అన్వేషించండి
Advertisement
Telangana Congress First Win: తొలి విజయం కాంగ్రెస్ పార్టీదే, అశ్వారావు పేట అభ్యర్థి ఘన విజయం
Aswaraopeta Election Result: తొలి ఫలితం అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి వెలువడింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ రావు గెలిచారు. మెచ్చా నాగేశ్వరరావుపై ఈయన విజయం సాధించారు.
Aswaraopeta Election Result: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం కాంగ్రెస్ పార్టీ నమోదు చేసింది. తొలి ఫలితం అశ్వారావుపేట నియోజకవర్గం (Aswaraopeta Election Result) నుంచి వెలువడింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ రావు గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఈయన విజయం సాధించారు. దాదాపు 28 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ రావు విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో టీడీపీ తరఫున మెచ్చా నాగేశ్వరరావు అక్కడ గెలిచారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు.
ఇల్లెందు కూడా కాంగ్రెస్ దే..
అటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు (ఎస్టీ) నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య, తన సమీప ప్రత్యర్థి అయిన, బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియ నాయక్ పై గెలుపొందారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తిరుపతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion