అన్వేషించండి

Karnataka Polling : ముగిసిన కర్ణాటక పోలింగ్ - 70 శాతానికిపైగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం !

కర్ణాటకలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 70శాతానికిపైగా ఓటింగ్ నమోదయినట్లుగా తెలుస్తోంది.

 

Karnataka Polling :   కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.    మొత్తం 224 స్థానాలకు ఒకే దఫాలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించింది ఈసీ. మొత్తం 5 కోట్ల మంది ఎవరికి ఓటు వేశారు అనేది కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 58, 545 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,615 మంది అభ్యర్థులు తమ లక్ పరీక్షించుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకే 66 శాతం పోలింగ్ జరిగింది. ఆరు గంటల వరకు 70 శాతానికి నమోదయినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం ఆరు గంటల వరకూ క్యూలో ఉన్న వారికి ఓటు హక్కు కల్పిస్తున్నారు. ఓటింగ్ శాతం మరితం పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఎంత శాతం ఓటు  హక్కు నమోదయిందన్నది గురువారం ఉదయానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

కర్ణాటక మొత్తం ఒకేఫేజ్‌లో ఎన్నికలు

కర్ణాటక మొత్తం ఒకే ఫేజ్‌లో ఎన్నికలు జరిగాయి. ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. చెదురుమదులు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా జరిగాయి. విజయపుర జిల్లాలోని మసబినళలో స్థానికులు ఎన్నికల అధికారులపై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఎన్నికల అధికారులపై దాడులు చేశారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అడ్డుకున్న పోలీసులపై కూడా దాడులకు దిగారు స్థానికులు.

గత ఎన్నికల కన్నా ఎక్కువ ఓటింగ్ నమోదయ్యే అవకాశం

బిసాన, దోనూరు గ్రామం నుంచి రిజర్వు చేసిన ఓటింగ్ యంత్రాలను తిరిగి విజయపురానికి తీసుకువస్తుండగా స్థానికులు అడ్డుకుని ఈ దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈవీఎం,వీవీ ప్యాడ్ యంత్రాలను వెనక్కి పంపించటంపై స్థానికులు ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. దానికి అధికారులు సరిగా స్పందించకపోవటంతో ఆగ్రహం వ్యక్తంచేస్తు దాడులకు దిగినట్లుగా తెలిపారు. ఈ కేసులో 23 మందిని అరెస్టు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఓ చోట ఈవీఎంలు తరలిస్తున్నారని ఉద్రిక్తత

అసెంబ్లీ ఎన్నికల కోసం రిజర్వ్ చేయబడిన ఈవీఎంలను తీసుకెళ్తున్న సెక్షన్ ఆఫీసర్ వాహనాన్ని గ్రామస్థులు ఆపి రెండు కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, మూడు వీవీప్యాట్‌లు (ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్) ధ్వంసం చేశారని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. “సెక్టార్ ఆఫీసర్‌పై దాడి జరిగింది. 23 మందిని అరెస్టు చేశారు అని ఎన్నికల సంఘం పేర్కొంది. అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్‌లను మారుస్తున్నారనే పుకార్లు రావడంతో గ్రామస్థుల ఈ చర్యకు దిగారు. ఇవి పోలింగ్ ఈవీఎంలన్న ప్రచారం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  

రాజకీయ, సినీ ప్రముఖులు ఉదయాన్నే ఓటు హక్కు వినిగించుకున్నారు.  ఉదయం 7.00గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నాం వరకు మందకొడిగా కొసాగింది. మధ్యాహ్నాం నుంచి యువత పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటు వేశారు. దీంతో తర్వాత పోలింగ్ బూత్ ల వద్ద  బారులు కనిపించాయి.                

 

టాప్ హెడ్ లైన్స్

TDP First List: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
AP Local Body Polls: ఏపీ స్థానిక పోరులో రణరంగం.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
స్థానిక పోరులో మొదలైన రచ్చ.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
YSRCP Candidates: వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget