అన్వేషించండి

కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ, తుక్కుగూడలో కాంగ్రెస్‌ సభకు అనుమతి నిరాకరణ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయ్. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయ్. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నెల 17న ఎన్నికల సమరశంఖం పూరించేందుకు, పరేడ్‌ గ్రౌండ్‌లో సభ నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకుంది. అదే రోజు ఇతర రాజకీయపార్టీల సభలు ఉండటంతో.. సభ ఏర్పాటుకు అధికారులు అనుమతి నిరాకరించారు. తుక్కుగూడలో నిర్వహించబోయే జయభేరి సభకు అధికారులు అనుమతి నిరాకరించారు. హస్తం పార్టీ దరఖాస్తు చేసుకున్న స్థలం, దేవాదాయ శాఖ భూమి కావడంతో రాజకీయ సభలకు అనుమతి ఇచ్చేది లేదని అధికారులు స్పష్టం చేశారు. 

సీడబ్ల్యూసీ సమావేశాల తర్వాత కాంగ్రెస్​ పార్టీ జయభేరీ సభకు ఏర్పాట్లు చేసుకుంటోంది. పరేడ్ గ్రౌండ్‌ లో అనుమతి నిరాకరించడంతో, తుక్కుగూడలో నిర్వహించాలని హస్తం పార్టీ భావించింది. తుక్కుగూడ వద్ద యాభై ఎకరాలకుపైగా భూమిలో సభ ఏర్పాటు కోసం కాంగ్రెస్‌ దరఖాస్తు చేయగా.. అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సభ నిర్వహించే స్థలం దేవాదాయశాఖకు చెందిన భూమి కావడంతో...రాజకీయ సభలకు అనుమతి ఇవ్వలేమని దేవాదాయశాఖ తెలిపింది. ప్రైవేట్ స్థలాన్ని లీజుకు తీసుకొని...ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. 

 సెప్టెంబర్​ 16న హోటల్​ తాజాకృష్ణలో కాంగ్రెస్​ ఉన్నత స్థాయి సమావేశాలు.. కాంగ్రెస్ వర్కింగ్‌ సమావేశం జరగనుంది. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ ​గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఇతర రాష్ట్రాల పీసీసీ నేతలు, సీఎల్పీ నేతలు హాజరుకానున్నారు. ఈ నెల 16, 17న నిర్వహించబోయే సీడబ్ల్యుసీ సమావేశాలకు, జయభేరి బహిరంగసభకు భద్రత కల్పించాలని డీజీపీ అంజనీకుమార్‌ను కోరారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పరేడ్ గ్రౌండ్​లో సభ పెట్టుకోవాలని దరఖాస్తు చేసుకుంటే.. దానిని కాంగ్రెస్‌కు ఇవ్వకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేశాయని రేవంత్​రెడ్డి ఆరోపించారు. 

మరోవైపు అధికార బీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న పలువురు కీలక నేతలు...కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. ఈ నెల 17న హైదరాబాద్‌లో సోనియాగాంధీ హాజరయ్యే బహిరంగసభలోనే కాంగ్రెస్‌ కండువా కప్పుకునే అవకాశం ఉంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావుతో పాటు బీజేపీ బహిష్కృత నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి హస్తం కండువా కప్పుకోనున్నారు. బీఆర్​ఎస్​కి చెందిన ఓ ఎమ్మెల్యే, మరో మాజీ మంత్రి సహా పలువురిని బహిరంగ సభ వేదికగా పార్టీలో చేరనున్నారు. 

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌ల చేరిక ఖరారైంది. మైనంపల్లితో మొదట పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చర్చించారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్‌ వద్ద తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి, మెదక్‌ అసెంబ్లీ స్థానాలను కేటాయించడానికి కాంగ్రెస్‌ అంగీకరించినట్లు సమాచారం. బీజేపీ తరఫున గెలుపొందిన యెన్నం శ్రీనివాసరెడ్డి ఈ నెల 17నే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. కొంతకాలంగా ఈయన కాంగ్రెస్‌ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయమేంటీ? కేంద్రం ఏం చెబుతుంది?
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయమేంటీ? కేంద్రం ఏం చెబుతుంది?
Pawan Kalyan : తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ -  దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?
తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ - దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?
Telangana Politics : కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ ట్రాప్‌లో బీఆర్ఎస్ - కొండా సురేఖ వ్యూహాత్మకంగానే ఆ వ్యాఖ్యలు చేశారా ?
కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ ట్రాప్‌లో బీఆర్ఎస్ - కొండా సురేఖ వ్యూహాత్మకంగానే ఆ వ్యాఖ్యలు చేశారా ?
ఆడపిల్లలంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
ఆడపిల్లలంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయమేంటీ? కేంద్రం ఏం చెబుతుంది?
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయమేంటీ? కేంద్రం ఏం చెబుతుంది?
Pawan Kalyan : తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ -  దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?
తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ - దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?
Telangana Politics : కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ ట్రాప్‌లో బీఆర్ఎస్ - కొండా సురేఖ వ్యూహాత్మకంగానే ఆ వ్యాఖ్యలు చేశారా ?
కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ ట్రాప్‌లో బీఆర్ఎస్ - కొండా సురేఖ వ్యూహాత్మకంగానే ఆ వ్యాఖ్యలు చేశారా ?
ఆడపిల్లలంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
ఆడపిల్లలంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
Konda Surekha :  గీత దాటిన తెలంగాణ రాజకీయ భాష  - ఏపీ పరిస్థితులే రిపీట్ అవుతున్నాయా?
గీత దాటిన తెలంగాణ రాజకీయ భాష - ఏపీ పరిస్థితులే రిపీట్ అవుతున్నాయా?
Naga Chaitanya: మా వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగకండి - మంత్రి కొండాపై నిప్పులు చెరిగిన నాగ చైతన్య
మా వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగకండి - మంత్రి కొండాపై నిప్పులు చెరిగిన నాగ చైతన్య
Ksheerannam Recipe : దసర నవరాత్రులు ప్రారంభం.. అమ్మవారికి మొదటిరోజు క్షీరాన్నాన్ని ఇలా చేసి నైవేద్యంగా పెట్టేయండి
దసర నవరాత్రులు ప్రారంభం.. అమ్మవారికి మొదటిరోజు క్షీరాన్నాన్ని ఇలా చేసి నైవేద్యంగా పెట్టేయండి
Konda Surekha: దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట... కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎన్టీఆర్, నాని తీవ్ర ఆగ్రహం
దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట... కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎన్టీఆర్, నాని తీవ్ర ఆగ్రహం
Embed widget