అన్వేషించండి

KTR Campaign Plan: టాలీవుడ్ హీరోలను ఇంటర్వ్యూ చేయనున్న కేటీఆర్, పోలింగ్ ముందు రిలీజ్ చేసేలా ప్లాన్

Telangana Assembly Elections: తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల వేళ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని మొదలుపెట్టింది.

హైదరాబాద్‌: ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే బహిరంగ సభలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారం. ఆ తర్వాత ప్రచార రథాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, పోస్టర్లు ద్వారా ప్రజలను ఆకట్టుకునేవారు. అభ్యర్థులు వీధి వీధి తిరిగి ప్రజలను కలిసి తాము చేసిన అభివృద్ధిని వివరించేవారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ట్రెండ్ మారింది. వాయు వేగంతో సమాచారాన్ని ప్రజలకు చేరవేసేలా సోషల్ మీడియాను ప్రచార సాధనంగా మలుచుకుంటున్నారు. డిజిటల్‌ యుగంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుంటే, పదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి.

ప్రచారంలో బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు
తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల వేళ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎఫ్‌ఎం రేడియో టాక్ షోలు, తెలుగు సినీ నటులతో ఇంటర్వ్యూల నుంచి యూట్యూబ్ ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు రెడీ అయింది. మున్సిపల్ మంత్రి కేటీఆర్ పార్టీ ప్రచారాన్ని సరికొత్తగా చేయాలని నిర్ణయించారు. మొన్న మై విలేజ్ షో ద్వారా కేటీఆర్ వీక్షకుల్ని ఆకట్టుకున్నారు. మై విలేజ్ టీంలో గంగవ్వతో సరదాగా ముచ్చటించారు. రుచికరమైన నాటుకోడి కూరని తయారు చేసి సదరు యూట్యూబర్స్ కి రుచి చూపించాడు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధి నుంచి ఉపాధి అవకాశాల కల్పన వరకు వివిధ అంశాలను వీక్షకులకు కేటీఆర్ వివరించారు. ఈ వీడియోకు యూట్యూబ్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ వీడియో గురించి చర్చ జరుగుతోంది.  

హీరోలను ఇంటర్వ్యూలు చేయనున్న కేటీఆర్
మంత్రి కేటీఆర్ సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఇద్దరు ప్రముఖ తెలుగు హీరోలతో కేటీఆర్ ఇంటర్వ్యూల చేస్తే ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తుందని ఆయన సోషల్ మీడియా టీం చెప్పడంతో కేటీఆర్ కూడా ఒకే చెప్పేసినట్లు సమాచారం. త్వరలో బుల్లితెరపైకి తీసుకొచ్చేలా వార్ రూంలోని సలహదారులు కసరత్తు చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, అందునా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలనే కేటీఆర్ వినూత్నంగా ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూలు ప్రశ్నలు, తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న పథకాలపై వివరించేలా ఇంటర్వ్యూలు ఉండనున్నాయి. పోలింగ్ కు ముందు హీరోలతో కేటీఆర్ ఇంటర్వ్యూలను వదిలితే మంచి మైలేజ్ వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. 

కంటెంట్ కోసం వార్ రూమ్స్
రాష్ట్రవ్యాప్తంగా 120 సోషల్ మీడియా వార్‌రూమ్‌లలో 750 మంది సిబ్బంది పార్టీ కోసం కంటెంట్‌ను రూపొందించడంలో బిజీగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి గొప్పగా చెబుతూనే,  ప్రత్యర్థులపై నెగటివ్ కంటెంట్ ను వ్యూహాత్మకంగా రూపొందిస్తున్నారు. 24 గంటలు టీవీ ఛానెల్స్, ఎఫ్ఎం రేడియో స్టేషన్లలో కేటీఆర్ ఇంటర్వ్యూలతో ప్రచారం చేయబోతున్నారు. తద్వారా ప్రజలలో బీఆర్ఎస్ నినాదం మరింత లోతుగా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్జే స్వాతి కేటీఆర్ మీద పాడిన పాట విపరీతంగా వైరల్ అవుతోంది. వీలయినంత ఎక్కువగా జనాలను ఆకర్షించేలా బీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Kawasaki KLX230: ఇండియాలో కవాసకీ సూపర్ బైక్ లాంచ్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఇండియాలో కవాసకీ సూపర్ బైక్ లాంచ్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Kawasaki KLX230: ఇండియాలో కవాసకీ సూపర్ బైక్ లాంచ్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఇండియాలో కవాసకీ సూపర్ బైక్ లాంచ్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget