అన్వేషించండి
Advertisement
PM Modi Virtual Rally: వారిది గూండాల రాజ్యం.. మాది గ్రామీణ స్వరాజ్యం: ప్రధాని మోదీ
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్ ర్యాలీ నిర్వహించారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 రోజులే ఉన్నాయి. కానీ కరోనా వ్యాప్తి ఎక్కువగానే ఉండటంతో వర్చువల్ ర్యాలీలకు పార్టీలు శ్రీకారం చుట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. తొలి వర్చువల్ ర్యాలీకి దిల్లీ నుంచి హాజరయ్యారు. పశ్చిమ యూపీలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా ఈ ర్యాలీని భాజపా నిర్వహించింది.
ఈ ర్యాలీలో సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు చేశారు. ఐదేళ్ల క్రితం యూపీలో లూఠీలు, రౌడీయిజం ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడు వారి ఆట కట్టించామన్నారు.
మోదీ స్పీచ్ హైలెట్స్..
- 2017కు ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతి, భద్రతలకు తీవ్ర విఘాతం కలిగేది. కానీ ఇప్పుడు సురక్షితమైన వాతావరణం ఉంది. యువతులు ధైర్యంగా బయటకి వెళ్తున్నారు.
- 2017కు ముందు మేరట్, బులంద్‌షెహర్ వంటి జిల్లాల్లో అమ్మాయిలు బయటకు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు వారు ఎంతో ధైర్యంగా బయటకు వస్తున్నారు. రైతులు, యువతకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. దీనికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే కారణం.
- ఇంతకుముందున్న ప్రభుత్వాల పాలనలో.. లూఠీలు చేసేవారు, గూండాలదే రాజ్యం. వాళ్ల మాటలే ప్రభుత్వ ఆదేశాలుగా భావించేవారు.
- దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన షాపులు, భూములు, ఇళ్లు కబ్జా చేసేవారు. అప్పుడు కూడా మునుపటి ప్రభుత్వం కళ్లప్పగించి చూసింది.
- కానీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని వీటన్నింటి నుంచి విముక్తుల్ని చేసింది.
- ఓవైపు మేం ఉత్తర్‌ప్రదేశ్‌లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కొంతమంది ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతీకారమే వారి ధ్యేయం.
- యోగి ప్రభుత్వం.. అలాంటి మాఫియాలు, గూండాలకు తగిన గుణపాఠం నేర్పింది. అందుకే వాళ్లు తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. - ప్రధాని నరేంద్ర మోదీ
7 విడతల్లో..
403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు మొదలుకానున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.
Also Read: Virodh Diwas: ఎన్నికల వేళ రైతుల పోరు బాట.. సర్కార్ నమ్మించి.. మోసం చేసిందని ఆరోపణ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రైమ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement