TDP News: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ
TDP Second List: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల్లో భాగంగా 144 స్థానాల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తన రెండో జాబితాను విడుదల చేసింది.
Andhra Pradesh News: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండోజాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. 94 స్థానాలతో మొదటి జాబితాను విడుదల చేసిన టీడీపీ ఇవాళ 34 మందితో రెండో జాబితా విడుదల చేసింది.
రెండో జాబితాలో చోటు సంపాదించుకున్న అభ్యర్థులు వీళ్లే
1. | నరసన్నపేట | భగ్గు రమణమూర్తి |
2. | గాజువాక | పల్లా శ్రీనివాసరావు |
3. | చోడవరం | కేఎస్‌ఎస్‌ఎస్‌రాజు |
4. | మాడుగుల | పైలా ప్రసాద్ |
5. | ప్రత్తిపాడు | పరుపుల సత్యప్రభ |
6. | రామచంద్రపురం | వాసంశెట్టి సుభాష్ |
7. | రాజమండ్రి రూరల్ | గోరంట్ల బుచ్చయ్య జౌదరి |
8. | రంపచోడవరం | మిర్యాల శిరీష |
9. | కొవ్వూరు | ముప్పిడి వెంకటేశ్వరరావు |
10. | దెందులూరు | చింతమనేని ప్రభాకర్ |
11. | గోపాలపురం (ఎస్సీ) | మద్దిపాటి వెంకటరాజు |
12. | పెదకూరపాడు | భాష్యం ప్రవీణ్ |
13. | గుంటూరు వెస్ట్ | పిడుగురాళ్ల మాధవి |
14. | గుంటూరు ఈస్ట్ | మహమ్మద్ నజీర్ |
15 | గురజాల | యరపతినేని శ్రీనివాసరావు |
16 | కందుకూరు | ఇంటూరు శ్రీనివాసరావు |
17 | మార్కాపురం | కందుల నారాయణ రెడ్డి |
18 | గిద్దలూరు | అశోక్ రెడ్డి |
19 | ఆత్మకూరు | ఆనంరామనారాయణ రెడ్డి |
20 | కొవ్వూరు | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి |
21 | వెంకటగిరి | కురుకొండ్ల లక్ష్మీ ప్రియ. |
22 | కమలాపురం | పుత్తా చైతన్యరెడ్డి |
23 | ప్రొద్దుటూరు | వరదరాజుల రెడ్డి |
24 | నందికొట్కూరు | గిత్తా జయసూర్య |
25 | ఎమ్మిగనూరు | జయనాగేశ్వరరెడ్డి |
26 | మంత్రాలయం | రాఘవేంద్రరెడ్డి |
27 | పుట్టపర్తి | పల్లె సిధూరారెడ్డి |
28 | కదిరి | కందికుంట యశోదా దేవీ |
29 | మదనపల్లి | షాజహాన్ బాషా |
30 | పుంగనూరు | చల్లా రామచంద్రారెడ్డి(బాబు) |
31 | చంద్రగిరి | పులివర్తి వెంకట మణి ప్రసాద్(నాని) |
32 | శ్రీకాళహస్తి | బొజ్జల వెంకటసుదీర్‌రెడ్డి |
33 | సత్యవేడు | కోనేటి ఆదిమూలం |
34 | పూతలపట్టు | కలికిరి మురళి మోహన్ |
టీడీపీ రిలీజ్ చేసిన రెండో జాబితాలో 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఇద్దరు ఉన్నారు. 36 నుంచి 45 వయసు మధ్య ఉన్న వాళ్లు 8 మంది ఉన్నారు. 46 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు 19 మంది ఉన్నారు. 61-75 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు ముగ్గురే ఉన్నారు. 75 ఏళ్లకు పైబడిన వాళ్లు ఇద్దరు ఉన్నారు.
రెండో జాబితాలో పురుషుల సంఖ్య 27 మంది ఉన్నారు... స్త్రీలు ఏడుగురు ఉన్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో పీహెచ్‌డీ చేసిన వాళ్లు ఒకరుంటే.. పీజీ చేసిన వాళ్లు 11 మంది ఉన్నారు. డిగ్రీ మాత్రమే చదివిన వాళ్లు 9 మంది ఉన్నారు. ఇంటర్‌తో చదువు ఆపేసిన వాళ్లు 8 మంది ఉన్నారు. అంతకంటే తక్కువ చదివిన వాళ్లు ఐదుగురు మాత్రమే ఉన్నారు