అన్వేషించండి

Aarti Ravi: నన్ను అడగకుండానే విడాకుల ప్రకటన చేశాడు, ‘జయం’ రవి పై భార్య సంచలన ఆరోపణలు

తమిళ హీరో ‘జయం’ రవిపై ఆయన భార్య ఆర్తి షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు చెప్పకుండానే విడాకుల ప్రకటన చేశాడని ఆరోపించింది. ఆయన ప్రకటన చూసి షాక్ కు గురైనట్లు వెల్లడించింది.

Aarti Ravi Responds On Jayam Ravi’s Divorce Announcement: తమిళ నటుడు ‘జయం’ రవి తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి ఆర్తి సంచలన ఆరోపణలు చేసింది. తనకు తెలియకుండా, తనను సంప్రదించకుండానే విడాకుల ప్రకటన చేశారని వెల్లడించింది. విడాకుల ప్రకటన చూసి తాను షాక్ అయ్యానని తెలిపింది. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ఓ నోట్ రిలీజ్ చేసింది.   

నేను, నా పిల్లలు షాకయ్యాం- ఆర్తి

తన నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే రవి విడాకుల ప్రకటన చేశాడని ఆర్తి ఆరోపించింది. “నాకు తెలియకుండా, నా వివరణ అడగకుండానే రవి విడాకుల గురించి ప్రకటించారు. ఈ విషయం తెలిసి నేను షాకయ్యాను. ఎంతో బాధపడ్డాను. గత 18 సంవత్సరాలుగా ఇద్దరం కలిసి ఉంటున్నాం. అత్యంత కీలకమైన విడాకుల విషయంలో నా నుంచి అనుమతి తీసుకోలేదు. గత కొంత కాలంగా మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. నేరుగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలనుకున్నా. నా భార్తతో మాట్లాడలని ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ, ఇప్పటికీ నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. విడాకుల ప్రకటన చూసి నేను, నా పిల్లలు దిగ్భ్రాంతికి గురయ్యాం. ఇది పూర్తిగా వన్ సైడ్ నిర్ణయం. ఈ నిర్ణయం మాకు అన్యాయం చేసేలా ఉంది. ఎంతో బాధ ఉన్నా, గౌరవంగానే ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. అందుకే బహిరంగంగా ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. అన్యాయంగా నా గురించి తప్పుగా ప్రకటనలు చేయడం చాలా బాధగా అనిపిస్తున్నది. ఇలాంటి తప్పుడు నిందలు నాతో పాటు నా పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయినా, నేను బయటకు మాట్లాడటం లేదు. కాలమే అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చెప్తుందని భావిస్తున్నాను. నాకు అండగా నిలిచిన బంధు మిత్రులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మీ సపోర్టు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా ప్రైవసీకి ఇబ్బంది కలిగించకూడదని కోరుకుంటున్నాను” అని జయం రవి భార్య ఆర్తి తన ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఆర్తి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aarti Ravi (@aarti.ravi)

సెప్టెంబర్ 9న విడాకుల ప్రకటన చేసిన ‘జయం’ రవి  

తమిళ స్టార్ హీరో ‘జయం’ రవి రెండు రోజుల క్రితం(సెప్టెంబర్ 9న) తన భార్యతో  ఆర్తి నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. బరువెక్కిన హృదయంతో తన వ్యక్తిగత విషయానికి సంబంధించి ఓ విషయాన్ని పంచుకోబోతున్నానంటూ డివోర్స్ విషయాన్ని వెల్లడించారు. “చాలా ఆలోచనలు చేశాక, అనేక చర్చలు జరిగాక, నా జీవితంలో అత్యంత కఠినమైన, కష్టతరమైన నిర్ణయం తీసుకున్నాను. ఆర్తితో వివాహ బంధానికి ఫుల్ స్టాఫ్ పెడుతున్నాను. ఈ నిర్ణయం నా వ్యక్తిగత కారణంతోనే తీసుకున్నాను. ఎలాంటి ఇతర కారణాలు లేవు. ఈ సమయంలో ఎవరూ తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయకూడదని, తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేటుగానే ఉండాలని వేడుకుంటున్నాను” అని వెల్లడించారు.  

Read Also: అవును... మేం విడిపోయాం - ఆర్తితో విడాకులు కన్ఫర్మ్ చేసిన హీరో జయం రవి

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget