అన్వేషించండి

Medak Assembly Election Results 2023: మెదక్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!

Medak Assembly Election Results 2023 : మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ ఏడాది (2023) గెలిచిన, ఓడిన అభ్యర్థుల జాబితా ఇక్కడ చూడొచ్చు. 2014, 2018 అభ్యర్థుల జాబితా కూడా మీకోసం...

 Medak Assembly Election Results 2023  constituencies wise winners and losers :  మెదక్‌ జిల్లా పరిస్థితి చూసుకుంటే ఇక్కడ అధికార పార్టీకి మొగ్గు కనిపిస్తోంది. అందరి అంచనాలును తలకిందులు చేస్తూ ఇక్కడ బీఆర్‌ఎస్‌ దూసుకెళ్తోంది. పది స్థానాలు ఉన్న మెదక్‌లో ఆరింటిలో కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. నాలుగు స్థానాల్లో హస్తం గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ రెండు పార్టీలు మినహా వేరే వాళ్లు ఈ మెదక్‌లో చోటు దక్కేలా కనిపించడం లేదు. 

మెదక్‌ నియోజకవర్గం

2023 లో  BRS అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు...
2018 లో మెదక్‌ నియోజకవర్గం నుంచి TRS  నేత పద్మాదేవేందర్‌ రెడ్డి వరుసగా మూడోసారి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్‌ అభ్యర్ది ఉపేందర్‌ రెడ్డిపై  44609 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2014లో  గెలిచిన తర్వాత ఆమె డిప్యూటి స్పీకర్‌ పదవి పొందారు. 2014 లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన విజయశాంతి...TRS అభ్యర్థి పద్మాదేవేందర్‌ రెడ్డిపై ఓడిపోయారు. విజయశాంతిపై 39600 ఓట్ల ఆధిక్యత సాధించారు

హుస్నాబాద్‌ నియోజకవర్గం
2018లో TRS  అభ్యర్ధి ఒడితెల సతీష్‌ కుమార్‌ సమీప CPI ప్రత్యర్ది చాడ వెంకటరెడ్డి పై 70157 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 
2014లో  సిట్టింగ్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రవీణ్‌ రెడ్డిని  ఒడితెల సతీష్‌ బాబు ఓడించారు. 2014లో సతీష్‌ బాబు హుస్నాబాద్‌ లో 34269 ఓట్ల ఆధిక్యతతో గెలపొందారు.

సిద్దిపేట నియోజకవర్గం

2023 లో సిద్ధిపేట నియోజకవ్రగం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి  పొన్నం ప్రభాకర్... BRS అభ్యర్థి వొడితల సతీష్ కుమార్  పై విజయం సాధించారు. 2018 లో TRS  సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు  118699 ఓట్ల రికార్డు మెజార్టీ వచ్చింది. ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్‌ ఐ నేత శ్రీనివాసరెడ్డిపై విజయం సాధించారు. 

నారాయణ ఖేడ్‌ నియోజకవర్గం
2023 లో నారాయణ ఖేడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పటోల్ల సంజీవరెడ్డి విజయం సాధించారు.  2018 నారాయణ ఖేడ్‌ నియోజకవర్గంలో TRS  అభ్యర్ధి ఎమ్‌.భూపాల్‌ రెడ్డి  సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది, మాజీ ఎమ్‌.పి సురేష్‌ షెట్కార్‌పై 58508 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  2014లో తెలంగాణలో TRS  గాలిని ఎదుర్కొని గెలిచిన కాంగ్రెస్‌ ఐ నేతలలో నారాయణ ఖేడ్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఒకరు. ఈయన టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఎమ్‌.భూపాల రెడ్డిని 14786 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు.

ఆందోల్‌ (ఎస్సి) నియోజకవర్గం
2023 లో ఆందోల్ నుంచి బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజా నర్సింహా..BRS అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ పై విజయం సాధించారు.  2018 ఆందోల్‌ రిజర్వుడ్‌ నియోజకవర్గంలో TRS  అభ్యర్దిగా పోటీచేసిన జర్నలిస్టు క్రాంతి కిరణ్‌ తొలిసారి విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది, మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర రాజ నరసింహపై 16851 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  2014లో దామోదర రాజనరసింహ ఓటమి చెందారు. ఆయనపై టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బాబూ మోహన్‌ 3291 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 

నర్సాపూర్‌ నియోజకవర్గం
2023 లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి వాకిటి సునీత లక్ష్మా రెడ్డి బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి విజయం సాధించింది.  2018 నర్సాపూర్‌ నియోజకవర్గంలో TRS సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి రెండోసారి గెలిచారు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిపై 38120 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మదన్‌ రెడ్డికి 105465 ఓట్లు రాగా,సునీతకు 67345 ఓట్లు వచ్చాయి. 
 
జహీరాబాద్‌ (ఎస్సి) నియోజకవర్గం
 2023 లో జహీరాబాద్‌ రిజర్వుడ్‌ నియోజకవర్గంలో BRS అభ్యర్థి మాణిక్‌రావు గెలుపొందారు.  2018 లో టిఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీచేసిన మాణిక్యరావు మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ధి, మాజీ మంత్రి జె.గీతారెడ్డిపై 37773 ఓట్ల  ఆధిక్యంతో గెలిచారు. 2014లో స్వల్ప మెజార్టీతో గెలిచిన గీతారెడ్డి 2018లో  భారీ తేడాతో ఓటమి చెందారు. మాణిక్యరావుకు 96598 ఓట్లు రాగా, గీతారెడ్డికి 62125 ఓట్లు వచ్చాయి.

సంగారెడ్డి నియోజకవర్గం
2018 సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీచేసిన సీనియర్‌ నేత తూర్పు జయప్రకాస్‌ రెడ్డి   విజయం సాధించారు.  సమీప TRS  ప్రత్యర్ది,  చింతా ప్రభాకర్‌పై 2589 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. జగ్గారెడ్డి 2004లో టిఆర్‌ఎస్‌ పక్షాన గెలిచి కాంగ్రెస్‌ ఐలో చేరారు.

పటాన్‌ చెరు నియోజకవర్గం

2023 
2018 లో పటాన్‌ చెరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌ రెడ్డి TRS నుంచి గెలిచారు. సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ధి కాట శ్రీనివాస గౌడ్‌పై 37799 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. మహీపాల్‌ రెడ్డికి 116326 ఓట్లు రాగా, శ్రీనివాస గౌడ్‌కు 78572 ఓట్లు వచ్చాయి. 

దుబ్బాక నియోజకవర్గం

2023 నియోజకవర్గంలో BRS అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి... బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై విజయం సాధించారు.  2018 లో దుబ్బాక నియోజకవర్గంలో సోలిపేట రామలింగారెడ్డి విజయం సాదించినప్పటికి ఆయన అనారోగ్యంతో 2020లో కన్నుముశారు. ఆ కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజేపి అభ్యర్ధి రఘునందన్‌రావు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి, దివంగతుడు అయిన రామలింగారెడ్డి సతీమణి సుజాతను 1079 ఓట్ల తేడాతో ఓడించారు. మాజీ జర్నలిస్టు అయిన దివంగత రామలింగారెడ్డి 2004, 2008 ఉప ఎన్నిక, 2014, 2018 ఎన్నికలలో గెలిచారు. మొదట దొమ్మాటగా ఉన్న ఈ నియోజకవర్గం, 2009 నుంచి దుబ్బాక కేంద్రంగా నియోజకవర్గం అయింది.

గజ్వేల్‌ నియోజకవర్గం

2023

2018 లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2018 ఎన్నికలలో కూడా గజ్వేల్‌  నుంచి పోటీచేసి ఘనవిజయం సాధించారు. ఆయన అంతకుముందు సిద్దిపేటలో ఆరుసార్లు గెలిచారు. 2014, 2018లలో గజ్వేల్‌ నుంచి గెలిచి ఎనిమిదిసార్లు గెలిచిన ఏకైక తెలంగాణ నేతగా రికార్డు సృష్టించారు. గజ్వేల్‌ లో 2018లో  తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ధి వంటేరు ప్రతాపరెడ్డిపై 56922 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget