Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Lok Sabha Elections 2024: భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ విజయవంతవడంలో కీలక పాత్ర పోషించే సిబ్బంది రెమ్యునరేషన్ పెంచింది ఎన్నికల సంఘఁ.
Elections 2024: భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు అంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య జాతర. భారత దేశంలో సార్వత్రి ఎన్నికలంటే యావత్ ప్రపంచమే నిశితంగా గమనిస్తుంది. అందుకే ఎలక్షన్ నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ప్రక్రియ ప్రారంభిస్తుంది. 18 ఏళ్లు నిండిన వాళ్లంతా ఓటు హక్కు నమోదు చేసుకుని దేశ తలరాతను మార్చే నేతలను ఎన్నుకునేలా ప్రోత్సహిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై ఫోకస్ పెడుతుంది.
ఇదంతా ఒక ఎత్తైత షెడ్యూల్ వచ్చిన తర్వాత దేశంలోని వ్యవస్థలతోపాటు పాలనపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారంలో ఎన్నికల సంఘానికి ఉంటుంది. అందుకే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యే వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రభుత్వంలోని అన్ని విభాగాల సిబ్బంది రాత్రిపగలు శ్రమిస్తుంటారు. కొందరు రోజు వారి విధుల్లో పాల్గొంటే మరికొందరు పోలింగ్, కౌంటింగ్ ఇతర ప్రక్రియల్లో పాల్గొంటారు.
ఇలా ఎన్నికల్లో విధులు నిర్వహించే వారికి ప్రభుత్వం ప్రత్యేక జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇచ్చే రెమ్యూనిరేషన్ పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనికి మార్చి 13నే ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది. ఈసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ క్రింది బాధ్యతల్లో ఉన్న వాళ్లు అందుకునే రెమ్యూనిరేషన్ ఇలా ఉంటుంది.
హోదా | రెమ్యూనిరేషన్ |
సెక్టర్ ఆఫీసర్ | ఐదు వేల రూపాయలు |
మాస్టర్ ట్రైనర్ | రెండు వేల రూపాయలు |
ప్రిసైడింగ్ ఆఫీసర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, రిసెప్షన్ సూపర్‌వైజర్ | రోజుకు 350 రూపాయలు |
పోలింగ్ ఆఫీసర్, కౌంటింగ్ అసిస్టెంట్, రిసెప్షన్ అసిస్టెంట్ | రోజుకు 250 రూపాయలు |
క్లాస్ IV, ఎంటీఎస్ | రోజుకు రెండు వందల రూపాయలు |
ప్యాక్డ్ లంచ్ లేదా లైట్ రిఫ్రెష్‌మెంట్ | రోజుకు 150 రూపాయలు |
వీడియో సర్వేలైన టీం, వీడియో వ్యూయింగ్ టీం, అకౌంటింగ్ టీం, ఎక్సెపెండేచర్ మానిటరింగ్ కంట్రోల్ రూమ్ అండ్ కాల్ సెంటర్ స్టాఫ్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటస్టిక్ సర్వేలైన్స్ టీం, ఎక్స్‌పెండేచర్ మానిటరింగ్ సెల్ | ఇందులో క్లాస్ -i/iiకి 1200 రూపాయలు |
క్లాస్ -iii కి వెయ్యిరూపాయలు | |
క్లాస్ -iv రోజుకు రెండు వందల రూపాయలు | |
మైక్రో అబ్జర్వర్స్ | వెయ్యిరూపాయలు |
అసిస్టెంట్ ఎక్స్‌పెండేచర్ అబర్వర్ | 7500 రూపాయలు |
ఇవన్నీ పోలీసు విభాగానికి కూడా వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు.