GOA Election 2022: గోవాలో రాహుల్ గాంధీ హామీల వర్షం.. గెలిపిస్తే నెలకు రూ. 6 వేలు ఖాతాలోకి
గోవా ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే పేద ఖాతాల్లో నెలకు రూ. 6 వేలు జమ చేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయ్ స్కీమ్‌ను అమలు చేస్తామని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారంలో ప్రకటించారు. ఇందులో భాగంగా పేదలకు ప్రతినెల రూ.6 వేలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పడతాయన్నారు.
#WATCH | Congress-Goa Forward Party (GFP) candidates took a pledge "to remain loyal to the party and Goa" in presence of party leader Rahul Gandhi earlier today#GoaElections2022 pic.twitter.com/SRAfEGVHdr
— ANI (@ANI) February 4, 2022
భాజపాపై విమర్శలు..
ఈ సందర్భంగా భాజపాపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా.. పర్యటక రంగం, కొవిడ్ 19, ఉద్యోగాలు కల్పించడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీ పనాజీ చేరుకున్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ, పర్యటక రంగం ప్రతినిథులతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి.