అన్వేషించండి

Khammam Assembly Election Results 2023: ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!

Khammam Assembly Election Results 2023 : ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ ఏడాది (2023) గెలిచిన, ఓడిన అభ్యర్థుల జాబితా ఇక్కడ చూడొచ్చు. 2014, 2018 అభ్యర్థుల జాబితా కూడా మీకోసం...

Khammam  Assembly Election Results 2023  constituencies wise winners and losers : 

ఖమ్మం జిల్లాలో 2023 లో గెలిచిన, ఓడిన అభ్యర్థులు.....2018,2014 ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల వివరాలు కూడా ఇక్కడ చూడొచ్చు 

భద్రాచలం (ఎస్టి) నియోజకవర్గం

2023 లో  BRS అభ్యర్థి తెల్లం వెంకట్రావ్.... కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్యపై గెలిచారు..
2018లో భద్రాచలం గిరిజన రిజర్వుడ్‌ నియోజకవర్గంలో పొడెం వీరయ్య  విజయం సాధించారు. సమీప TRS  ప్రత్యర్ది తెల్లం వెంకటరావుపై  11785 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు., 
2014 లో భద్రాచలంలో 2014లో సిపిఎం నేత సున్నం రాజయ్య గెలుపొందారు.సమీప  TDP ప్రత్యర్ధి ఫణీశ్వరమ్మను 1815ఓట్ల తేడాతో ఓడించారు. 

అశ్వారావుపేట (ఎస్టి)

2023 లో  కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ జారే .....BRS అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావుపై విజయం సాధించారు
2018 లో అశ్వారావుపేట గిరిజన రిజర్వుడ్‌ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. నాగేశ్వరరావు తన సమీప TRS  ప్రత్యర్ది..సిట్టింగ్ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై 13117 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

2014లో అశ్వారావుపేటలో YSR కాంగ్రెస్ తరపున పోటీచేసిన తాటి వెంకటేశ్వర్లు గెలుపొందారు. సమీప ప్రత్యర్ధి  టిడిపి అభ్యర్ధి ఎమ్‌.నాగేశ్వరరావును 930 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు.

కొత్తగూడెం నియోజకవర్గం 
2018 లో కాంగ్రెస్‌  పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెంలో విజయం సాధించారు...సమీప ప్రత్యర్ది TRS అభ్యర్థి జలగం వెంకటరావుపై 4139 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత వనమా కూడా టిఆర్‌ఎస్‌ లోకి మారిపోయారు. 
2014లో  TRS  తరపున గెలిచిన ఏకైక నేతగా జలగం వెంకట్రావు ఉన్నారు. కొత్తగూడెం నుంచి ఆయన ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసి 26521 ఓట్ల ఆధిక్యతతో  విజయం సాదించారు.

సత్తుపల్లి (ఎస్సి) నియోజకవర్గం

2018 లో సత్తుపల్లి రిజర్వుడ్‌ నియోజకవర్గంలో TDP తరపున సండ్ర వెంకట వీరయ్య మరోసారి గెలిచారు. సమీప టిఆర్‌ఎస్‌ ప్రత్యర్ధి పిడమర్తి రవిపై 19002 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
2014లో  తన సమీప ప్రత్యర్ధి ఘట్టా దయానంద్‌పై 2485 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు వీరయ్య .

వైరా (ఎస్టి) నియోజకవర్గం

2018 లో వైరా గిరిజన రిజర్వుడ్‌ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా పోటీచేసిన లావుడ్యా రాములు విజయం సాధించారు. TRS అభ్యర్ది మదన్‌ లాల్‌పై 2013 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. 2014 లో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ తరపున గెలిచిన మదన్‌ లాల్‌ ఆ తర్వాత టిఆర్‌ఎస్‌ లో చేరారు
2014 లో ఖమ్మం జిల్లాలో మాత్రమే వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ తన ఉనికిని నిలబెట్టుకుంది. తెలంగాణలో మూడు నియోజకవర్గాలలో ఆ పార్టీ గెలిస్తే అందులో ఒకటి వైరా నియోజకవర్గం కావడం విశేషం.

మధిర (ఎస్సి) నియోజకవర్గం
2023- మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన భట్టి విక్రమార్క...సమీప BRS అభ్యర్థి లింగాల కమల్ రాజ్ పై విజయం సాధించారు                                       2018 లో మధిర రిజర్వుడ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఐ  సిటింగ్‌ ఎమ్మెల్యే, మాజీ ఉప సభాపతి  మల్లు భట్టి విక్రమార్క మూడోసారి గెలిచారు. ఆయన తన సమీప టిఆర్‌ఎస్‌ ప్రత్యర్ది లింగాల కమల్‌రాజ్‌పై 3567 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 
2014 లో మల్లు భట్టి విక్రమార్క 12329 ఓట్ల ఆధిక్యతతో తన సమీప సిపిఎం ప్రత్యర్ధి కమల్‌ రాజ్‌ను ఓడించారు.

పాలేరు నియెఓజకవర్గం
2023- పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ...తన సమీప BRS అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి పై విజయం సాధించారు                      2018 లో పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పక్షాన పోటీచేసిన కందాళ ఉపేందర్‌ రెడ్డి సమీప TRS  ప్రత్యర్ది మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుపై సంచలన విజయం సాధించారు. 
2014లో ఐదోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి స్వర్ణకుమారిని 21863 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. సిపిఎం అభ్యర్ధిగా పోటీచేసిన పోతినేని సుదర్శరావుకు 44245 ఓట్లు రాగా, టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఆర్‌.రవీంద్రకు 4041 ఓట్లు వచ్చాయి. గతంలో వెంకటరెడ్డి సుజాతనగర్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచారు.

ఖమ్మం నియోజకవర్గం

2018 ఖమ్మం నియోజకవర్గంలో TRS  అభ్యర్ధి పువ్వాడ అజయ్‌ కుమార్‌ TDP అభ్యర్ది పి నామా నాగేశ్వరావుపై 10,991 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు
2014లో టీడీపీ తరపున పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావు...కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌ చేతిలో 5609 ఓట్ల తేడాతో ఓడిపోయారు

ఇల్లెందు  నియోజకవర్గం

2013 లో ఇల్లెందు నియోజకవర్గంలో BRS అభ్యర్థి బానోతు హరిప్రియ నాయక్ పై కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలుపొందారు
2018 లో ఇల్లెందులో బానోతు హరిప్రియ నాయక్‌ గెలుపొందారు. BRS అభ్యర్థి కోరం కనకయ్యపై 2907 ఓట్ల ఆధిక్యత వచ్చింది. గెలిచిన తర్వాత హరిప్రియ BRS లో చేరిపోయారు...
2014లో ఇల్లందులో కాంగ్రెస్‌ ఐ అభ్యర్ధి విజయం సాధించారు. కాంగ్రెస్‌ తరపున పోటీచేసిన కోరం కనకయ్య తన సమీప టిడిపి ప్రత్యర్ధి బాణోత్‌ హరిప్రియను 11507 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. ఆ తర్వాత ఆయన BRS లో చేరారు

పినపాక (ఎస్టి) నియోజకవర్గం

2018 లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీచేసిన రేగ కాంతరావు  విజయం సాధించారు. BRS ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై 18567 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 
2014 వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీచేసిన పాయం వెంకటేశ్వర్లు సమీప ప్రత్యర్ధి టిఆర్‌ఎస్‌ నేత శంకర్‌ నాయక్‌ను 14065 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
Holidays in January: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Embed widget