అన్వేషించండి

Fact Check: ఈ ఎన్నికల్లో నెగ్గితే రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రధాని మోదీ అన్నారా? ఆ వార్తలో నిజమెంత

Narendra Modi On Reservation: బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తేలింది.

PM Modi About Reservation- క్లెయిమ్: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతుండగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. భారతీయ జనతా పార్టీ కనుక ఎన్నికలలో గెలిస్తే రిజర్వేషన్లని రద్దు చేస్తామని ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది. 

వైరల్ వీడియోలో 3 క్లిప్ లు ఉన్నాయి- రెండు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వీడియోలు కాగా, ఒకటి మోదీకి సంబంధించిన వీడియో. ఇందులో మోదీ “మోదీ గెలిస్తే కనుక, రిజర్వేషన్లు పోతాయి,” అని అన్నట్లుగా ఉంది. రెండవ క్లిప్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి, పూర్తిగా మార్చివేయడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఎంపీలు ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఒకవేళ ఈ ఎన్నికలలో వాళ్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, లేక రద్దు చేస్తామని’ చెప్పినట్లు వీడియోలో ఉంది. ఇంకొక క్లిప్ లో కాంగ్రెస్, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. 

‘తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తానని మోదీ స్వయంగా చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చటానికే బీజేపీకి 400 సీట్లు కావాలి అంటుంది. అది నిజం కాకుండా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రయత్నిస్తారు. మా చివరి శ్వాస వరకు పోరాడతాము. ఇవి నా మాటలు కావు. ఇతనివి’ అనే టైటిల్ తో ఈ వీడియోని ఓ యూజర్ షేర్ చేశారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు. 

Fact Check: ఈ ఎన్నికల్లో నెగ్గితే రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రధాని మోదీ అన్నారా? ఆ వార్తలో నిజమెంత

వైరల్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (Source: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

వైరల్ అవుతున్న ఈ క్లెయిమ్ అబద్ధం. కాంగ్రెస్ పార్టీని ప్రధాని మోదీ విమర్శిస్తున్న వీడియోని ఎడిట్ చేసి షేర్ చేశారు. 

ఇక్కడ ఏం తెలిసింది..

భారతీయ జనతా పార్టీ (BJP) అధికారిక యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేసిన ప్రధాని మోదీ ఎన్నికల వీడియోలని (ఆర్కైవ్ ఇక్కడ) చూడవచ్చు. ఏప్రిల్ 25న ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో ప్రధాని మోదీ ఓ ర్యాలీలో మాట్లాడుతున్న వీడియో నుంచి తీసుకున్నారు అని తేలింది. ఈ ర్యాలీలో మోదీ స్పీచ్ 44:16 నిమిషాలు ఉండగా.. వైరల్ వీడియోని ఈ వీడియోలో 25:33- 25:39 సమయంలో మీరు గమనించవచ్చు. 

“మోదీ గెలిస్తే కనుక, రిజర్వేషన్లు ఉండవు” అనే మాటల్ని షేర్ చేశారు. మోదీ వాస్తవానికి కాంగ్రెస్ ని విమర్శిస్తూ, “మరొక్కసారి కాంగ్రెస్ తన ఫ్లాప్ సినిమాని విడుదల చేసింది. కాంగ్రెస్ సినిమాలో రెండే మాటలున్నాయి. పై నుండి కింద వరకు అందరూ అదే మాట చెబుతున్నారు.  అందులో మొదటిది, మోదీ గెలిస్తే కనుక నియంతృత్వమే. దీనితో మీరు ఏకీభవిస్తారా? అయినా కూడా వాళ్ళ ఫ్లాప్ సినిమా నడుస్తానే ఉంది. రెండవది ఏమిటంటే, మోదీ గెలిస్తే కనుక రిజర్వేషన్లు మాయమైపోతాయి అని’ కాంగ్రెస్ చెబుతోందని మోదీ అన్నారు. రిజర్వేషన్ గురించి మాట్లాడిన వెంటనే మోదీ, ‘ కాంగ్రెస్ సినిమా ట్రైలర్ మ్యానిఫెస్టో రూపంలో రాగానే, దేశ ప్రజలకి వారి నిజ స్వరూపం తెలిసిపోయింది. వారి ఉద్దేశాలు అర్థమైపోయాయి’ అన్నారు. మోదీ కాంగ్రెస్ ఓబిసి ‘కర్ణాటక మోడల్” ని విమర్శిస్తూ, రిజర్వేషన్లని తమ ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ వీడియోలో రిజర్వేషన్లు రద్దు గురించి మోదీ ఎక్కడా మాట్లాడలేదు. 

