అన్వేషించండి

Tamil Nadu Assembly Elections: ఎర్లీ ట్రెండ్స్ లో డీఎంకే హవా - మూడో స్థానంలోనే విజయ్ టీవీకే

DMK : తమిళనాడు అసెంబ్లీ కౌంటింగ్ ఎర్లీ ట్రెండ్స్ లో డీఎంకే హవా కనిపిస్తోంది. మూడో స్థానంలోనే విజయ్ టీవీకే పార్టీ ఉంది.

Tamil Nadu Assembly Elections DMK lead: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రారంభ ట్రెండ్స్ అధికార డీఎంకే (DMK) కూటమికే స్పష్టమైన మొగ్గును చూపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ స్థానాల్లో స్టాలిన్ నేతృత్వంలోని కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండటంతో, డీఎంకే శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళా కేంద్రిత పథకాలు ఓటర్లను ఆకర్షించాయని ప్రాథమిక విశ్లేషణలు చెబుతున్నాయి.

మరోవైపు, తమిళ రాజకీయాల్లో కీలక మార్పు తెస్తారని భావించిన నటుడు విజయ్ నేతృత్వంలోని  తమిళగ వెట్రి కళగం (TVK) ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ప్రారంభ ట్రెండ్స్ ప్రకారం, టీవీకే మెజారిటీ స్థానాల్లో మూడో స్థానానికే పరిమితమైంది. విజయ్ వ్యక్తిగత చరిష్మా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో బలమైన సంస్థాగత నిర్మాణం లేకపోవడం ,సంప్రదాయ ఓటు బ్యాంకులను చీల్చడంలో విఫలమవ్వడం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. 

 సోషల్ మీడియాలో ఈ ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ అభిమానులు తమ నాయకుడు కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, రాజకీయ విశ్లేషకులు మాత్రం తమిళనాడులో ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని ఢీకొట్టడం అంత సులభం కాదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూత్ ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపుతారని భావించినా, అది సీట్ల రూపంలోకి మారుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే (AIADMK)  రెండో స్థానంలో కొనసాగుతూ డీఎంకేకు గట్టి సవాలు విసురుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో టీవీకే చీల్చిన ఓట్లు ఏఐఏడీఎంకే అవకాశాలను దెబ్బతీశాయా అనే చర్చ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా, పూర్తి స్థాయి ఫలితాలు వస్తే తప్ప విజయ్ పార్టీ భవిష్యత్తు మరియు తమిళ రాజకీయాల్లో థర్డ్ ఫోర్స్ పరిస్థితిపై స్పష్టత వచ్చేలా లేదు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Advertisement

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget