అన్వేషించండి

Exit Poll Results: తమిళనాడులో విజయ్ సంచలనం! బెంగాల్‌లో బీజేపీకి ఆధిక్యం! ఎగ్జిట్ పోల్స్ చెప్పిన జోస్యం ఏంటీ?

Exit Poll Results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌పై చర్చ మొదలైంది. ఫలితాలు రాక ముందే పార్టీలు ప్రమాణ స్వీకారాలకు సిద్ధమవుతున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి, ఎగ్జిట్ పోల్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
  • పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి.
  • తమిళనాడులో డీఎంకే కూటమికి అధికారం దక్కవచ్చని, విజయ్ పార్టీ ఆశ్చర్యపరచవచ్చని కొందరు అంచనా.
  • కేరళ, అస్సాంలలో ప్రభుత్వాధికారం మారవచ్చని, బీజేపీ హ్యాట్రిక్ సాధించవచ్చని సర్వేలు సూచిస్తున్నాయి.

Exit Poll Results: పశ్చిమ బెంగాల్,తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. నాల్గో తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఈ లోపు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఆసక్తిని పెంచేస్తున్నాయి. దాదాపు నెల రోజులపాటు సాగిన ఈ ప్రక్రియలో ఓటర్ తీర్పు ఏంటనే అంశంపై వివిధ సంస్థలు సర్వేలు నిర్వహించాయి. వాటిని బుధవారం సాయంత్ర వెల్లడించాయి. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం ఆరున్నర గంటలకు అంచనాలు ప్రకటించాయి. ఇందులో చాలా ఆసక్తికరమైన లెక్కలు చూసిన విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. 

పశ్చిమ బెంగాల్‌ పీఠంపై ఉత్కంఠ

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలకు జరిగి ఎన్నికల్లో ఈసారి భిన్నమైన అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. 

పోల్ డైరీ, మ్యాట్రిజ్, పి-మార్క్ వంటి సంస్థలు బెంగాల్‌లో ఈసారి బీజేపపీకి ఛాన్స్ ఉంటుందని అంచనాలు వేశాయి. పీ-మార్క్ సర్వే ప్రకారం బీజేపీ 150-175 సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. ఆ పార్టీ మొదటిసారి బెంగాల్‌లో అధికారాన్ని చేపట్టవచ్చు. 

మరోవైపు పీపుల్స్ పల్స్, జన్మత్ పోల్స్ మాత్రం మమత బెనర్జీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటారని చెబుతున్నారు. పీపుల్స్ పల్స్ ప్రకారం టీఎంసీ 177-187 స్థానాలు కైవశం చేసుకుంటుందని అంటున్నారు. 

బెంగాల్‌లో అధిక ఓటింగ్ శాతం ఎవరి నెత్తిన  పాలు పోస్తుంది. ఎవరి కొంప ముంచుతుందో అన్న టెన్షన్ అటు పార్టీల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

తమిళనాడులో విజయ్ సత్తా చాటుతారా?

తమిళనాడులో రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఒక మూడో శక్తి బలంగా వినిపిస్తోంది. అదే విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం. ఇక్కడ కూడా చాలా వరకు డీఎంకే గెలుస్తుందని చెబితే, ఒక్క సర్వే మాత్రం విజయ్ వైపు మొగ్గింది. 

మెజారిటీ సర్వేలు పీపుల్స్ పల్స్, మ్యాట్రిజ్ సహా ఇతర సంస్థలు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతత్వంలోని డీఎంకే కూటమికి అధికారాన్ని కట్టబెట్టాయి. వీరికి 122- 146 సీట్లు రావచ్చని అంచనా. 

అయితే ప్రముఖ సర్వే సంస్థ యాక్సిస్‌ మై ఇండియా మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచే ఫలితాలు వెల్లడించింది. మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేసింది. ఒక వేళ ఇది నిజమైతే తమిళ రాజకీయాల్లో ఇది చారిత్రక మలుపు కానుంది. 

కేరళంలో మార్పునకు ఛాన్స్ 

కేరళం సంప్రదాయం ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే కేరళ ఓటర్లు, ఈసారి ఎల్‌డీఎఫ్‌ను సాగనంపి యూడీఎఫ్‌కు పట్టం కట్టబోతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. దాదాపు అన్ని సంస్థలు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఫ్ 70 నుంచి 90 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. 

అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్‌

ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మాత్రం బీజేపీ తన సత్తా చాటుకోనుంది. 126 స్థానాలకు బీజేపీ 85 నుంచి 100కుపైగా సీట్లు గెలుచుకోవచ్చని అన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి. అక్కడ బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని అంటున్నారు. 

పుదుచ్చేరిలో ఏఐఎన్‌ఆర్‌సీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అధికారం తగ్గే ఛాన్స్ ఉందని సర్వేల అంచనా.

Frequently Asked Questions

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండవచ్చు?

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కొన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా, మరికొన్ని టీఎంసీకి అనుకూలంగా అంచనాలు వేశాయి.

తమిళనాడులో డీఎంకే లేదా విజయ్ పార్టీ గెలుస్తుందా?

చాలా సర్వేలు డీఎంకే కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. అయితే, ఒక సర్వే మాత్రం విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశ్చర్యపరిచే ఫలితాలను వెల్లడించింది.

కేరళలో ఈసారి ప్రభుత్వాన్ని మార్చే అవకాశం ఉందా?

కేరళ ఓటర్లు ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మారుస్తారని, ఈసారి యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని సర్వేలు సూచిస్తున్నాయి.

అస్సాంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది?

అస్సాంలో బీజేపీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ హ్యాట్రిక్ సాధించే అవకాశం ఉందని అన్ని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget