అన్వేషించండి
Advertisement
Election Commission: 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు - పోలింగ్ తేదీ ఎప్పుడంటే?
By Polls: ఎన్నికల సంఘం 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసింది. 10 చోట్ల ఎమ్మెల్యేల రాజీనామా, మరో 3 చోట్ల ఎమ్మెల్యేలు మృతి చెందడంతో బైపోల్స్ అనివార్యమయ్యాయి.
EC Scheduled By Polls For 7 States: సార్వత్రిక ఎన్నికల ఇటీవలే పూర్తి కాగా.. ఈ ప్రక్రియ పూర్తైన రోజుల వ్యవధిలోనే కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) మరోసారి ఎన్నికలకు సిద్ధమైంది. మొత్తం 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు (BY Polls) సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల్లో 10 చోట్ల ఎమ్మెల్యేల రాజీనామాలు, మరో 3 చోట్ల ప్రజా ప్రతినిధుల మృతితో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో ఆయా చోట్ల బైపోల్స్ ప్రక్రియను జులై 15లోపు పూర్తి చేయాల్సి ఉందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఈ స్థానాల్లో ఉప ఎన్నికలు
- బీహార్ - రుపౌలీ, పశ్చిమబెంగాల్ - రాయ్ గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగ్దా, మానిక్‌తలా, తమిళనాడు - విక్రవాండీ, మధ్యప్రదేశ్ - అమర్‌వాడా, పంజాబ్ - జలందర్ వెస్ట్.
- ఉత్తరాఖండ్ - బద్రీనాథ్, మంగ్లౌర్, హిమాచల్ ప్రదేశ్ - డెహ్రా, హమీర్ పుర్, నాలాగఢ్ అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో విక్రవాండీ, మంగ్లౌర్, మానిక్‌తలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మృతి చెందగా ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
షెడ్యూల్ ఇదే..
- నోటిఫికేషన్ విడుదల తేదీ - జూన్ 14
- నామినేషన్లకు చివరి తేదీ - జూన్ 21
- నామినేషన్ల పరిశీలన - జూన్ 24
- నామినేషన్ల ఉపసంహరణ గడువు - జూన్ 26
- పోలింగ్ తేదీ - జులై 10
- ఓట్ల లెక్కింపు - జులై 13న ఉంటుందని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Also Read: Modi Cabinet Meet: మోదీ 3.0 కేబినెట్ తొలి భేటీ, తెలుగు మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠ!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion