అన్వేషించండి

Munugode By Election Live Updates: మునుగోడులో కొనసాగుతోన్న పోలింగ్, ఇప్పటి వరకూ 86 శాతం పోలింగ్ నమోదు 

Munugode By Election Live Updates: మునుగోడు పోలింగ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి

LIVE

Key Events
Munugode By Election Live Updates: మునుగోడులో కొనసాగుతోన్న పోలింగ్, ఇప్పటి వరకూ 86 శాతం పోలింగ్ నమోదు 

Background

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో అర్బన్‌లో 35 ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 263 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 298 పోలింగ్ కేంద్రాల్లో 105 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. వాటిపై అధికారుల ప్రత్యేక దృష్టి పెట్టారు. 

సమస్యాత్మక కేంద్రాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలను వెబ్‌కాస్టిగ్ చేపట్టారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురైనా బలగాలను కూడా సిద్ధంగా ఉంచారు. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభంకానుంది. సాయంత్ర ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు ఇతర అధికారులు ఉంటారు. నియోజకవర్గంలో సుమారు రెండు వందల మంది మైక్రో అబ్జర్వర్లను అందుబాటులో ఉంచారు.  

మునుగోడు నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. 5,686 మందికి పోస్టల్ బ్యాలెట్‌ అవకాశం ఉన్నప్పటికీ కేవలం 730 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. ఓటర్ల నుంచి ఫిర్యాదుల కోసం సి-విజిల్‌ యాప్‌ అందుబాటులోకి తెచ్చారు. నేరుగా పోలింగ్‌ కేంద్రం నుంచే గంటకోసారి ఓటింగ్‌ శాతం నమోదు చేయనున్నారు. 

అర్థరాత్రి హైడ్రామా

అర్థరాత్రి మునుగోడు నియోజకవర్గం చండూరులో హైడ్రామా నడిచింది. నియోజకవర్గం వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు మకాం వేసి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి ధర్నా చేశారు. చండూర్ ఆర్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు. తన అనుచరులతో వచ్చి ఆర్వోతో మాట్లాడారు. అనంతరం ఆర్వో కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చున్నారు. 

మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం తాను రాజీనామా చేశానని... ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజగోపాల్ రెడ్డి. రూల్స్‌కు విరుద్ధంగా తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే మకాం వేశారని ఆరోపించారు. అధికారులు పట్టించుకోవట్లేదంటూ ధర్నాకు దిగారు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకలు ఇళ్లల్లోనే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని తెలిపారు. 

స్థానికేతరులు ఉన్నారని ఆర్వోకి ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పోలీసులు పూర్తిగా బిజెపి నాయకులపై వివక్ష చూపిస్తున్నారన్నారు. కేంద్ర బలగాలు వచ్చి మూడు రోజులు అవుతున్నా గ్రామలలో ఎటువంటి భద్రత రక్షణ పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

గత నెల రోజుల నుండి తనపై తన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. మంగళవారం ప్రచారం ముగిసిన నుంచి బయట వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ నేతలు మునుగోడు నియోజకవర్గంలో ఉంటున్నారని ఆక్షేపించారు. తనపై దాడి కారణంగా నియోజకవర్గంలో ఉండే పరిస్థితి లేదన్నారు. తాను రాజీనామా చేసింది మునుగోడు ప్రజల కోసమని... ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని అనుకుంటున్నామన్నారు. బయట వ్యక్తులు మునుగోడు నియోజకవర్గం నుంచి వెళ్లిపోయేవరకు ధర్నా చేస్తామన్నారు. 

పోలీస్ అధికారులు కానీ జిల్లా ఎస్పీ కాని రెండు రోజులుగా ఫోన్లు చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. బయట వ్యక్తుల్ని వెంటనే పంపించాలని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా...? అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో మూటల కట్టలతో మునుగోడు ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నారని ఆక్షేపించారు. 

మునుగోడులో ఓటమి ఖాయమైపోయిందని గ్రహించిన బీజేపీ కొత్త డ్రామాలకు తెరతీసిందని కౌంటర్ ఇచ్చారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి బలం బలగం అపారంగా ఉందన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు మునుగోడు నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు వెళ్లిపోయారని గుర్తు చేశారు. మునుగోడులో గెలవలేక... ఓటమి భయంతో దింపుడు కళ్లెం ఆశలతో రాజగోపాల్ రెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాజగోపాల్ రెడ్డి తాపత్రయమంతా సానుభూతి పొందేందుకేనన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన ధర్నా కార్యక్రమంతో పోలీసులతో బలవంతంగా అరెస్టు చేపించుకొని సానుభూతి పొందే ప్రయత్నం రాజగోపాల్ రెడ్డిదని విమర్శించారు.

20:40 PM (IST)  •  03 Nov 2022

మునుగోడులో కొనసాగుతోన్న పోలింగ్, ఇప్పటి వరకూ 86 శాతం పోలింగ్ నమోదు 

మునుగోడులోని 13 కేంద్రాలలో పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 86 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికారులు అంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారికి టోకెన్లు అందించారు. వారినే ఓట్లు వేసేందుకు అనుమతి ఇస్తున్నారు. 

