అన్వేషించండి

కాంగ్రెస్ మొదటి జాబితాలో సీనియర్లకు తప్పని నిరాశ- ఏ వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారంటే?

ఎలాంటి వివాదాలకు తావు లేనివి, ఉన్నా సర్ధి చెప్పుకోదగ్గ నియోజకవర్గాలను మాత్రమే కాంగ్రెస్ తన మొదటి జాబితాలో పెట్టింది. ఇందులో చాలా మంది సీనియర్లకు నిరాశ పరిచింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన మొదటి జాబితాలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. 55 మందితో ప్రకటించిన ఈ జాబితాలో అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకున్నారు. అయితే తమకే టికెట్ వస్తుందని ఆశించిన వారికి కాకుండా వేరే వాళ్ల పేర్లు జాబితాలో ఉన్నాయి. కొందరు కాంగ్రెస్ సీనియర్ల పేర్లు కూడా జాబితాలో ఉండకపోవడం ఆసక్తిని రేపుతోంది. 

ఎలాంటి వివాదాలకు తావు లేనివి, ఉన్నా సర్ధి చెప్పుకోదగ్గ నియోజకవర్గాలను మాత్రమే కాంగ్రెస్ తన మొదటి జాబితాలో పెట్టింది. ఇందులో చాలా మంది సీనియర్లకు నిరాశ పరిచింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే 55 మందిలో 12 మంది ఎస్సీలు ఉన్నారు. ఎస్టీలు ఇద్దరికి చోటు కల్పించారు. 12 మంది బీసీలకు టికెట్లు ఇచ్చారు. ఓసీలు 26 మంది. ఉన్నారు. వెలమ సామాజిక వర్గానికి ఏడుగురురికి, రెడ్డి సమాజాకి వర్గానికి 17 మందికి, బ్రాహ్మణ కులానికి చెందిన ఇద్దరు అభ్యర్థులకు సీటు ఇచ్చారు. వీరిలో వివిధ పార్టీల నుంచి వచ్చిన 12 మంది కూడా ఉన్నారు. ముస్లింలు ముగ్గురు ఉన్నారు. 

సనత్‌నగర్ నుంచి టికెట్ ఆశించిన మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు ఆదిత్యకు నిరాశ తప్పలేదు. ఆయనను కాదని అక్కడ కోట నిలిమ అనే మహిళను అభ్యర్థిగా ప్రకటించారు. జర్నలిస్టుగా పని చేసిన ఈమె సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వంపై, ప్రజాసమస్యలపై పోరాటం చేయడంలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అందుకే ఆదిత్యకు బదులు ఈమెను కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా పని చేస్తున్నారు.  
Image

మరో కాంగ్రెస్ సీనియర్ నేత చెరుకు సుధాకర్‌కి షాక్ ఇచ్చింది కాంగ్రెస్ అధినాయకత్వం ఆయనకు మొదటి జాబితాలో చోటు దక్కలేదు. మొదట బీఆర్‌ఎస్‌లో ఉన్నా ఆయన కేసీఆర్‌తో విభేదించి తెలంగాణ ఇంటిపార్టీ పేరుతో అనే ప్రత్యేక పార్టీ పెట్టి పోరాటం చేశారు. 2022 ఆగస్టులో ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. నకిరేకల్‌ నుంచి టికెట్ వస్తుందని ఆశించారు. ఆయనకు బదులు ఈ మధ్యే బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వీరేశానికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.

మరో సీనియర్ లీడర్ నాగం జనార్ధన్ రెడ్డికి కూడా నిరాశ తప్పలేదు. ఆయన స్థానంలో రాజేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. మేడ్చల్ సీటు తన వర్గానికి ఇప్పేంచేందుకు ప్రయత్నించిన మైనంపల్లికి కాంగ్రెస్ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. మరోవైపు మొదటి లిస్టులో తమపేర్లు ఉంటాయని చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు భావించారు. అలాంటి వారిలో పొన్నం ప్రభాకర్‌, మధుయాష్కీ గౌడ్ ఉన్నారు. వారి పేర్లు ఈ జాబితాలో లేవు. పొన్నం ప్రభాకర్ కరీనంగర్, మధుయాష్కీ ఎల్బీనగర్ టికెట్ ఆశిస్తున్నారు. ఆ రెండు టికెట్లను పెండింగ్‌లో పెట్టింది కాంగ్రెస్. ఆ లిస్ట్‌లో బలరాం నాయక్‌, సురేష్ షెట్కార్ కూడా ఉన్నారు. 

మరోవైపు కాంగ్రెస్‌ పెట్టుకున్న ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ రూల్‌ను తెలంగాణలో పాటించలేదు. మైనంపల్లి ఫ్యామిలీకి రెండు టికెట్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇచ్చారు. మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి నుంచి బరిలో ఉంటే మెదక్‌ నుంచి ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌రావు పోటీ చేస్తున్నారు. హుజూర్‌నగర్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పోటీలో ఉంటే... కోదాడ టికెట్‌పై పద్మావతి రెడ్డి అభ్యర్థిగా ఖరారు చేసింది కాంగ్రెస్ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget