Varanasi BJP South Leaders : వారణాశిలో బీజేపీ దక్షిణాది నేతల విస్తృత ప్రచారం - మోదీ మెజార్టీ పెంచేందుకు ప్రయత్నం
Modi : వారణాశిలో మోదీ మెజార్టీ పెంచేందుకు దక్షిణాది రాష్ట్రాల నేతలు ప్రచారం చేశారు. ఏపీ తెలంగాణ ముఖ్య నేతలంతా వారణాశిలో విస్తృతంగా పర్యటించారు.
Elections 2024 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాశి ఓ మినీ ఇండియా. అక్కడ దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉంటారు. అక్కడే స్థిరపడి ఓటర్లుగా కూడా మారారు. వారందరితో మోదీకి వేయించేందుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున వారణాశికి వెళ్లారు.
వారణాసి నియోజకవర్గంలో 18.50 లక్షల ఓట్లున్నాయి. వీరిలో దక్షిణాది ఓటర్లు కనీసం 3 లక్షల పై చిలుకే ఉంటారు. తెలుగు, తమిళ ఓటర్లు 2 లక్షల దాకా ఉంటారు. కన్నడ, మలయాళీలు లక్ష మంది ఉన్నారని అంచనా. కాశీలోనే దక్షిణాది రాష్ట్రాల నిర్వహణలో కనీసం 200 వరకు ఆశ్రమాలున్నాయి. ఇలా వారణాసిలో దక్షిణాది ఓటర్లు కీలకంగా మారారు. తెలుగు వారి ఓట్లు పూర్తి స్థాయిలో మోదీకే అనుకూలంగా పడేలా తెలుగు రాష్ట్రాల నుంచి బండి సంజయ్, విష్ణువర్ధన్ రెడ్డి సహా పలువురు నేతలు ప్రచారానికి వెళ్లారు.
Dear Voters of Varanasi,
— Vishnu Vardhan Reddy (Modi ka Parivar) (@SVishnuReddy) May 28, 2024
Let's continue the journey of development with PM Shri @narendramodi Ji!
His transformative initiatives have brought immense happiness and progress to Kashi.
Your vote will ensure even more growth, prosperity & win of your MP with a huge majority.… pic.twitter.com/wfQj6vaovP
తెలుగు ఆశ్రమాల పెద్దలతో ఉదయం, సాయంత్రం బైఠక్‌లు నిర్వహించారు. గత డిసెంబర్ నుంచే తెలుగు, తమిళ సంగమం పేరుతో వారణాసిలో బీజేపీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. మోదీ స్వయంగా సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. అక్కడి దక్షిణాది ప్రజలు మొదటి నుంచి బీజేపీకే అనుకూలంగా ఉన్నారు. అయితే ఈ సారి మోదీ మెజార్టపై ఎక్కవ దృష్టి పెట్టారు. గతంలో అరవై ఐదు శాతానికిపైగా ఓట్లు మోదీకి వచ్చాయి. ఈ ాసరి 80 శాతం ఓట్లను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా దక్షిణాది వారి ఓట్లు అత్యధికంగా మోదీకే వచ్చేలా చూడాలని విస్తృతంగా ప్రచారం చేశారు.
In Devanga Satram at Varanasi, held an important meet with Mandal presidents of Shyama Prasad Mukherjee Mandal and Madan Mohan Malaviya Mandal, discussing ways to boost voter turnout among Pancha Dravidas in Varanasi. Emphasized increasing support for PM Shri @narendramodi Ji,… pic.twitter.com/rcxfi8hGar
— Bandi Sanjay Kumar (Modi Ka Parivar) (@bandisanjay_bjp) May 22, 2024
ప్రతి 50 మంది ఓటర్లకు ముగ్గురు, నలుగురితో కూడిన బృందం చొప్పున పని చేసింది. ఒక్కో బృందం రోజుకు 4 నుంచి 5 సమూహాలతో భేటీలు నిర్వహించింది. ప్రచార గడువు ముగస్తూండటంతో.. అందరూ అయోధ్యను దర్శించుకుని వెనదిరుగుతున్నారు. మోదీ ఈ సారి కనీ వినీ ఎరుగని మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.