Janasena Chief Pawan Kalyan: ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు - సీఎం సీటుపై పవన్ కళ్యాణ్ తగ్గేదేలే !
మంగళగిలోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన జనసేనన విస్తృత స్దాయి సమావేశంలో పాల్గొన్న పవన్.. రాబోయే ఎన్నికలకు అవసరం అయిన ప్లాన్ అంతా ఫిక్స్ చేసుకొని, ఇకపై తగ్గేది లేదంటూ బహిరంగంగా ప్రకటించారు.
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు.. అయితే ఇకపై తగ్గేది లేదని కూడా డిసైడ్ అయిపోయామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే ఎన్నికల సీజన్ ను దృష్టిలో ఉంచుకుని పవన్ రాజకీయంగా దూకుడు పెంచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇది ఎప్పటి లానే కొన్ని రోజుల వరకు మాత్రమే పరిమితం అవుతుందా.. లేదంటే 2024 అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేసే దాకా కంటిన్యూ అవుతుందా అనేది మాత్రం ఇప్పడు చెప్పలేం.
అవును.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అప్పుడప్పుడు పొలిటికల్ స్క్రీన్ మీదకు వచ్చి స్టేట్ మెంట్ లను ఇచ్చేసి, ఆ తరువాత కొన్ని నెలల వరకు కనిపించరు అనే ప్రచారం కూడా ఉంది. అయితే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్ మెంట్స్ అదే కోవకు వస్తాయేమోనని జనసేన అభిమానులను ఆలోచనలో పడేశాయి. మంగళగిలోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన జనసేనన విస్తృత స్దాయి సమావేశంలో పాల్గొన్న పవన్.. రాబోయే ఎన్నికలకు అవసరం అయిన ప్లాన్ అంతా ఫిక్స్ చేసుకొని, ఇకపై తగ్గేది లేదంటూ బహిరంగంగా ప్రకటించారు. ఇప్పటి వరకు మేము తగ్గి ఉన్నాం కాబట్టి ఇక పై మీరు తగ్గాలంటూ ఇతర పార్టీ (తమతో పొత్తు ఉండే పార్టీ)లకు కూడా పవన్ సూచించినట్లుగా కనిపిస్తోంది. పవన్ చేసిన స్టేట్ మెంట్ ను టీడీపీ వంటి పార్టిలు అంత ఈజీగా తీసుకునే అవకాశం ఉందా అంటే మాత్రం అంత సీన్ లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఓ వైపు చంద్రబాబు సవాల్.. మరోవైపు పవన్ పంతం..
ఇప్పుటికే ఏపీ అసెంబ్లి సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం సీఎం జగన్ మోహన్ రెడ్డికి సవాల్ చేసి బయటకు వచ్చారు. తిరిగి సీఎం సీట్ కోసం టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందనడంలో ఏ సందేహం లేదు. ఇటు జనసేన అధినేత పవన్ సైతం ఏపీ సీఎం కుర్చీ విషయంలో ఇకపై తగ్గేది లేదని పరోక్షంగా స్పష్టం చేశారు. కేవలం సీఎం కుర్చీ కోసమే పవన్ ఇంతలా స్టేట్ మెంట్ ఇచ్చారా అంటే అక్కడ రాజకీయంగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో పార్టీల పరిస్దితులు, వాటి రియాక్షన్ పై ఆరా తీసేందుకే పవన్ ఇలాంటి ప్రకటన ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీలలో టీడీపీ మాత్రం రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉంది. ఇక వామపక్షాల పరిస్దితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక మిగిలింది జనసే, బీజేపి కాబట్టి, రాజకీయాల్లో దూకుడు ప్రదర్శించేందుకు ఇలాంటి స్టేట్ మెంట్ లతో పవన్ అభిమానులు, పార్టీ నాయకుల్లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇక రాబోయే రెండు ఏళ్లపాటు అయినా పవన్ పూర్తిస్థాయి పాలిటిక్స్ లో ఉంటారనే పార్టీ శ్రేణులకు తాజా వ్యాఖ్యలతో పవన్ భరోసా కల్పించారు. ఒకవేళ అదే జరిగితే ఏపీ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారనున్నాయి.