 

18:54 PM (IST)  •  03 Nov 2022

మునుగోడులో ముగిసిన పోలింగ్, చివరి గంటలో ఘర్షణలు

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ చివరి గంటలో ఘర్షణ వాతావరణం నెలకొంది. చండూరు సహా పలు మండలాల్లో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షకు దిగారు. క్యూలో ఆరు గంటల వరకు వేచిఉన్న వారికి టోకెన్లు అందించి ఓటింగ్ కు అనుమతించారు. 

17:31 PM (IST)  •  03 Nov 2022

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్, సాయంత్రం 5 గంటలకు 77.55 శాతం 

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ 77.55 శాతంగా నమోదు అయింది. నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,41, 805 ఉండగా 1,87,527 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

16:35 PM (IST)  •  03 Nov 2022

కొనసాగుతున్న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్, చండూరులో టీఆర్ఎస్-బీజేపీ నేతల ఘర్షణ  

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారు. చండూరు పట్టణంలో గుంపులుగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీ నేతలను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ , బీజేపీ నేతల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. మునుగోడులో ఇప్పటి వరకూ 59.92 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. 

15:29 PM (IST)  •  03 Nov 2022

మునుగోడు మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్ నమోదు

మునుగోడు ఉపఎన్నికల్లో పోలీంగ్ జోరుగా సాగుంతోంది. మూడు గంటల వరకు 59.92 శాతం పోలింగ్ నమోదైంది. 2లక్షల 41వేల 805 ఓట్లకు గానూ... లక్షా 44వేల 878 ఓట్లు పోల్ అయ్యాయి ఇంకా సుమారు లక్షల మంది ఓట్లు వేయాల్సి ఉంది. ఇప్పటకే వేల మంది పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరి ఉన్నారు. సాయంత్రం ఆరుగంటలతో పోలింగ్ ముగియనుంది. అప్పటి వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీకి షాకిచ్చిన ఈడీ - విశాఖపట్నంలో కీలక ఆస్తులన్నీజప్తు !
వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీకి షాకిచ్చిన ఈడీ - విశాఖపట్నంలో కీలక ఆస్తులన్నీజప్తు !
Telangana News: ప్రస్తుతానికి తెలంగాణ పార్టీ ప్రక్షాళనే- మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టే! 
ప్రస్తుతానికి తెలంగాణ పార్టీ ప్రక్షాళనే- మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టే! 
Super IAS: సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !
సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !
Ramgopal Varma: ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Darien Gap Crossing in Telugu | మానవ అక్రమరవాణాకు దారి చూపెడుతున్న మహారణ్యం | ABP DesamAdvocate Serious on Hydra Ranganath | హైడ్రా కమిషనర్ పై చిందులేసిన అడ్వొకేట్ | ABP DesamMLC Candidate GV Sunder Interview | మూడు నినాదాలతో గ్రాడ్యుయేట్ MLC బరిలో ఉన్నా | ABP DesamVijaya Sai Reddy Counters YS Jagan | నేను ఎవడికీ అమ్ముడుపోలేదు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీకి షాకిచ్చిన ఈడీ - విశాఖపట్నంలో కీలక ఆస్తులన్నీజప్తు !
వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీకి షాకిచ్చిన ఈడీ - విశాఖపట్నంలో కీలక ఆస్తులన్నీజప్తు !
Telangana News: ప్రస్తుతానికి తెలంగాణ పార్టీ ప్రక్షాళనే- మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టే! 
ప్రస్తుతానికి తెలంగాణ పార్టీ ప్రక్షాళనే- మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టే! 
Super IAS: సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !
సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !
Ramgopal Varma: ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
Mana Mitra WhatsApp Governance And Digi Locker: మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో మరిన్ని అప్‌డేట్స్- త్వరలో ప్రతి వ్యక్తికి డిజి లాకర్‌
మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో మరిన్ని అప్‌డేట్స్- త్వరలో ప్రతి వ్యక్తికి డిజి లాకర్‌
Walayar Case: అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న మైనర్లు - కేసులో మిస్టరీ వీడాకా అంతా షాక్ - తల్లే ..
అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న మైనర్లు - కేసులో మిస్టరీ వీడాకా అంతా షాక్ - తల్లే ..
WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. చాట్ జీపీటీలో మెటా ఏఐ కన్నా పవర్ ఫుల్ ఫీచర్లు
వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. చాట్ జీపీటీలో మెటా ఏఐ కన్నా పవర్ ఫుల్ ఫీచర్లు
Jack Teaser: వీడు మాములు క్రాక్ కాదు బాబోయ్... బర్త్‌ డే బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ టీజర్ ఎలా ఉందంటే?
వీడు మాములు క్రాక్ కాదు బాబోయ్... బర్త్‌ డే బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ టీజర్ ఎలా ఉందంటే?
Embed widget