Contonment Bypoll Result: కంటోన్మెంట్ కాంగ్రెస్ వశం, ఉప ఎన్నికలో చేజార్చుకున్న బీఆర్ఎస్
Contonment Bypoll Results 2024: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ, ఆమె మూడు నెలల్లోనే ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
Contonment Assembly By Poll Result: తెలంగాణ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్.. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితపై గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి శ్రీగణేష్ ఆధిక్యం కనబరుస్తూనే ఉన్నారు. ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి 7,663 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ఆ సమయానికి శ్రీ గణేష్ కు 24,424 ఓట్లు పోలవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు 16,761 ఓట్లు పోలయ్యాయి. 14,712 ఓట్లతో బీజేపీ అభ్యర్థి వంశ తిలక్ కు వచ్చాయి. కౌంటింగ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ గెలుపొందారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ, ఆమె మూడు నెలల్లోనే ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ సాయన్న చిన్న కుమార్తె నివేదితకు టికెట్ కేటాయించింది. అయినా బీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో విజయం సాధించలేకపోయింది.