అన్వేషించండి

Mizoram Election Results 2023: ఒకప్పుడు ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్, ఇప్పుడు మిజోరం సీఎం - ఎవరీ లల్దుహోమ?

Mizoram Election Results 2023: 3 దశాబ్దాల తరవాత మిజోరం రాష్ట్రాన్ని కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిగా లల్దుహోమ పరిచయమయ్యారు.

Mizoram Election Results:

లల్దుహోమదే విజయం..

ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ (Zoram People's Movement) మెజార్టీ (Mizoram Election Results 2023) సాధించింది. బీజేపీ మిత్రపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) ఈ సారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుంది. ఇప్పుడు జెడ్‌పీఎమ్‌ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ లల్దుహోమ (Lalduhoma) పేరు బాగా వినిపిస్తోంది. ఆయనే ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చోనున్నారు. అధికార MNFపై  (Mizo National Front) అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు వాటిని నిరూపించడంలోనూ సక్సెస్ అయ్యాలు లల్దుహోమ. అందుకే సులువుగా విజయం సాధించగలిగారు. దీంతో పాటు మద్యపాన నిషేధం అనే హామీని విస్తృతంగా ప్రచారం ( Who is Lalduhoma) చేశారు. ఇది కూడా కొంత వరకూ ZPMకి కలిసొచ్చింది. జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీని స్థాపించింది ఆయనే. సెక్యులరిజమే ఎజెండాగా పార్టీని ముందుకు నడిపించారు. 74 ఏళ్ల లల్దుహోమ...IPS అధికారిగా తన కెరీర్‌ని మొదలు పెట్టారు. గోవాలో IPSగా సేవలందించారు. ఆ తరవాత అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా పని చేశారు. ఈ సమయంలోనే ఆయనకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. 1980ల్లో కాంగ్రెస్‌లో చేరారు. 1984లో మిజోరం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి గెలుపొంది చరిత్ర సృష్టించారు. 1985లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. రెండేళ్ల తరవాత Zoram Nationalist Party (ZNM) పార్టీని స్థాపించారు. ఇది మిజోరం పాలిటిక్స్‌లో గేమ్‌ఛేంజర్ అయింది. 2017లో స్థానికంగా 6 పార్టీలను కలుపుకుని  Zoram People's Movement కూటమిని ఏర్పాటు చేశారు లల్దుహోమ. 

ప్రత్యామ్నాయంగా ఎదిగిన ZPM..

1984లో లల్దుహోమ లోక్‌సభలో ఎంట్రీ ఇచ్చారు. అనుకున్నంత సులువుగా ఆయన పొలిటికల్ జర్నీ కొనసాగలేదు. ఎంపీ అయిన కొద్ది రోజులకే సవాళ్లు ఎదురయ్యాయి. ఫిరాయింపుల చట్టం కింద అనర్హతా వేటుకి గురయ్యారు. ఇలా అనర్హతకు గురైన తొలి ఎంపీగా రికార్డుకెక్కారు. 2020లోనూ ఫిరాయింపుల చట్టం కిందే మిజోరం అసెంబ్లీ ఆయనపై అనర్హతా వేటు వేసింది. అయినా సరే పంతం వీడలేదు లల్దుహోమ. సెర్చిప్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు.  2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లలో 6 స్థానాల్లో గెలిచింది ZPM.2019లో ఈ కూటమి అధికారికంగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందింది. నిజానికి అప్పటి వరకూ ఉన్న మిజోరం రాజకీయాలు లల్దుహోమా ఎంట్రీతో చాలా ఆసక్తికరంగా మారాయి. అప్పటి వరకూ ముఖ్యమంత్రి అభ్యర్థులు అంటే...కాంగ్రెస్ తరపున లాల్ తన్హ్‌వాలా (Lal Thanhwala), MNF నుంచి జోరంతంగ (Zoramathanga) పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ...ఇప్పుడు లల్దుహోమా కూడా ఈ రేస్‌లోకి వచ్చారు. ఆ స్థాయిలో అక్కడి రాజకీయాల్ని ప్రభావం చేయగలిగారు. దాదాపు మూడు దశాబ్దాల తరవాత మిజోరంకి కొత్త ముఖ్యమంత్రిగా లల్దుహోమ పరిచయం అవబోతున్నారు. దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇన్నాళ్లూ మరో ఆప్షన్‌ లేదనుకున్న ఓటర్లకు..బెస్ట్ ఆప్షన్‌గా తమ పార్టీని రేసులో నిలబెట్టారు. అందుకే...ఈ సారి మెజార్టీ మార్క్ సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోయింది జెడ్‌పీఎమ్. 

Also Read: Mizoram Election Results 2023: మిజోరంలో బీజేపీ మిత్రపక్ష పార్టీ MNFకి షాక్, మెజార్టీ సాధించిన ZPM

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
IPL 2025 Mega Auction: 2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌ మెగా ఆక్షన్‌కు వచ్చే ప్లేయర్ల లిస్ట్ ఇదే
2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌ మెగా ఆక్షన్‌కు వచ్చే ప్లేయర్ల లిస్ట్ ఇదే
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Embed widget