురు ప్రముఖ క్రీడాకారులు ఈవెంట్ కు హాజరయ్యారు. అక్కడికి వచ్చిన స్పోట్స్ ప్రముఖులను రణ్ వీర్ పేరు పేరున పలకరించాడు.
View this post on Instagram
క్రీడా, సినీ ప్రముఖులను కలిసిన రణ్ వీర్
ఇటాలియన్ ఫుట్ బాల్ క్రీడాకారుడు ఫ్రాన్సిస్కో టోట్టి, రష్యన్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్ ఇస్లాం మఖచెవ్, మాజీ అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ షాకిల్ ఓ నీల్, స్పానిష్ ఫుట్ బాల్ ఆటగాడు సెర్గియో రామోస్, ఫ్రెంచ్ ఫుట్ బాల్ ఆటగాడు పియరీ-ఎమెరిక్ ఎమిలియానో ఫ్రాంకోయిస్ ఔబమేయాంగ్, ఇంగ్లండ్ క్రికెటర్లు జో రూట్, జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్ ను కలిశాడు. వారితో సరదాగా గడిపాడు. క్రీడా ప్రముఖులతో పటు సినీ సెలబ్రిటీలతోనూ రణ్ వీర్ మీటయ్యాడు. అమెరికన్ హాస్యనటుడు మార్టిన్ లారెన్స్, అమెరికన్ రాపర్ Will.i.am, అమెరికన్ నటుడు పారిస్ హిల్టన్ లతో కలిసి ఫోటోలు తీసుకున్నాడు.
View this post on Instagram
వరుస సినిమాలు చేస్తున్న రణ్ వీర్
ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రణ్ వీర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సిర్కస్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తున్నారు. మరో నటుడు వరుణ్ శర్మ కూడా కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు సౌత్ టాప్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అఫీషియల్ గా వెల్లడయ్యే అవకాశం ఉంది. మరికొన్ని సినిమా కథలను కూడా ఆయన వింటున్నాడు.
Read Also: స్టైలిష్ లుక్‌లో జక్కన్న - అంతర్జాతీయ అవార్డుల వేడుకలో రాజమౌళికి అరుదైన గౌరవం