Budi Mutyalanaidu : ఏపీ ఉపముఖ్యమంత్రికి ఎవరికీ రాని కష్టం - ఓడించాలని ప్రచారం చేస్తున్న కుమారుడు
Andhra Politics : తండ్రిని ఓడించాలని బూడి ముత్యాలనాయుడు కుమారుడు ప్రచారం చేస్తున్నారు. అనకాపల్లిలో సీఎం రమేష్ మీద పోటీ చేస్తున్న ఆయనకు ఇది ఇబ్బందికరంగా మారింది.
Budi Muthyalanaidu son is campaigning to defeat his father : ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ పై పోటీ చేస్తున్నాయి. ఆయన నియోజకవర్గం మాడుగుల సీటును కుమార్తెకు ఇప్పించుకున్నారు. అయితే ఆయన కుమారుడు తండ్రితో విబేధించారు. ఇప్పుడు తన తండ్రిని ఓడించాలని ఆయన ప్రచారం ప్రారంభించారు. కాకపోతే ఎమ్మెల్యే సీటు ఇప్పించుకున్న కుమార్తె .. రెండో భార్య సంతానం. ఇప్పుడు ఓడించాలని పిలుపునిస్తు కుమారుడు మొదటి భార్య సంతానం. మొదటి భార్య సంతానంకు న్యాయం చేయకపోవడంతో ఆయన తండ్రికి వ్యతిరేకంగా రంగంలోకి దిగారు.
ఆంధ్ర డిప్యూటీ సీఎం, వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు కుమారుడు రవి కుమార్ తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కన్న కొడుక్కు న్యాయం చేయలేని వ్యక్తి ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఓటర్లూ.. ఒకసారి ఆలోచించి ఓటు వేయండి. మా నాన్న బూడి ముత్యాలనాయుడిని ఓడించండి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఆయన తండ్రిన ఓడించమంటున్నారు కానీ.. ఆయనను మాత్రం పొగుడుతున్నారు. మా నాన్న తులసి మొక్కే కానీ 2019 తర్వాత ఆ మొక్కకి కొన్ని పురుగులు పట్టాయని అంటున్నారు. జగన్‌ని నమ్ముకుని ఆయన వెంట 9ఏళ్లు తిరిగాను కానీ ఏనాడు బూడి ముత్యాలనాయుడి కుమారుడిగా చెప్పుకోలేదన్నారు. ఏమైందో ఏమో కానీ ఐదేళ్లుగా నన్ను రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారని రవికుమార్ అంటున్నారు.
మాడుగుల నుంచి ఇండిపెండెంట్ గా కూడా రవికుమార్ పోటీకి నిలబడ్డారు. గతంలో కూడా జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేయాలని రవి కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కానీ అప్పుడు కూడా బుజ్జగించి నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా చేసి అదే స్థానం నుంచి రెండో భార్య కుమార్తె అనురాధను నిలబెట్టారు. ఇప్పుడు కూడా మాడుగుల నుంచి పోటీ చేయాలని, ఈసారి మాడుగుల టికెట్ తనకే అని ఎన్నో ఆశలు పెట్టుకున్న రవికుమార్‌కు తండ్రి షాకిచ్చారు. ఎమ్మెల్యేగా మొదట తనకే టిక్కెట్ ప్రకటించింది వైసీపీ హైకమాండ్.దీంతో సమస్య రాలేదు. కానీ ఎంపీ అభ్యర్థిగా ఆయనకు చాన్సిచ్చి.. కుమార్తె అనూరాధకు ఎమ్మెల్యే టిక్కెట్ ఖరారు చేయడంతో రవికుమార్ కు కోపం వచ్చింది.
మాడుగుల అసెంబ్లీలో ముత్యాలనాయుడి రెండో భార్య కుమార్తె అనురాధ, మరోవైపు ముత్యాలనాయుడి మొదటి భార్య కుమారుడు రవి పోటీలో ఉన్నారు. టీడీపీ తరపున బండారు సత్యనారాయణూర్తి పోటీలో ఉన్నారు. అనురాధకు పడే ఓట్లను చీల్చడంలో రవి కూమార్ కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని వారు వివరిస్తున్నారు. ఇది కూటమి అభ్యర్థికి ప్లస్‌గా మారుతుందని అనుమానిస్తున్నారు. రవికుమార్ డిమాండ్లను పరిష్కరించి ఆయనతో రాజీ చేసుకోవాలని ముత్యాలనాయుడికి పార్టీ నేతలు సలహాలిస్తున్నారు. కానీ కుమారుడ్ని బుజ్జగించేందుకు ముత్యానాయుడు ఆసక్తి చూపించడం లేదు.