Christmas 2021 : బాలీవుడ్ స్టార్ హీరోతో బన్నీ బాక్సాఫీస్ వార్.. నెగ్గేదెవరు..?

బాలీవుడ్ లో బన్నీకి పోటీ తప్పేలా కనిపించడం లేదు.

FOLLOW US: 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పార్ట్ 1కి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసేశారు. డిసెంబర్ నెల నుండి పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ ను మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి పార్ట్ 1ను ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ సమయానికి 'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో బన్నీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 
 
ఆ తరువాత సంక్రాంతికి వెళ్తారని అనుకున్నారు. కానీ అదే సమయానికి భారీ సినిమాలు చాలానే రిలీజ్ అవుతుండడంతో 'పుష్ప' ఇక సమ్మర్ కు వెళ్లిపోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ రచ్చ షురూ చేశారు. ప్రస్తుతానికైతే క్రిస్మస్ నాటికి వేరే సినిమా వస్తున్నట్లు ఎలాంటి హింట్స్ లేవు. కానీ ఇప్పుడు 'పుష్ప' లైన్ లోకి వచ్చింది కాబట్టి తెలుగు ఒకట్రెండు సినిమాలు అదే డేట్ కి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 
 
ఇదిలా ఉండగా.. బాలీవుడ్ లో మాత్రం బన్నీకి పోటీ తప్పేలా కనిపించడం లేదు. స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమాను కూడా క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. తొలిసారి బన్నీ తన 'పుష్ప' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంటే ఆయన సోలో రిలీజ్ అనేది మాత్రం దక్కడం లేదు. పైగా ఆమిర్ ఖాన్ లాంటి హీరోతో పోటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 
 
'ఫారెస్ట్ గంప్' అనే హాలీవుడ్ చిత్రానికి రీమేక్ గా 'లాల్ సింగ్ చద్దా'ను తెరకెక్కిస్తున్నారు. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ లో ఆమిర్ తో పోల్చుకుంటే బన్నీకి పెద్దగా ఫాలోయింగ్ లేదు. కానీ గతేడాది విడుదలైన 'అల.. వైకుంఠపురములో' సినిమాతో బన్నీకి బాలీవుడ్ ప్రేక్షకుల అటెన్షన్ కూడా దక్కింది. 
 
చాలా మంది సెలబ్రిటీలు సైతం బన్నీ 'బుట్టబొమ్మ' పాటకు డాన్స్ లు చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేశారు. అందుకే బన్నీ తన 'పుష్ప' సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సౌత్ సంగతి పక్కన పెడితే బాలీవుడ్ లో మాత్రం బన్నీకి వార్ తప్పేలా లేదు!
 
Tags: Allu Arjun Sukumar Pushpa Movie Pushpa Part 1 Aamir Khan Laal Singh Chaddha Lal Singh Chaddha Released Pushpa Part 1 Released Date Christmas 2021 Aamir Khan Movie

సంబంధిత కథనాలు

NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?

NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?

NBK107: 'ఖిలాడి' బ్యూటీతో బాలయ్య మాస్ స్టెప్పులు - కొరియోగ్రాఫర్ ఎవరంటే?

NBK107: 'ఖిలాడి' బ్యూటీతో బాలయ్య మాస్ స్టెప్పులు - కొరియోగ్రాఫర్ ఎవరంటే?

KGF 2: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!

KGF 2: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!

Pooja Hegde: వెంకటేష్ చెల్లెలిగా పూజాహెగ్డే - ఏ సినిమాలో అంటే?

Pooja Hegde: వెంకటేష్ చెల్లెలిగా పూజాహెగ్డే - ఏ సినిమాలో అంటే?

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!

PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!

Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !

Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !

Digital Rape Case : డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ ! అసలేంటి ఈ డిజిటల్ రేప్ ?

Digital Rape Case : డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ ! అసలేంటి ఈ డిజిటల్ రేప్ ?

Samsung Galaxy F23 5G Copper Blush: రూ.15 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Samsung Galaxy F23 5G Copper Blush: రూ.15 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!