రాహుల్ గాంధీ మాట్లాడుతున్నది దేని గురించి?

రాహుల్ గాంధీకి చెందిన వీడియో క్లిప్ లని కర్ణాటకలో బీజాపూర్ లో కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో గాంధీ మాట్లాడిన వీడియో (ఆర్కైవ్ ఇక్కడ) నుండి తీసుకున్నారు.  ఏప్రిల్ 26 న కాంగ్రెస్ అధికారిక యూట్యూబ్ చానల్ లో ఇది లైవ్ స్ట్రీమ్ చేశారు. మొదటి క్లిప్ ని ఈ వీడియోలో 10:34- 10:50 టైమ్ స్టాంప్ మధ్య చూడవచ్చు. రెండవ క్లిప్ ని 11:10-11:20 టైమ్ స్టాంప్ మధ్య గమనించవచ్చు. 

2024 ఎన్నికల నేపధ్యంలో బిజేపీ నాయకులు అనంత కుమార్ హెగ్డే, రాజస్థాన్ లోని నగౌర్ బిజేపీ అభ్యర్ధి జ్యోతి మిర్ధా “బిజేపీ గెలిస్తే కనుక రాజ్యాంగాన్ని మారుస్తాము అన్నారు”. “రాజ్యాంగాన్ని మార్చటానికి” 400 సీట్లు కావాలి అని హెగ్డే అనగా, “దేశ ప్రయోజనాల కోసం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం రాజ్యాంగాన్ని మార్చాలి,” అని మిర్ధా అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల ర్యాలీలలో..  మోదీ ప్రభుత్వం కనుక మళ్ళీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తారని ఆరోపించారు. 

కాంగ్రెస్ విమర్శలకి ప్రధాని మోదీ జవాబు  ఇచ్చారు. ‘బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లని తొలగిస్తుందని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని.. అయితే అంబేద్కర్ స్వయంగా వచ్చినా రాజ్యాంగాన్ని మార్చటం, రిజర్వేషన్లు తొలగించడం కుదరదని’ మోదీ అన్నారు. బీజేపీ నాయకుల వీడియోలని ఎడిట్ చేసి, అసత్యాలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. మోదీ రాజ్యాంగం మారుస్తామని, రిజర్వేషన్లను తీసేస్తామని అంటున్నారంటూ ఫేక్ వీడియోలని షేర్ చేస్తున్నారని లాజికల్లీ ఫ్యాక్ట్స్ టీమ్ నిర్ధారించింది. కొన్నింటిని ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు. 

ఫ్యాక్ట్ (నిజం): ప్రధాని మోదీ వీడియో ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు. తాము ఎన్నికలలో గెలిస్తే కనుక రిజర్వేషన్లని రద్దు చేస్తానని అన్నారని క్లెయిమ్ చేశారు. కానీ ఒరిజినల్ వీడియోలో మోదీ తను ఇలా చేస్తానని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందంటూ ఆ పార్టీని విమర్శించారు. అంతేగానీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రధాని మోదీ ఎక్కడా ప్రకటించలేదని, క్లెయిమ్ తప్పు అని తేలిపోయింది.

This story was originally published by Logically Facts, as part of the Shakti Collective. This story has been edited by ABP Desam staff.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget